టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ఫంకీ. ఈ సినిమాలో బ్యూటిపుల్ అండ్ గ్లామర్ బ్యూటి కయాదు లోహర్ హీరోయిన్‌గా చేసింది.
ఫంకీ నిర్మాతలు

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఫంకీ సినిమాను నిర్మించారు. అలాగే, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందించారు.
నిన్న థియేటర్లలో రిలీజ్
టీజర్, ట్రైలర్‌తో కామెడీ తెప్పించిన ఫంకీ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిన్న అంటే ఫిబ్రవరి 13 థియేటర్లలో విడుదల అయింది. అయితే, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. నవ్వుకునేందుకు కామెడీ ఉన్న అది కంప్లీట్‌గా లేదనే ఫీలింగ్ ఆడియెన్స్‌కు కలుగుతోంది.
ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్
స్టోరీ, లాజిక్ వంటి విషయాలు పట్టించుకోవద్దని, కేవలం నవ్వుకోడానికి మాత్రమే ఫంకీ సినిమాకు రావాలని నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్‌లో చెప్పారు. అయితే, సినిమా మొత్తం నవ్వుకునేలా లేదని పలువురు రివ్యూవర్స్ చెబుతున్నారు. ఇలా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోన్న ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఫంకీ ఓటీటీ రైట్స్‌ను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. అయితే, ఫంకీ ఓటీటీ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ మంచి ధరనే వెచ్చిందని టాక్. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లోనే ఫంకీ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్
సినిమాకు వస్తున్న మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్, కలెక్షన్స్, ఇతరత్రా కారణాలతో ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆధారపడనున్నాయి. రెగ్యులర్ ఓటీటీ డీల్స్ ప్రకారం ఫంకీ మూవీ కూడా థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫంకీ బడ్జెట్
{{/usCountry}}సినిమాకు వస్తున్న మిక్స్‌డ్ టాక్ ఎఫెక్ట్, కలెక్షన్స్, ఇతరత్రా కారణాలతో ఫంకీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆధారపడనున్నాయి. రెగ్యులర్ ఓటీటీ డీల్స్ ప్రకారం ఫంకీ మూవీ కూడా థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫంకీ బడ్జెట్
{{/usCountry}}ఇదిలా ఉంటే, ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌తోపాటు వీకే నరేష్, వీటీవీ గణేష్, ఈశ్వరి రావు, సంపత్ రాజ్, రఘుబాబు, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. యాక్టర్స్, టెక్నిషియన్స్ రెమ్యూనరేషన్ ఇతరత్రా ఖర్చులంతా కలిపి ఫంకీ సినిమాకు మొత్తంగా రూ. 15 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం.
ఫంకీ థియేట్రికల్ బిజినెస్
ఇక, ఫంకీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.25 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. కర్ణాటకతోపాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2 కోట్ల వరకు అయ్యాయి.
ఫంకీ హిట్ కొట్టాలంటే?
ఈ లెక్కన వరల్డ్ వైడ్‌గా ఫంకీ సినిమాకు రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే, ఫంకీ సినిమా హిట్ కొట్టాలంటే బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 14 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్, రూ. 28 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. మరి ఫంకీ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.