Rashmika Mandanna: నీ సినిమా మంచి కె డ్రామాలా ఉంది, నిన్ను చూస్తే అసూయగా ఉంటుంది.. రష్మిక మందన్నా కామెంట్స్

Rashmika Mandanna About Anand Deverakonda In Epic Trailer Launch: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జోడీ కట్టిన సినిమా ఎపిక్. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఎపిక్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎపిక్ ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Sep 5, 2026, 13:31:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rashmika Mandanna About Anand Deverakonda In Epic Trailer Launch: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఈ సినిమాకు డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు.

నీ సినిమా మంచి కె డ్రామాలా ఉంది, నిన్ను చూస్తే అసూయగా ఉంటుంది.. రష్మిక మందన్నా కామెంట్స్
నీ సినిమా మంచి కె డ్రామాలా ఉంది, నిన్ను చూస్తే అసూయగా ఉంటుంది.. రష్మిక మందన్నా కామెంట్స్

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ విడుదల

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఎపిక్ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 4) నాడు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ముఖ్య అతిథులుగా రష్మిక, శివ నిర్వాణ

ఈ సందర్భంగా నిర్వహించిన ఎపిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ, ఎపిక్ సినిమాపై రష్మిక మందన్నా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మీతోపాటే ఫస్ట్ టైమ్ చూస్తున్నా

రష్మిక మందన్నా మాట్లాడుతూ .. "ఆనంద, వైషు ముద్దుగా మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయా. ఇప్పుడు వాళ్ల తర్వాత వామ్మో నేను మాట్లాడాలా అనిపించింది. ఫస్ట్ ఎపిక్ ట్రైలర్ నచ్చిందా మీకు. నాకు నచ్చింది. నేను కూడా మీతోపాటే ఫస్ట్ టైమ్ చూస్తున్నా" అని అన్నారు.

ఎప్పుడు కె డ్రామాలు చూస్తావేంటీ అంటాడు

"నాకు ఎలా అనిపించిందంటే.. నేను ఎప్పుడు కె డ్రామా చూస్తుంటే ఏయ్.. ఎప్పుడు ఏంటీ కె డ్రామాలు చూస్తావని ఆనంద అంటాడు. కానీ, ఇప్పుడు మీ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక మంచి రోమ్ కామ్ కె డ్రామా వైబ్‌లా ఉంది. నేనయితే థియేటర్లలో చూస్తా" అని రష్మిక మందన్నా చెప్పింది.

రణబాలి షూట్‌లో ఉన్నా

"అలాంటి సినిమాలు చేయడం కష్టం. కంగ్రాచ్యులేషన్స్. ఇలాంటి మంచి రొమాంటిక్ కామెడీ కోసం బాగా కష్టపడ్డారు. నిన్న ఆనంద మెసేజ్ చేసి రేపు ట్రైలర్ లాంచ్ ఉంది వస్తావా అని అడిగాడు. రణబాలి షూట్ చేస్తున్నా, హైదరాబాద్‌లో ఉన్నా పక్కా వచ్చేస్తున్నా అని చెప్పేసి వచ్చేశినా" అని రష్మిక మందన్నా తెలిపింది.

నాకు అసూయగా ఉంటుంది

"ఐ జస్ట్ లవ్ దిస్ బాయ్. అతనెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. జస్ట్ సంతోషంగా ఉండు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. చాలా స్మార్ట్‌గా మాట్లాడుతాడు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చాలా మంచిగా మాట్లాడుతాడు. నిజానికి అలా చూస్తుంటే నాకు ఎన్వీయస్ (అసూయ)గా ఉంటుంది. ఎందుకంటే నేను అంత మంచిగా మాట్లాడలేను" అని రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది.

వైష్ణవికి గొప్ప పేరు వస్తుంది

"కడలి పాత్ర గొప్పగా ఉంటుందని ఆనంద చెప్పాడు. ఈ చిత్రంతో వైష్ణవికి గొప్ప పేరు వస్తుంది. ఆదిత్యను చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. ‘90స్’ తర్వాత ఆయనపై బాధ్యత పెరిగిపోయింది. హేషమ్ గారి మ్యూజిక్ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. శివాజీ గారిని ఇక్కడ చూడటం, కలవడం ఆనందంగా ఉంది" అని నేషనల్ క్రష్ పేర్కొంది.

సెప్టెంబర్ 10న ప్రీమియర్స్

"సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ రాబోతోంది. సెప్టెంబర్ 10న ప్రీమియర్లు వేస్తున్నారు. టీంతో కలిసి నేను సినిమాని చూస్తాను. ‘ఎపిక్’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించింది హీరోయిన్ రష్మిక మందన్నా.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More