Director Ravi Lokireddy On Kalyanam Kamaneeyam Jeevitham Movie: వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించారు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు.
కళ్యాణం కమనీయం జీవితం ప్రెస్ మీట్

కళ్యాణం కమనీయం జీవితం చిత్రాన్ని ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా టీమ్ సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "రీసెంట్‌గా మా కళ్యాణం కమనీయం జీవితం సినిమాని మా ఫ్రెండ్స్‌కి , శ్రేయోభిలాషులకు కొంతమంది మీడియా మిత్రులకు చూపించడం జరిగింది. సినిమాని చూసిన తర్వాత సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. మంచి వ్యక్తులతో ఈ సినిమా ప్రారంభమైంది" అని అన్నారు.
సినిమా చిన్నదైనా కంటెంట్ పెద్దది
"లెజండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు సినిమా పోస్టర్‌ను, చంద్రబోస్ గారు పాటను విడుదల చేశారు. వీవీ వినాయక్ గారు కూడా మా ఈవెంట్‌కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మంచి ఫ్యామిలీ, యూత్ ఓరియంటెడ్ మూవీగా మా డైరెక్టర్ తీర్చిదిద్దారు. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ అంతా ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు" అని నిర్మాత పైలా ప్రసాద్ రావు తెలిపారు.
"శ్రీ మురళి కార్తికేయ మంచి పాటలను, సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మూవీ చిన్నదైనా కంటెంట్ చాలా పెద్దది. డైరెక్టర్ రవి లోకిరెడ్డి, రైటర్ అరవింద్ ఏకలవ్య మంచిగా సినిమాని తీర్చిదిద్దారు. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు.
100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే
{{/usCountry}}"శ్రీ మురళి కార్తికేయ మంచి పాటలను, సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మూవీ చిన్నదైనా కంటెంట్ చాలా పెద్దది. డైరెక్టర్ రవి లోకిరెడ్డి, రైటర్ అరవింద్ ఏకలవ్య మంచిగా సినిమాని తీర్చిదిద్దారు. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు.
100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే
{{/usCountry}}డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. "టైటిల్ విని మా నిర్మాతలు ఈ సినిమాని ఒకే చేశారు. ఇందులో సాంగ్స్, ట్రైలర్‌కు మంచిరెస్పాన్స్ వచ్చింది. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమాని తీర్చిదిద్దాము. మంచి పాటలు ఉంటాయి, మంచి కథ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది" అని అన్నారు.
"నటీనటులు కొత్త వారైనా చాలా బాగా నటించారు. సత్యానంద్ గారు కూడా నటించారు ఆయన ఎంతోమంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చారు. సినిమాకొచ్చిన ఆడియెన్స్ డిసప్పాయింట్ అవ్వరు. 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే దానికి డబల్ మీరు ఎంజే చేస్తారు చాలా ట్విస్టులు ఉంటాయి" అని దర్శకుడు రవి లోకిరెడ్డి హామీ ఇచ్చారు.
ప్రేమతో చూస్తారని ఆశిస్తున్నా
"ఈనెల 25 న ఆంధ్ర, తెలంగాణలో మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. సినిమా చూసిన వారు అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఇది నా ఛాలెంజ్" అని సవాలు విసిరారు డైరెక్టర్ రవి లోకిరెడ్డి.
హీరోయిన్ సాహితి ఆవంచ మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడు గారికి థాంక్స్. నన్ను నమ్మి నాతో నటించిన అందరికీ థాంక్స్. కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఈనెల 25న రిలీజ్ అవుతోంది. చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను. ప్రేమతో చేసిన ఈ సినిమాని అంతే ప్రేమతో ఆడియన్స్ చూస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.