Jayaho Janardhana Poster Launch: డిఫరెంట్ టైటిల్‌తో తెలుగులో వస్తోన్న లేటెస్ట్ మూవీ జయహో జనార్ధన. ఈ సినిమాను పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాత అయిన పానుగంటి శరత్ రెడ్డి స్వయంగా జయయో జనార్ధన సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
జయహో జనార్ధన నటీనటులు

జయహో జనార్ధన సినిమాలో నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా చేశారు. అలాగే, వీరితోపాటు ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, బీవీఎమ్ శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అలాగే, జయహో జనార్ధన సినిమాకి ఎడిటర్‌గా నందమూరి హరి, కెమెరామెన్‌గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్‌గా భూపతి యాదగిరి పనిచేయగా చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన జయహో జనార్ధన పోస్టర్ లాంచ్ టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా జరిగింది.
సంపత్ నంది విషెస్
లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా జయహో జనార్ధన చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు. జయహో జనార్ధన పోస్టర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది నిర్మాత, డైరెక్టర్ పానుగంటి శరత్ రెడ్డిని, మూవీ టీమ్‌ను అభినందించారు. అలాగే, జయహో జనార్ధన సినిమా మంచి విజయం సాధించాలని సంపత్ నంది ఆకాంక్షించారు.
ఇదిలా ఉంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనే తొలి సినిమా చేసే ఛాన్స్ అందుకున్న సంపత్ నంది టాలీవుడ్లో మాస్, కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి కమర్షియల్ హిట్స్ ఇచ్చిన సంపత్ నంది గౌతమ్ నంద వంటి ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామాను తెరకెక్కించారు సంపత్ నంది.
శివశక్తిగా తమన్నా
{{/usCountry}}ఇదిలా ఉంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనే తొలి సినిమా చేసే ఛాన్స్ అందుకున్న సంపత్ నంది టాలీవుడ్లో మాస్, కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి కమర్షియల్ హిట్స్ ఇచ్చిన సంపత్ నంది గౌతమ్ నంద వంటి ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామాను తెరకెక్కించారు సంపత్ నంది.
శివశక్తిగా తమన్నా
{{/usCountry}}కమర్షియల్ ఫార్మాట్ మార్చి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ మూవీగా ఓదెల సినిమాను నిర్మించి మంచి విజయం అందుకున్నారు డైరెక్టర్ సంపత్ నంది. దీని తర్వాత ఓదెలకు సీక్వెల్‌గా ఓదేల 2 చిత్రాన్ని రూపొందించారు సంపత్ నంది. మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేసిన ఓదెల 2 అంతగా సక్సెస్ సాధించలేకపోయింది.
రూరల్ హారర్ డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓదెల 2లో తమన్నా శివశక్తి అనే విభిన్నమైన పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే సంపత్ నంది తన తదుపరి దర్శకత్వ బాధ్యతల కోసం ఒక భారీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని ఫిలిం నగర్ సమాచారం.
చిరంజీవి, పవన్ కల్యాణ్ కోసం
గతంలో మెగాస్టార్ చిరంజీవి లేదా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని డైరెక్టర్ సంపత్ నంది ప్రయత్నాలు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం, సంపత్ నంది ఒక పవర్ ఫుల్ మల్టీస్టారర్ కథను రాసుకున్నారని, ఇందులో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకపోతే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.