Dil Raju About Ramayana OTT Deal And Collection: బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' జైత్రయాత్ర కొనసాగుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లో రామాయణం సినిమాను పంపిణీ చేసిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రామాయణం సినిమా సాధించిన భారీ విజయం, భవిష్యత్ కలెక్షన్ల అంచనాలతో పాటు పలు వివాదాలపై ఆయన స్పష్టత ఇచ్చారు.
రూ. 2000 కోట్ల క్లబ్‌పై దిల్ రాజు ధీమా
నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన 'రామాయణ'కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పౌరాణిక కథలకు ఎప్పుడూ ఉండే ప్రత్యేక ఆదరణ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. సినిమా వసూళ్ల వేగంపై దిల్ రాజు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
"సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును చేరుకుంది. వసూళ్లు అసాధారణంగా ఉన్నాయి. నా అంచనా ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు వసూలు చేస్తుంది. భవిష్యత్తులో చైనాతో పాటు ఇతర దేశాల్లో విడుదల చేస్తే ఆ సంఖ్య ఎక్కడికి వెళ్తుందో ఊహించలేం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తున్నాను" అని దిల్ రాజు వివరించారు.
ఇప్పట్లో ఓటీటీలోకి 'రామాయణ' రాదా?
ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాతలకు, ఓటీటీ సంస్థలకు మధ్య విడుదల తేదీల విషయంలో నెలకొన్న విభేదాలపై కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఓటీటీ సంస్థలు పెడుతున్న కఠిన నిబంధనల వల్ల చిన్న, మధ్య తరహా నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఓటీటీ వ్యాపారం ఎంతవరకు వస్తుంది, మనం సేఫ్ అవుతామా లేదా అని చూసుకున్నాకే ఇప్పుడు సినిమా షూటింగ్‌లు మొదలుపెడుతున్నాం. అదే సమయంలో ఓటీటీ సంస్థలకు కూడా కొన్ని విడుదల ప్రణాళికలు ఉంటాయి. ఒకసారి డేట్ ఇచ్చాక నిర్మాతలు దానికి కట్టుబడి ఉండాలి, లేదంటే ఒప్పందాలు రద్దయ్యే ప్రమాదం ఉంది" అని దిల్ రాజు పేర్కొన్నారు.
{{/usCountry}}"ఓటీటీ వ్యాపారం ఎంతవరకు వస్తుంది, మనం సేఫ్ అవుతామా లేదా అని చూసుకున్నాకే ఇప్పుడు సినిమా షూటింగ్‌లు మొదలుపెడుతున్నాం. అదే సమయంలో ఓటీటీ సంస్థలకు కూడా కొన్ని విడుదల ప్రణాళికలు ఉంటాయి. ఒకసారి డేట్ ఇచ్చాక నిర్మాతలు దానికి కట్టుబడి ఉండాలి, లేదంటే ఒప్పందాలు రద్దయ్యే ప్రమాదం ఉంది" అని దిల్ రాజు పేర్కొన్నారు.
{{/usCountry}}అయితే 'రామాయణ' విషయంలో నిర్మాతలు భిన్నమైన వ్యూహాన్ని అనుసరించారని దిల్ రాజు వెల్లడించారు. "నా సినిమాలన్నీ ఓటీటీ డీల్స్ పూర్తయ్యాకే పూర్తి చేస్తాను. కానీ 'రామాయణ' నిర్మాతలు భారీ బడ్జెట్‌తో సినిమా తీసినప్పటికీ, ఇప్పటివరకు దీని ఓటీటీ, శాటిలైట్ హక్కులను విక్రయించలేదు (ఓటీటీ చేతుల్లో చిక్కుకోలేదు). ప్రస్తుతానికి ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలి. నిర్మాతలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే ఓటీటీలోకి వస్తుంది" అని దిల్ రాజు స్పష్టం చేశారు.
సాయి పల్లవి సీత పాత్రపై విమర్శలకు కౌంటర్
థియేటర్ అనుభూతిని ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అందించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటించగా, సాయి పల్లవి సీత పాత్రలో ఒదిగిపోయారు.
అయితే వాల్మీకి రామాయణానికి భిన్నంగా, ఈ సినిమాలో సీతను కేవలం గృహిణిగానే కాకుండా అవసరమైనప్పుడు ఆయుధం పట్టే యోధురాలిగా దర్శకుడు నితేష్ తివారీ చూపించారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై దిల్ రాజు తనదైన శైలిలో స్పందించారు.
"తెలుగు హక్కులు తీసుకోకముందు, అసలు ఈ సినిమా తీస్తున్నారని తెలిసినప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉండేవి. అందరికీ తెలిసిన కథను మూడు గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఎలా తీస్తారా అనిపించింది. కానీ ప్రివ్యూ థియేటర్లో నేను ఒక్కడినే సినిమా చూసినప్పుడు నా కళ్లలో ఆనందభాష్పాలు తిరిగాయి. ఒంటరిగా చూస్తున్న నాకే అంత భావోద్వేగం కలిగితే, థియేటర్లో ప్రేక్షకులు కచ్చితంగా ఆ అనుభూతిని పొందుతారని అప్పుడే అర్థమైంది" అని దిల్ రాజు గుర్తుచేసుకున్నారు.
సినిమాను సినిమాలాగే చూడాలి
విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని దిల్ రాజు తేల్చిచెప్పారు. "ఇంత అద్భుతమైన ప్రయత్నం జరిగినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం సహజం. కానీ సినిమాను సినిమాలాగే చూడాలని నేను నమ్ముతాను. అప్పుడే థియేటర్లో దాన్ని ఆస్వాదించగలం. సినిమా చూసిన వెంటనే ఉత్తరాదిలో ఇది భారీ విజయం సాధిస్తుందని నాకు అర్థమైంది. ఒకసారి సినిమా ప్రేక్షకులకు చేరువై, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నప్పుడు విమర్శలకు విలువ ఉండదు, కేవలం పాజిటివిటీ మాత్రమే నిలుస్తుంది" అని ఆయన అన్నారు.
రావణుడిగా కన్నడ స్టార్ యశ్ అద్భుత నటన కనబరిచిన ఈ చిత్రంలో, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్న 'రామాయణ పార్ట్-2' 2028 దీపావళికి విడుదల కానుంది. మొదటి భాగం సృష్టిస్తున్న ఈ కలెక్షన్ల సునామీ రెండో భాగంపై అంచనాలను ఆకాశానికి చేర్చింది.