...
...
Next Story

Dhurandhar 2 Trailer: ధురంధర్ 2 ట్రైలర్ అదుర్స్- లయారీ బాద్‌షాగా రణ్‌వీర్- పాకిస్థాన్ భవిష్యత్తును భారత్ తేలుస్తుందంటూ!

Dhurandhar 2 Trailer Released Today: ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ ఇవాళ రిలీజ్ అయింది. గతేడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ధురంధర్ 2 ది రివేంజ్ సినిమా రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ యాక్షన్‌తో అదిరిపోయింది. దీంతో ధురంధర్ 2 ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Published on: Mar 7, 2026, 11:38:20 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) ట్రైలర్ ఇవాళ శనివారం (మార్చి 7) విడుదలైంది.

ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్

ధురంధర్ 2 ట్రైలర్ అదుర్స్- లయారీ బాద్‌షాగా రణ్‌వీర్- పాకిస్థాన్ భవిష్యత్తును భారత్ తేలుస్తుందంటూ!
ధురంధర్ 2 ట్రైలర్ అదుర్స్- లయారీ బాద్‌షాగా రణ్‌వీర్- పాకిస్థాన్ భవిష్యత్తును భారత్ తేలుస్తుందంటూ!

గతేడాది రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ‘ధురంధర్’కు ఈ సినిమా సీక్వెల్ అని తెలిసిందే. మొదటి భాగంలో భారతీయ గూఢచారిగా శత్రువుల గుండెల్లో నిద్రపోయిన రణ్‌వీర్ సింగ్ ఈసారి ఏకంగా ‘లయారీ బాద్‌షా’గా పాకిస్థాన్ గడ్డపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

ధురంధర్ ది రివేంజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. జస్క్రీత్ సింగ్ రంగీ (రణ్‌వీర్ సింగ్) తిరిగి రావడంతో కథలో వేడి పెరిగింది. బలోచ్ ముఠా నాయకుడు రెహ్మాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా)ను అంతం చేసిన తర్వాత, అదే గ్యాంగ్‌లో ఉంటూ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తొలగించే మిషన్‌లో జస్క్రీత్ కనిపిస్తున్నారు.

ఇండియానే తేలుస్తుంది!

‘బాంబే రాకర్స్’ వారి పాపులర్ ‘అరి అరి’ సాంగ్ రీమిక్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంటే, రణ్‌వీర్ యాక్షన్ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరలో రణ్‌వీర్ సింగ్ చెప్పే.. "ఇకపై పాకిస్థాన్ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది (ఇండియానే తేలుస్తుంది)" అనే డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంది.

రెహ్మాన్ డకైత్ మరణం తర్వాత లయారీ బాద్‌షాగా హంజా పట్టాలు చేపడతాడు. ఆ తర్వాత లయారీలో ఏర్పడే పరిస్థితులు, ఎస్పీ చౌదరి అస్లాం ఏం చేశాడు, ఇండియాను నాశనం చేసేందుకు మేజర్ ఇక్బాల్ ప్లాన్ ఏంటీ అనే విషయాలతో అదిరిపోయింది ధురంధర్ 2 ట్రైలర్.

హంజా గురించి నిజం తెలిసి

ఇలా అదిరిపోయే వయోలెంట్ యాక్షన్, ఎమోషన్స్‌తో ధురంధర్ 2 ట్రైలర్ సాగింది. ఇక మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ధురంధర్ 2 సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయితే, ఇదే డేట్‌కి యశ్ టాక్సిక్ మూవీ కూడా విడుదల కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్స్ మూవీస్‌గా మారాయి.

బాక్సాఫీస్ లైన్ క్లియర్

కానీ, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల (US-Israel-Iran conflict) కారణంగా గల్ఫ్ దేశాలలో సినిమా విడుదలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ‘టాక్సిక్’ బృందం తమ విడుదలను జూన్ నెలకు వాయిదా వేసింది.

ఒక్క పవన్ కల్యాణ్‌తోనే

మరోవైపు, రామ్ చరణ్ ‘పెద్ది’, నాని ‘ది ప్యారడైజ్’ చిత్రాలు కూడా మార్చి రేసు నుంచి తప్పుకోవడంతో ‘ధురంధర్ 2’కు బాక్సాఫీస్ వద్ద లైన్ క్లియర్ అయింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మాత్రమే ధురంధర్ 2కి కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks