...
...
Next Story

ఐటమ్ సాంగ్స్‌లో తమన్నా, నోరా ఫతేహిలతో పోలిక- ఆమెతో గొడవలపై తెలుగు హీరోయిన్, ధురంధర్ బ్యూటీ ఆయేషా ఖాన్ కామెంట్స్

బాలీవుడ్ సూపర్ హిట్ స్పై యాక్షన్ మూవీ 'ధురంధర్'లోని 'శరారత్' సాంగ్‌తో పాపులర్ అయిన ఆయేషా ఖాన్ తనను ఐటమ్ సాంగ్స్‌లో నోరా ఫతేహి, తమన్నాతో పోల్చడంపై తాజాగా స్పందించారు. సీనియర్ హీరోయిన్లతో తనను పోల్చడం సరికాదని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని ఆయేషా ఖాన్ వినమ్రంగా చెప్పుకొచ్చారు.

Published on: Feb 8, 2026, 06:18:41 IST
Advertisement

బాలీవుడ్ సెన్సేషనల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'ధురంధర్' (Dhurandhar)లోని 'శరారత్' ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ పాటలో తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించిన ఆయేషా ఖాన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

ఐటమ్ సాంగ్స్‌లో

ఐటమ్ సాంగ్స్‌లో తమన్నా, నోరా ఫతేహిలతో పోలిక- ఆమెతో గొడవలపై తెలుగు హీరోయిన్, ధురంధర్ బ్యూటీ ఆయేషా ఖాన్ కామెంట్స్
ఐటమ్ సాంగ్స్‌లో తమన్నా, నోరా ఫతేహిలతో పోలిక- ఆమెతో గొడవలపై తెలుగు హీరోయిన్, ధురంధర్ బ్యూటీ ఆయేషా ఖాన్ కామెంట్స్

అయితే, నెటిజన్లు ఆయేషా ఖాన్‌ను స్టార్ డ్యాన్సర్లు నోరా ఫతేహి, తమన్నా భాటియాతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్లు అయిన నోరా, తమన్నాతో తనకు పోల్చడంపై ఆయేషా ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.

"నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను"

తనను ఇండస్ట్రీలోని దిగ్గజాలతో పోల్చడంపై ఆయేషా ఖాన్ వినమ్రతను చాటుకున్నారు. "సోషల్ మీడియాలో నన్ను నోరా ఫతేహి లేదా తమన్నా భాటియాతో పోలుస్తూ వస్తున్న రీల్స్ చూశాను. కానీ, నేను ఎప్పటికీ నన్ను వారితో పోల్చుకోలేను. వారిని చూసినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతాను. నోరా చేసే పనులు అద్భుతం, నేను ఆమెలా చేయలేను. ఆమె ఒక ఇన్‌క్రెడిబుల్ పెర్ఫార్మర్" అని ఆయేషా పేర్కొన్నారు.

అలాగే ఈ పోలికలు తనకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వవని ఆయేషా ఖాన్ స్పష్టం చేశారు. "ఎవరైనా నన్ను ఇతరులతో పోల్చడం నాకు ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటే అది పొరపాటే. నేను ఇండస్ట్రీకి కొత్త. వారు జీవితంలో ఎంతో అనుభవాన్ని చూశారు. నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. నాకు వారిపై ఎంతో గౌరవం ఉంది" అని పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయేషా ఖాన్ తెలిపారు.

తమన్నాపై ప్రశంసల వర్షం

'శరారత్' పాటలో తనతో పాటు నటించిన క్రిస్టల్ డిసౌజాతో ఆయేషాకు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయేషా ఖాన్ కొట్టిపారేశారు. "మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. మేమిద్దరం మంచి స్నేహితులం, ఇప్పటికీ కాంటాక్ట్‌లోనే ఉన్నాం. మా మధ్య మంచి గౌరవప్రదమైన అనుబంధం ఉంది" అని వదంతులకు చెక్ పెట్టారు ఆయషా.

ఆయేషా ఖాన్ తెలుగు సినిమాలు

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హిందీ 17 సీజన్‌లో కంటెస్టెంట్‌గా చేసిన ఆయేషా ఖాన్ తెలుగులో శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అలాగే, ముఖచిత్రంలో కూడా ఒక హీరోయిన్‌గా తళుక్కుమంది ఆయేషా. అంతేకాకుండా. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, శర్వానంద్ మనమే వంటి తెలుగులో సినిమాల్లో యాక్ట్ చేసింది బ్యూటిఫుల్ ఆయేషా ఖాన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe