Aishwarya Rai Rejection For Taal Reasons: భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన ప్రతిష్టాత్మక మ్యూజికల్ హిట్ చిత్రాల్లో 'తాళ్' (1999) ఒకటి. ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన ఈ చిత్రం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మంత్రముగ్ధమైన స్వరాలు, ఐశ్వర్య రాయ్ అద్భుత నృత్యాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఐశ్వర్య రాయ్‌ను రెజెక్ట్ చేసిన డైరెక్టర్

ఇందులో 'మాన్సి' అనే గ్రామీణ యువతి పాత్రలో ఐశ్వర్య రాయ్ ఒదిగిపోయిన తీరు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఈ ఐకానిక్ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్‌ను ఎంపిక చేయడానికి డైరెక్టర్ సుభాష్ ఘాయ్ మొదట అస్సలు ఒప్పుకోలేదనే నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది.
హీరోయిన్ పాత్రకు డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్
ఇటీవల ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుభాష్ ఘాయ్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'తాళ్' చిత్రంలో హీరోయిన్ పాత్రకు నృత్యం చాలా కీలకం. దాంతో మాధురీ దీక్షిత్ మినహా అంతటి స్థాయిలో డ్యాన్స్ చేయగల నటి ఎవవరైనా ఉన్నారా అని అప్పటి ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌ను సుభాష్ ఘాయ్ అడిగారు. దానికి సరోజ్ ఖాన్ తడుముకోకుండా ఐశ్వర్య రాయ్ పేరు చెప్పారు.
"ఆమె కాస్మోటిక్ ప్రపంచానికి చెందినది": సుభాష్ ఘాయ్
"సరోజ్ ఖాన్.. ఐశ్వర్య పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఐశ్వర్య కేవలం గ్లామర్, కాస్మోటిక్ ప్రపంచానికి చెందిన మోడల్ అని ఆమెతో చెప్పాను" అని సుభాష్ ఘాయ్ వెల్లడించారు. 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య, పల్లెటూరి వాతావరణంలో పెరిగిన అమాయకపు అమ్మాయి 'మాన్సి' పాత్రకు సరిపోదని ఆయన భావించారు.
మణిరత్నం సినిమాతో మారిన ఆలోచన
మోడలింగ్ రంగం నుంచి వచ్చిన భామగా మాత్రమే ఐశ్వర్యను చూసిన సుభాష్ ఘాయ్‌కు ఓ మిత్రుడు కీలకమైన సలహా ఇచ్చారు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య నటించిన 'ఇరువర్' (తెలుగులో 'ఇద్దరు') సినిమా చూడమని చెప్పారు. మణిరత్నం వేసిన స్పెషల్ షో ద్వారా ఆ సినిమా చూసిన సుభాష్ ఘాయ్, ఐశ్వర్య నటనకు ఫిదా అయిపోయారు.
ఎలాంటి మేకప్ ఉండదని చెప్పా
{{/usCountry}}మోడలింగ్ రంగం నుంచి వచ్చిన భామగా మాత్రమే ఐశ్వర్యను చూసిన సుభాష్ ఘాయ్‌కు ఓ మిత్రుడు కీలకమైన సలహా ఇచ్చారు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య నటించిన 'ఇరువర్' (తెలుగులో 'ఇద్దరు') సినిమా చూడమని చెప్పారు. మణిరత్నం వేసిన స్పెషల్ షో ద్వారా ఆ సినిమా చూసిన సుభాష్ ఘాయ్, ఐశ్వర్య నటనకు ఫిదా అయిపోయారు.
ఎలాంటి మేకప్ ఉండదని చెప్పా
{{/usCountry}}"మణిరత్నం 'ఇరువర్' సినిమా చూసిన వెంటనే, నా కథకు కావలసిన నటి ఈమెనే అని నిర్ణయించుకున్నాను. ఫస్టాఫ్‌లో నీకు ఎలాంటి మేకప్ ఉండదు, ఆ తర్వాత నెమ్మదిగా నీ లుక్ మారుతూ ఒక దివాగా మారతావు అని ఐశ్వర్యతో స్పష్టంగా చెప్పాను" అని సుభాష్ ఘాయ్ ఆ రోజులను గుర్తుచేసుకున్నారు.
అమితాబ్ బచ్చన్‌తో పోలిక
దర్శకుడి ఆలోచనలకు ఐశ్వర్య రాయ్ పూర్తిగా గౌరవమిచ్చి పనిచేసిందని సుభాష్ ఘాయ్ ప్రశంసించారు. ఆమె కట్టుబాటు, శ్రమించే తత్వాన్ని ఆమె మామ, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పోల్చారు. దేశంలోనే అతిపెద్ద స్టార్ అయినప్పటికీ అమితాబ్ బచ్చన్ ఎలాగైతే దర్శకుడి సూచనలను పూర్తిగా పాటిస్తారో, ఐశ్వర్య కూడా అలాగే పనిచేసిందని కొనియాడారు.
తాళ్ నటీనటులు
అనిల్ కపూర్, అక్షయ్ ఖన్నా, అమ్రీష్ పురీ, ఆలోక్ నాథ్ వంటి సీనియర్ నటులు నటించిన 'తాళ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, ఐశ్వర్య రాయ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.