Gunde Ninda Gudi Gantalu Chinthamani Comments On Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్‌లో చింతామణి అనే విలన్ పాత్రలో బాగా ఆకట్టుకుంటోన్న నటి శ్రావణ సంధ్య.
ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా

తెలుగు సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా మోడల్, డ్యాన్సర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శ్రావణ సంధ్య. గమ్యం, గమనం, శ్రీరంగపురం, వేదం, గోలీమార్, శశిరేఖా పరిణయం, లెజెండ్, జాంబీరెడ్డి, కృష్ణం వందే జయద్గురం తదితర సినిమాల్లో నటించి అట్రాక్ట్ చేసింది నటి శ్రావణ సంధ్య.
అయితే, ఒకానొక సమయంలో అల్లు అర్జున్ తనపై చేసిన కామెంట్స్ గురించి గుండె నిండా గుడి గంటలు సీరియల్ చింతామణి అలియాస్ శ్రావణ సంధ్య ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇప్పుడు శ్రావణ సంధ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎవరో కాదు అల్లు అర్జున్ గారే
"వేదం సినిమాకు మీకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఎవరో చెప్పారు.. నమ్మలేదు ఆ ఆర్టిస్టును పెట్టారా.. ఆర్టిస్టా.." అని యాంకర్ అడుగుతుంటే.. "ఎవరో కాదు.. అల్లు అర్జున్ గారే గమ్యం మూవీకి.. నేను వర్క్ చేశాకా ఆయన 7 అప్ యాడ్‌కు వెళ్లాం" అని శ్రావణ సంధ్య చెప్పుకొచ్చారు.
"హీరోగారిది అల్లు అర్జున్ గారిది 7 అప్ యాడ్‌కి.. ముంబై వాళ్ల యాడ్‌కు మేము మోడల్స్‌గా వెళ్లాం. ఏవండి నేను ఇండస్ట్రీలో మోడల్స్‌గా వర్క్ చేశా.. డ్యాన్సర్‌గా వర్క్ చేశా.. ఆర్టిస్ట్‌గా చేశా.. కానీ జూనియర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకు చేయలేదు దేవుడి దయ వల్ల. చిన్న ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ప్యాడింగ్ ఆర్టిస్టు ప్లేస్‌కు వచ్చా" అని చింతామణి తెలిపింది.
ఇప్పుడంటే కాస్తా కలర్ వచ్చా..
{{/usCountry}}"హీరోగారిది అల్లు అర్జున్ గారిది 7 అప్ యాడ్‌కి.. ముంబై వాళ్ల యాడ్‌కు మేము మోడల్స్‌గా వెళ్లాం. ఏవండి నేను ఇండస్ట్రీలో మోడల్స్‌గా వర్క్ చేశా.. డ్యాన్సర్‌గా వర్క్ చేశా.. ఆర్టిస్ట్‌గా చేశా.. కానీ జూనియర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకు చేయలేదు దేవుడి దయ వల్ల. చిన్న ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ప్యాడింగ్ ఆర్టిస్టు ప్లేస్‌కు వచ్చా" అని చింతామణి తెలిపింది.
ఇప్పుడంటే కాస్తా కలర్ వచ్చా..
{{/usCountry}}"అలా నేను ఫస్ట్ ఎప్పుడైతే మోడల్‌గా చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 7 అప్ యాడ్ షూటింగ్‌కి వెళ్లాం. డస్కీ స్కిన్.. ఇప్పుడున్నా కాస్తా కలర్ వచ్చాను.. మా ఆయన పెట్టే పెట్టుడుకి.. సారీ.. భోజనం" అని తెగ నవ్వేసింది గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటి శ్రావణ సంధ్య. దానికి యాంకర్ కూడా నవ్వేశాడు.
తర్వాత శ్రావణ సంధ్య చెబుతూ.. "అప్పుడు చాలా డస్కీగా ఉండేది స్కిన్. ఆయన కామెడీ చేసేవారన్నమాట.. ఏంటీ ఈ కలర్ అని జస్ట్.. ఇంతకుముందు ఏమేం చేశావ్ అని సరదాగా మాట్లాడారు. సర్ నేను సో అండ్ సో మూవీలో నక్సలైట్‌గా చేశాను. నేను షూట్ క్యారెక్టర్స్ లేనప్పుడు మోడల్‌గా కూడా చేస్తుంటాను" అని అన్నారు.
అంత పెద్ద హీరో కాకపోయినా..
"కొంచెం మంచి మోడల్స్‌గా అంటే ఆరోజుల్లో రూ. 600, వెయ్యి రూపాయలు, 1500 అంటే ఎక్కువ. 2005, 2006 టైమ్‌లో. ఇలా అని చెబితే.. గమ్యం మూవీలో నక్సలైటా.. నువ్వా.. అవునండీ నేనే.. ఏమనుకోనంటే ఓ మాట అన్నారు.. పర్లేదు చెప్పండి అన్నాను. ఎవర్తిరా ఇది.. నిజంగా నక్సలైట్‌ను తీసుకొచ్చి పెట్టారనుకున్నాను. అది మీరేనా. అని నన్నే నా మొహంమీదే అన్నారు" అని అసలు విషయం తెలిపింది నటి శ్రావణ సంధ్య.
"అంటే, అప్పటికీ ఆయన అంత పెద్ద హీరో కాకపోయినా.. అల్లు అర్జున్ అంటే మంచి పేరుంది. చిరంజీవి ఫ్యామిలీ నుంచి అంటే మాకు చాలా ఇష్టము. అలాంటి ఆయన నోటి నుంచి ఆ మాటలు వినడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికొచ్చాకా.. నన్ను ఇలా పొగిడారు పొగిడారు అని పంచుకోవాలనిపించింది" అని గుండె నిండా గుడి గంటలు చింతామణి చెప్పుకొచ్చింది.