Rukmini Vasanth Files Complaint To Cybercrime Police: సినిమా రంగంలో సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో.. అదే స్థాయిలో సెలబ్రిటీల భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతున్న డీప్‌ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలానికి మరో యంగ్ హీరోయిన్ బలయ్యారు.
సైబర్ నేరగాళ్ల బారిన

'సప్తా సాగరదాచే ఎల్లో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కాంతార చాప్టర్ 1తో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. అయితే, తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు రుక్మిణి వసంత్.
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఏఐ సాంకేతికతను ఉపయోగించి రుక్మిణి వసంత్ బికీనీలో ఉన్నట్లు కొన్ని అసభ్యకర ఫోటోలు, వీడియోలను సృష్టించారు. ఒక సినిమా షూటింగ్‌కి సంబంధించినవంటూ ఈ ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై రుక్మిణి వసంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాధారణ అమ్మాయిలకూ ముప్పే!
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఖండించడమే కాకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు రుక్మిణి వసంత్. బెంగళూరులోని అవంత్రా శారీ కలెక్షన్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న రుక్మిణిని మీడియా ప్రతినిధులు ఈ వివాదంపై ప్రశ్నించారు. అప్పుడు ఆమె స్పందిస్తూ..
"నేను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. మన సైబర్ క్రైమ్ విభాగం దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఇలాంటి దారుణాలు కేవలం నటీమణులకే కాదు, చాలా మంది సాధారణ అమ్మాయిలకూ ఎదురవుతున్నాయి. ఇది ఎంతమాత్రం చేయకూడని పని. ఏఐ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ దాన్ని మంచి పనుల కోసం మాత్రమే వాడాలి. ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదు" అని రుక్మిణి వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులకు ఎలాంటి శిక్ష పడాలనేది చట్టం, సైబర్ క్రైమ్ అధికారులు నిర్ణయిస్తారని, తాను బాధితురాలిగా తన బాధ్యతను పూర్తి చేసి ఫిర్యాదు ఇచ్చానని రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఘాటు ప్రకటన
{{/usCountry}}నిందితులకు ఎలాంటి శిక్ష పడాలనేది చట్టం, సైబర్ క్రైమ్ అధికారులు నిర్ణయిస్తారని, తాను బాధితురాలిగా తన బాధ్యతను పూర్తి చేసి ఫిర్యాదు ఇచ్చానని రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఘాటు ప్రకటన
{{/usCountry}}దీనికి ముందు రుక్మిణి వసంత్ తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలలో ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆ ఫోటోలలో ఉన్నది తాను కాదని, అవన్నీ పూర్తిగా కృత్రిమంగా సృష్టించిన ఫేక్ ఫొటోలని స్పష్టం చేశారు. ఒకరి ప్రైవసీకి భంగం కలిగిస్తూ, ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు.
తన లీగల్ టీమ్ ఇప్పటికే సైబర్ క్రైమ్ యాక్షన్ ప్రారంభించిందని, దయచేసి ఎవరూ ఆ తప్పుడు ఫోటోలను షేర్ చేయవద్దని నెటిజన్లను కోరారు. గతంలో రష్మిక మందన్నా, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్, యశ్ సినిమాలతో బిజీ
ప్రస్తుతం రుక్మిణి వసంత్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారుతున్నారు. ఈ ఈవెంట్‌లో ఆమె తన రాబోయే చిత్రాల గురించి కూడా అప్‌డేట్స్ ఇచ్చారు. శాండల్‌వుడ్ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' (Toxic) సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార వంటి భారీ తారాగణం ఉంది. దీనితో పాటు, తెలుగులో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'డ్రాగన్' (Dragon) లోనూ రుక్మిణి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే.