Digital Death OTT Release Today: మనం బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి మన శ్వాస సరిపోదు, ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ రికార్డుల్లో 'అలైవ్' అని ఉండాలి. ఒకవేళ పొరపాటున కంప్యూటర్ స్క్రీన్‌పై మన పేరు పక్కన 'డెడ్' అని వస్తే? మన ఉనికినే సిస్టమ్ తుడిచేస్తే పరిస్థితి ఏంటి?
డిజిటల్ డెత్ ఓటీటీ

సరిగ్గా ఇదే విలక్షణమైన పాయింట్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'డిజిటల్ డెత్' (Digital Death). టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ చాందిని చౌదరి లీడ్ రోల్‌లో నటించిన డిజిటల్ డెత్ ఓటీటీలోకి ఇవాళ (జూలై 5) వచ్చేసింది.
మనదేశంలో టెక్నికల్ గ్లిచ్ లేదా క్లరికల్ తప్పుల వల్ల బతికున్న వృద్ధులకు పెన్షన్లు ఆగిపోవడం, బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ కావడం వంటి ఘటనలను పేపర్లలో తరచూ చూస్తూనే ఉంటాం. తాము బతికే ఉన్నామంటూ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధితుల వేదన అంతా ఇంతా కాదు. దర్శకుడు రామ్ మన్నార్ ఈ సినిమాలో సరిగ్గా అదే పాయింట్‌ను ఒక సీరియస్ థ్రిల్లర్‌లా మార్చి కళ్లకు కట్టారు.
ఆకట్టుకునే డిజిటల్ మాయాజాలం
సాంకేతిక లోపం వల్ల బతికుండగానే ఓ యువతిని ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు చూపిస్తే ఆమె ఎదుర్కొన్న నరకం ఆధారంగా డిజిటల్ డెత్ తెరకెక్కింది. ఒక సాధారణ యువతి జీవితంలో సాంకేతిక లోపం ఎలాంటి తుఫాను తెచ్చిందో ఈ సినిమా చూపిస్తుంది. ఆఫీస్ రికార్డులు, బ్యాంకులు, చివరికి సమాజం కూడా ఆమె ఉనికిని ప్రశ్నిస్తాయి. డేటా తప్పుగా చూపిస్తోందని ఎంత మొత్తుకున్నా చుట్టూ ఉన్న ప్రపంచం సిస్టమ్‌ను నమ్ముతుందే తప్ప మనిషిని నమ్మదు.
"డిజిటల్ మాయాజాలంలో మనుషుల కంటే స్క్రీన్లపై ఉన్న డేటానే సమాజం ఎక్కువగా నమ్ముతోంది" అని చిత్ర బృందం ఈ కథాంశంపై పేర్కొంది. ఈ డిజిటల్ తప్పు నుంచి, వ్యవస్థ చేసిన ఘోరం నుంచి తన గుర్తింపును ఆమె ఎలా కాపాడుకుంది? తనేంటో సమాజానికి ఎలా నిరూపించింది? అనే అంశాలు ఉత్కంఠ రేపుతాయి. చాందిని చౌదరి ఈ డిఫరెంట్ క్యారెక్టర్లో ఎంతో ప్యాషనేట్‌గా నటించింది.
పటిష్టమైన సాంకేతిక బృందం
{{/usCountry}}"డిజిటల్ మాయాజాలంలో మనుషుల కంటే స్క్రీన్లపై ఉన్న డేటానే సమాజం ఎక్కువగా నమ్ముతోంది" అని చిత్ర బృందం ఈ కథాంశంపై పేర్కొంది. ఈ డిజిటల్ తప్పు నుంచి, వ్యవస్థ చేసిన ఘోరం నుంచి తన గుర్తింపును ఆమె ఎలా కాపాడుకుంది? తనేంటో సమాజానికి ఎలా నిరూపించింది? అనే అంశాలు ఉత్కంఠ రేపుతాయి. చాందిని చౌదరి ఈ డిఫరెంట్ క్యారెక్టర్లో ఎంతో ప్యాషనేట్‌గా నటించింది.
పటిష్టమైన సాంకేతిక బృందం
{{/usCountry}}తెలుగు టెక్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డిజిటల్ డెత్ సినిమాలో చాందిని చౌదరితో పాటు ఆదిత్య, సన, సీనియర్ నటుడు ఎస్.ఎస్. కంచి, సి.వి.ఎల్. నరసింహారావు, వినీత, మాధవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ కడియాల, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వై.ఆర్. కృష్ణ అద్భుతమైన విజువల్స్ అందించారు.
ఎస్. సుహాస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని గంభీరతను పెంచింది. బాబు శృంగవరపు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, రాకేష్ కొయ్యలమూడి (నాని) ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఓటీటీలో వైవిధ్యమైన తెలుగు కంటెంట్‌ను కోరుకునే వారికి 'డిజిటల్ డెత్' ఒక మంచి ఛాయిస్.
ఈటీవీ విన్ ఓటీటీలో
కేవలం వినోదం మాత్రమే కాకుండా, మనం టెక్నాలజీపై ఎంతలా ఆధారపడుతున్నామో ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ డెత్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. ఈటీవీ విన్‌లో జూలై 5 నుంచి డిజిటల్ డెత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా ఇవాళ డిజిటల్ డెత్ ఓటీటీ రిలీజ్ అయింది.