...
...
Next Story

OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మంచి ఫీల్ గుడ్ తెలుగు సినిమా- సైకిల్‌తో గుండెలకు హత్తుకునే కథ- ఇక్కడ చూసేయండి!

Gnapakalu OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ మంచి ఫీల్ గుడ్ తెలుగు సినిమా జ్ఞాపకాలు స్ట్రీమింగ్ అవుతోంది. శతమానం భవతి డైరెక్టర్ వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతి ఒక్కరి బాల్య స్మృతులను తట్టిలేపేలా సాగుతుంది. మరి జ్ఞాపకాలు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 6, 2026, 13:55:20 IST
Advertisement

Gnapakalu OTT Release Today: మనం నివసించే ఇల్లు, వాడే వస్తువులు కేవలం అవసరాల కోసం మాత్రమే కాదు. వాటి వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, తీపి అనుబంధాలు దాగి ఉంటాయి. నగర జీవితంలో ఎంత బిజీగా మారినా మూలాలను మర్చిపోలేమనే ఆధ్యాత్మిక సత్యాన్ని చాటిచెబుతూ ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సినిమానే జ్ఞాపకాలు.

నేషనల్ అవార్డ్ విన్నర్

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మంచి ఫీల్ గుడ్ తెలుగు సినిమా- సైకిల్‌తో గుండెలకు హత్తుకునే కథ- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మంచి ఫీల్ గుడ్ తెలుగు సినిమా- సైకిల్‌తో గుండెలకు హత్తుకునే కథ- ఇక్కడ చూసేయండి!

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్ రూపొందించిన తెలుగు ఎమోషనల్ డ్రామా ఓటీటీ సినిమా జ్ఞాపకాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది.

పాత సైకిల్.. చెరిగిపోని స్మృతులు!

తల్లిదండ్రుల మరణం తర్వాత కథానాయకుడు శివ తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. తమ పూర్వీకుల ఆస్తిపాస్తులను, ఇల్లును అమ్మేసి శాశ్వతంగా నగరానికి వెళ్లిపోవాలనేది అతని ఆలోచన. ఈ క్రమంలో ఇంట్లోని పాత సామాన్లను సర్దుతుండగా, ఒకప్పుడు తన తండ్రి వాడిన సైకిల్ అతని కంటపడుతుంది.

సైకిల్‌తోనే తండ్రి జ్ఞాపకాలు

ఆ పాత సైకిల్‌ను చూడగానే శివ మనసంతా ఒక్కసారిగా గతంలోకి జారుకుంటుంది. బాల్యంలో ఆ సైకిల్‌పై తండ్రితో కలిసి ఊరంతా తిరిగిన రోజులు, స్నేహితులతో సాగిన సరదాలు, పల్లెటూరి జ్ఞాపకాలన్నీ అతని కళ్లముందు కదలాడుతాయి. తనకు సైకిల్ నేర్పించిన తండ్రి జ్ఞాపకాలు దాంతోనే ముడిపడి ఉంటాయి.

జాబ్ నుంచి ప్రేమించిన అమ్మాయి వరకు

అంతేకాకుండా ఆ సైకిల్‌పైనే తండ్రి డ్రాప్ చేయడంతో వచ్చిన జాబ్, అదే సైకిల్‌పై ప్రేమించిన అమ్మాయి వెంటపడటం అన్నీ శివ మనసును కమ్మేస్తాయి. ఆస్తిని అమ్మేసి వెళ్లాలనుకున్న శివ మనసు ఆ ఒక్క క్షణంలోనే మారిపోతుంది. ఆ పాత సైకిల్ కేవలం ఇనుప ముక్క కాదని, తన కుటుంబ మూలాలకు గుర్తుగా భావిస్తాడు. దానిని బాగు చేయించి, పదిలమైన జ్ఞాపకంగా తన వెంట నగరానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు శివ.

వేగేశ్న సతీష్ మార్కు ఎమోషన్స్!

వెంకటేష్ బొల్లా అందించిన నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్‌ను మరింతగా పండించింది. దాము నర్రావుల ఛాయాగ్రహణం పల్లెటూరి వాతావరణాన్ని ఎంతో అందంగా కెమెరాలో బంధించింది. సొంత ఊళ్లకు, చిన్ననాటి అనుబంధాలకు దూరమవుతున్న ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన కథ ఇది.

జ్ఞాపకాలు ఓటీటీ స్ట్రీమింగ్

ఇంతటి మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా సినిమా జ్ఞాపకాలు ఓటీటీలో సందడి చేస్తోంది. అచ్చతెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో జ్ఞాపకాలు ఓటీటీ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 6 నుంచి ఈటీవీ విన్‌లో జ్ఞాపకాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈటీవీ విన్ ఓటీటీలో

ఈటీవీ విన్ కథా సుధ మొదటి సీజన్‌లో భాగంగా వచ్చిన ఈ 73వ ఎపిసోడ్, ప్రేక్షకులలో తమ చిన్ననాటి రోజులను నెమరువేసుకునేలా చేస్తోంది. చిన్ననాటి స్మృతులు, సైకిల్ నేర్చుకుని తొక్కిన మధురానుభూతులు గుర్తుతెచ్చుకోడానికి ఈటీవీ విన్ ఓటీటీలోని జ్ఞాపకాలు సినిమా చూసేందుకు మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe