Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పూలు అమ్ముకునేవాళ్లు అంటే ఆఫ్ట్రాలా అంటూ మనోజ్‌ను బెల్టుతో బాదుతుంది. అది చూసి భయపడిన ప్రభావతి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. ఇంతలో రోహిణి వస్తే కొడుతుందని మనోజ్ చెబుతాడు.
మొగుడు పెళ్లాలని చితక్కొట్టిన మీనా

నా భర్తను కొడతావా ఎంత ధైర్యం అని రోహిణి అంటుంది. ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే పార్లరమ్మా అని మీనా అంటే రోహిణి షాక్ అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తే నీ మొగుడుకు చికెన్ సూప్ నేను చేయాలా అని మీనా అంటుంది. చేయు నువ్వు ఉంది అందుకేగా అని రోహిణి అంటుంది.
నాకు ఇంకో పని లేదా. నీకు, నీ మొగుడుకి ఆ తైతక్కలాడే ముసలి అత్తకు నేను పని మనిషిలా కనిపిస్తున్నానా. నువ్వు చేసి పెట్టవే నీ మొగుడుకి సూపు అని రోహిణిని కూడా బెల్టుతో కొడుతుంది మీనా. మొగుడు పెళ్లాలను ఇద్దరిని చితక్కొడుతుంది మీనా. బర్రె మొహం అంటూ మనోజ్‌ను తెగ తిడుతుంది. ప్లీజ్ దండం పెడతాను అని కింద కూర్చుని దండం పెడుతుంది రోహిణి.
ఇంకోసారి నన్ను చులకనగా చూస్తారా అని అడిగితే లేదని మనోజ్, రోహిణి చెబుతారు. ఇక మిగిలింది అత్తావతి. ఏయ్.. బయటకు రా.. నేను చేసేది చచ్చేదాకా మర్చిపోవు అని అత్తను పిలుస్తుంది మీనా. ఏంటీ ఇందాక ఏదో అన్నావ్ చెప్పు అని గద్దించిన మీనా బెల్టుతో కొట్టబోతుంది. దానికి ప్రభావతి గట్టిగా అరుస్తుంది. దాంతో మీనా తేరుకుని ఇదంతా నా కల అని నవ్వుతుంది.
మీనాపై నవ్వే దెయ్యం
ప్రభావతి, మనోజ్‌ను చూసి తెగ నవ్వుతుంది మీనా. ఇంతలో రోహిణి నిజంగానే వస్తుంది. రోహిణిని కూడా చూసి నవ్వుకుంటూ మీనా వెళ్లిపోతుంది. బాలు వస్తే నీ పెళ్లాం నవ్వుతుందని కంప్లైంట్ చేస్తారు. దానికి మీనాను పిలుస్తాడు బాలు. ఎందుకు నవ్వొచ్చిందని బాలు అడిగితే.. మళ్లీ పదే పదే నవ్వుతుంది మీనా. నవ్వే దెయ్యం పట్టిందా అని ప్రభావతి అంటుంది.
{{/usCountry}}ప్రభావతి, మనోజ్‌ను చూసి తెగ నవ్వుతుంది మీనా. ఇంతలో రోహిణి నిజంగానే వస్తుంది. రోహిణిని కూడా చూసి నవ్వుకుంటూ మీనా వెళ్లిపోతుంది. బాలు వస్తే నీ పెళ్లాం నవ్వుతుందని కంప్లైంట్ చేస్తారు. దానికి మీనాను పిలుస్తాడు బాలు. ఎందుకు నవ్వొచ్చిందని బాలు అడిగితే.. మళ్లీ పదే పదే నవ్వుతుంది మీనా. నవ్వే దెయ్యం పట్టిందా అని ప్రభావతి అంటుంది.
{{/usCountry}}నీ నవ్వు బాగుంది. ఇంతలా నువ్వు నవ్వలేదని బాలు అంటాడు. దాంతో మీనా నిజం చెబుతుంది. దానికి బాలు కూడా తెగ నవ్వుతాడు. అప్పుడు నేను ఉంటే బాగుండేదని బాలు అంటాడు. బయట సత్యం బాలు, మీనా నవ్వులు విని సంతోషిస్తాడు. ఇంట్లోకి వచ్చి అడుగుతాడు. మీనా నవ్వుతో చంపేస్తుందని బాలు అంటాడు.
ప్రభావతి, మనోజ్, రోహిణి మాకు మండిపోతుందని అంటే.. బెల్టు వల్లా అని మీనా పంచ్ వేస్తుంది. మళ్లీ ఇద్దరు నవ్వుతారు. మీనా ఎలా చిరునవ్వుతో మొదలుపెట్టి ముసిముసి, వెకిలి, పడిపడి నవ్వుతుందని అచ్చం మీనాలాగే ఇమిటేట్ చేస్తుంది ప్రభావతి. కారణం అడగమని ప్రభావతి అంటే.. అడగను. చాలా కాలం తర్వాత నా కోడలు గలగలా నవ్వుతుందని, మిమ్మల్ని ఆటాడుకుంటోందని, బాగా నవ్వుకోండ్రా అని చెప్పేసి వెళ్లిపోతాడు సత్యం.
శ్రుతికి డైమండ్ రింగ్
మరోవైపు శ్రుతి గురించి శోభనను సురేంద్ర అడుగుతాడు. అక్కడ ఏదో గొడవ జరిగే ఉండి ఉంటుందని సురేంద్ర అంటాడు. ఇంతలో శ్రుతి వచ్చి కాఫీ అడుగుతుంది. రావడానికి కారణం అడిగితే శ్రుతి కోప్పడుతుంది. కాలం కలిసి వచ్చింది కూతురు ఇంటికి వచ్చిందని శోభన అంటుంది. అల్లుడు కూడా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే అని సురేంద్ర అంటాడు.
ఇంతలో రవి వచ్చి శ్రుతి గురించి అడుగుతాడు. ఏంటీ సమస్య అని సురేంద్ర అడిగితే.. ముందు శ్రుతితో మాట్లాడాలని లోపలికి వెళ్తాడు. ఇప్పుడెలా ఉందని శ్రుతిని రవి అడుగుతాడు. శ్రుతి కోప్పడుతుంది. నేను చేసింది తప్పే, త్వరగా వద్దామనుకున్నా కానీ కుదర్లేదు. తప్పైపోయింది. క్షమించు అని రవి వేడుకుంటాడు. ఇప్పుడు బుద్ధి వచ్చిందా అని శ్రుతి అంటుంది.
ఇంటికి రమ్మని రవి అడిగితే.. రానని శ్రుతి వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరగమని మోకాళ్లపై కూర్చుంటాడు రవి. శ్రుతి వెనక్కి తిరిగి చూస్తుంది. రవి చేతిలో ఉన్న డైమండ్ రింగ్ చూసి ఆశ్చర్యపోతుంది. తీసుకుని ఇదేంటని అడుగుతుంది. పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పాగా, అది సక్సెస్ కావడంతో మా బాస్ బోనస్ ఇచ్చింది. దాంతో కొన్నాను అని రవి చెబుతాడు.
రోహిణి నిద్రమాత్రల ప్లాన్
రింగ్ ఇచ్చి బుజ్జగిస్తే ఇంటికి వచ్చేస్తాననుకున్నావా అని శ్రుతి అంటుంది. మోకాళ్లపై కూర్చొన్నాను, ఇంకేం చేయాలో తెలియట్లేదు అని చెవులు పట్టుకుంటాడు. దాంతో శ్రుతి నవ్వేస్తుంది. డైమండ్ రింగ్‌కు పడిపోతుంది శ్రుతి. రవి మోకాళ్లపై శ్రుతి కూర్చుని హగ్ చేసుకుంటారు. కాసేపటికి బయటకు వచ్చిన శ్రుతి తన అత్తింటికి వెళ్లిపోతున్నట్లు చెప్పి వెళ్లిపోతారు.
మన కూతురను నమ్ముకుని మాస్టర్ ప్లాన్ వేస్తే ఫెయిల్ అయిందని సురేంద్ర అంటాడు. మరోవైపు షాపులో ఎంత అమ్మామో లెక్కలు వేసుకుంటారు మనోజ్, రోహిణి. రోహిణికి కాల్ రావడంతో పక్కకు వెళ్తుంది. బాలు దగ్గర వీడియో సంపాదించావా అని విద్య అడుగుతుంది. లేదని రోహిణి చెబుతుంది. దినేష్ గురించి ఇద్దరు భయపడతారు.
వీడియో సంపాదించడానికి ఓ ఐడియా వేశాను. బాలు రాత్రి పడుకునేముందు పాలల్లో అని రోహిణి చెబుతుంటే.. కొంపదీసి విషం కలుపుతావేంటీ అని విద్య అంటుంది. యే.. కాదు.. ఆ పాలల్లో నిద్రమాత్రలు కలుపుతాను. అప్పుడు ఫుల్‌గా నిద్రపోతాడు. నేను వీడియో తీసుకుంటాను అని రోహిణి చెబుతుంది. డోస్ ఎక్కువైతే ప్రమాదం, జాగ్రత్త అని విద్య చెబుతుంది.
శ్రుతితో ఇంటికి రవి
మరోవైపు అంతా భోజనం చేస్తుంటారు. మీనా వడ్డిస్తుంది. బెల్టుతో కొట్టడం గురించి గుర్తు చేసుకుంటూ మీనా, బాలు నవ్వుకుంటారు. సత్యంకు అన్నం ఎక్కువ పెడుతుంది. మెల్లిగా తినమని చెబుతుంది. అమ్మను గుర్తు చేసుకుంటాడు సత్యం. అంతా భోజనం చేస్తారు. శ్రుతితో రవి వస్తాడు. ప్రభావతి షాక్ అవుతుంది. అలా అలిగి గడప దాటి వెళ్లకూడదని సత్యం అంటాడు.
మనోజ్ కన్నా రవిగాడు చాలా బెటర్, కాకపోతే నైటీ వేసుకుంటాడు అని బాలు అంటాడు. దాంతో గొంతు పిసికేస్తా అని రవి అంటాడు. నన్ను అడిగి వెళ్లావా. అడిగి వచ్చావా అని ప్రభావతి అంటే.. అందుకే అడగలేదని శ్రుతి బిరుసుగా సమాధానం ఇస్తుంది. తల్లికి సపోర్ట్ చేస్తూ బాలు మాట్లాడుతాడు. శ్రుతికి అంతా నచ్చ జెప్పాలని చూస్తారు.
ఇది నా ఫ్యామిలీ. అందుకే ఇక్కడ జరిగింది ఏది మా వాళ్లకు చెప్పలేదు అని శ్రుతి అంటుంది. దాంతో రిలాక్స్ అవుతాడు సత్యం. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.