...
...
Next Story

Dil Raju: రామానాయుడు తర్వాత అలాంటి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.. దిల్ రాజు కామెంట్స్.. రాజమౌళి పేరు చెబుతూ!

Dil Raju Comments In Toxic Pre Release Event: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ వరల్డ్ సినిమా టాక్సిక్. తాజాగా టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Aug 23, 2026, 15:16:07 IST
Advertisement

Dil Raju Comments In Toxic Pre Release Event: రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.

ఆ డబ్బింగ్ వెర్షన్స్‌లో

రామానాయుడు తర్వాత అలాంటి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.. దిల్ రాజు కామెంట్స్.. రాజమౌళి పేరు చెబుతూ!
రామానాయుడు తర్వాత అలాంటి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.. దిల్ రాజు కామెంట్స్.. రాజమౌళి పేరు చెబుతూ!

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన టాక్సిక్ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది టాక్సిక్.

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌‌లోని మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రామానాయుడు గారి తర్వాత

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "ఈరోజు దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ కేవీఎన్ గారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. రామానాయుడు గారి తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు అభినందనలు" అని అన్నారు.

కథలో ఉన్న బలాన్ని నమ్మి

"‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ గారితో నాకు పరిచయం అయింది. ‘కేజీఎఫ్’ తర్వాత ఎవరైనా ఇంకా పెద్దగా ఆలోచిస్తారు. కానీ, యశ్ గారు మాత్రం ఒక కొత్త దర్శకురాలిని పరిచయం చేస్తూ, కథలో ఉన్న బలాన్ని నమ్మి ‘టాక్సిక్’ సినిమా చేశారు. ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా మార్చాలనే ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్" అని దిల్ రాజు ప్రశంసించారు.

విజువల్స్ చూస్తే మతి పోయింది

"కంపోజర్ విశాల్ మిశ్రా టాక్సిక్ సినిమా రూ.2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. అది ఈ యూనిట్ మొత్తానికి ఈ సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. యశ్ గారితో సినిమా చేయడానికి నేను కూడా వెయిటింగ్. ఆయన అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తుంటాను" అని దిల్ రాజు తన స్పీచ్ ముగించారు.

చాలా మంచి అనుభవం

హుమా ఖురేషి మాట్లాడుతూ.. "మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ముందుగా మా దర్శకురాలు గీతు మోహన్ దాస్‌కు థాంక్స్. ఇంత అద్భుతమైన సినిమాలో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నయనతార, రుక్మిణి వసంత్‌ వంటి వారితో కలిసి నటించడం చాలా మంచి అనుభవం" అని అన్నారు.

చాలా కాలం గుర్తుండిపోతుంది

"యశ్ గారితో కలిసి పనిచేయడం కూడా ఎంతో గొప్ప అనుభూతి. గీతు ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది" అని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హుమా ఖురేషి పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe