...
...
Next Story

Mysaa: రష్మిక మందన్నా ఫేస్ మీద రక్తం పెడితే ఎలా ఉంటుందో చూస్తారు, లైఫ్‌ని రిస్క్ చేశారు: దర్శకుడు, నిర్మాత కామెంట్స్

Director And Producer On Rashmika Mandanna In Mysaa Teaser Launch: నేషనల్ క్రష్, విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన్నా నటించిన మరో లేడి ఓరియెంటెడ్ సినిమా మైసా. ఇటీవల మైసా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్‌లో దర్శకుడు రవీంద్ర పుల్లే, నిర్మాత అజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Sep 22, 2026, 06:21:36 IST
Advertisement

Director And Producer On Rashmika Mandanna In Mysaa Teaser Launch: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

మైసా టీజర్ లాంచ్ ఈవెంట్

రష్మిక మందన్నా ఫేస్ మీద రక్తం పెడితే ఎలా ఉంటుందో చూస్తారు, లైఫ్‌ని రిస్క్ చేశారు: దర్శకుడు, నిర్మాత కామెంట్స్
రష్మిక మందన్నా ఫేస్ మీద రక్తం పెడితే ఎలా ఉంటుందో చూస్తారు, లైఫ్‌ని రిస్క్ చేశారు: దర్శకుడు, నిర్మాత కామెంట్స్

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల మేకర్స్ మైసా టీజర్ లాంచ్ చేశారు. మైసా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రవీంద్ర పుల్లె, నిర్మాత అజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దర్శకుడు రవీంద్ర పుల్లె కామెంట్స్

డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ రాస్తున్నప్పుడే రష్మిక గారు హీరోయిన్‌గా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ‘సీతారామం’లో నేను పని చేశాను. అప్పుడే తను నా కొత్త హీరోయిన్ అనుకున్నాను. ఇప్పటివరకు మీరు క్యూట్‌గా, స్వీట్‌గా ఉండే రష్మికను చూశారు. ఈ సినిమాలో రష్మిక ఫేస్ మీద బ్లడ్ పెడితే ఎలా ఉంటుందో అది చూస్తారు" అని అన్నారు.

లైఫ్‌ని కూడా రిస్క్ చేశారు

ప్రొడ్యూసర్ అజయ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. రష్మిక గారు ఈ సినిమా కోసం ప్రాణాలు పెట్టి పని చేశారనిపిస్తుంది. కొన్ని కొన్ని స్టంట్స్ చేయడానికి లైఫ్‌ని కూడా రిస్క్ చేశారు. అద్భుతంగా వచ్చింది. గాయం కాకపోయి ఉంటే ఈపాటికి సినిమా పూర్తి అయిపోయేది" అని తెలిపారు.

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

"చాలా పీక్ సమ్మర్‌లో కేరళలో షూట్ చేశాం. అలాంటి వాతావరణంలో షూట్ చేయడం మామూలు విషయం కాదు. అలాగే మా డైరెక్టర్ రవీంద్ర గారు చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది" అని మైసా టీజర్ లాంట్‌లో నిర్మాత అజయ్ ధీమా వ్యక్తం చేశారు.

మైసా నటీనటులు

ఇదిలా ఉంటే, పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్నా మైసా సినిమాలో రష్మిక మందన్నాతోపాటు ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తిక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ వంటి సెలబ్రిటీలు ఇతర కీలక పాత్రలు పోషించారు.

మైసా టీజర్

ఇక మైసా టీజర్ విషయానికొస్తే.. “అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి తగ్గని గిరిజన మహిళగా ఆమె పాత్ర అద్భుతంగా ఉంది. తాను ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ.. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా మైసా కనిపించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks