Happy Journey Movie Review And Rating In Telugu:

టైటిల్: హ్యాపీ జర్నీ
నటీనటులు: పాయల్ రాధాకృష్ణ, ఆమని, అన్నపూర్ణమ్మ, సునైనా బాదం, ఝాన్సీ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, వంశీధర్ గౌడ్, రవి శివతేజ తదితరులు
దర్శకత్వం: అభిరామ్ నాయుడు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: సుబ్రమణియన్ మణికందన్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
నిర్మాత: బాలాజి గుట్ట
విడుదల తేది: సెప్టెంబర్ 18, 2026
మహిళల భావోద్వేగాలు, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే కథలతో వినోదాన్ని పంచే కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. విభిన్న మనస్తత్వాలు ఉన్న కొందరు మహిళలు ఒకే చోట చేరి విహారయాత్రకు వెళ్తే ఎలాంటి సందడి నెలకొంటుందో చూపే కథాంశంతో ఓ తెలుగు సినిమా వచ్చేసింది.
ప్రధాన పాత్రల్లో నటీమణులు
అదే హ్యాపీ జర్నీ. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, హీరోయిన్, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి ఆమని, యాంకర్ ఝాన్సీ, యంగ్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ సహా పలువురు కీలక పాత్రల్లో అలరించారు. ఇవాళ థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. యూరప్ అందాల నేపథ్యంలో సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో నేటి హ్యాపీ జర్నీ రివ్యూలో తెలుసుకుందాం.
యూరప్ ట్రిప్ వెనుక అసలు కథ
వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైనా బాదం), విహాన (రూప శ్రీనివాస్).. ఒక లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకుంటారు. గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ నిర్వాహకులు గోవింద్ (వంశీధర్ గౌడ్), అప్పారావు (రవి శివతేజ) వీరికి గైడ్లుగా వ్యవహరిస్తారు.
{{/usCountry}}వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైనా బాదం), విహాన (రూప శ్రీనివాస్).. ఒక లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకుంటారు. గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ నిర్వాహకులు గోవింద్ (వంశీధర్ గౌడ్), అప్పారావు (రవి శివతేజ) వీరికి గైడ్లుగా వ్యవహరిస్తారు.
{{/usCountry}}సరదాగా ప్రారంభమైన ఈ విహారయాత్ర సాగుతుండగానే ఆ మహిళల జీవితాల్లోని వ్యక్తిగత సమస్యలు, దాగి ఉన్న ఆవేదనలు బయటపడతాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలాంటి మలుపు తిరిగింది? ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఆయా కుటుంబాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది తెరపై చూడాల్సిందే.
వినోదం ఓకే.. ఎమోషన్‌లోనే లోటు
దర్శకుడు అభిరామ్ నాయుడు మంచి సందేశాత్మక కథనే ఎంచుకున్నారు. కథలోని మూల ఆలోచన కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ప్రథమార్థంలో వచ్చే కొన్ని సరదా సన్నివేశాలు, వంశీధర్ నటన నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ఊహించని విధంగా ఉండి థ్రిల్ ఇస్తుంది.
అయితే కథనాన్ని నడిపించిన తీరులోనే కాస్త నెమ్మదనం కనిపిస్తుంది. పాత్రల మధ్య ఉండే భావోద్వేగబంధాన్ని మరింత లోతుగా చూపించి ఉంటే సినిమా స్థాయి పెరిగేది. ఒక్కొక్కరి సమస్యను వేగంగా పరిష్కరించేయడంతో ఎమోషన్స్ సరైన రీతిలో పండలేదు. కొన్ని సన్నివేశాలు పదే పదే వచ్చినట్లు అనిపిస్తాయి. హాస్యాన్ని, సెంటిమెంట్‌ను సమతుల్యం చేయడంలో కథనం తడబడింది.
నటీనటులు, సాంకేతిక ప్రతిభ
మోడ్రన్ అవతారంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తన అనుభవాన్ని చూపిస్తూ ఆకట్టుకున్నారు. ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనా తమ పరిధి మేర బాగా నటించారు. వంశీధర్ గౌడ్ తన కామెడీ టైమింగ్‌తో సన్నివేశాలను చక్కగా నడిపించారు. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ నవ్వులు పూయించింది.
సాంకేతికంగా సినిమా ప్రమాణాలు బాగున్నాయి. సుబ్రమణియన్ మణికందన్ కెమెరా పనితనం విజువల్స్‌కు ప్రాణం పోసింది. యూరప్ లొకేషన్లను చాలా అందంగా చిత్రీకరించారు. శేఖర్ చంద్ర స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లు కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉన్నాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే
రొటీన్ కథలకు భిన్నంగా మహిళల జీవిత సత్యాల చుట్టూ సాగే ప్రయత్నమే 'హ్యాపీ జర్నీ'. ప్రథమార్థంలో సరదా సన్నివేశాలు, చక్కటి లొకేషన్లు అలరించినప్పటికీ, ఎమోషనల్ సీన్స్‌లో బలం లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. వీకెండ్‌లో మంచి వినోదం కోరుకునే వారు ఈ 'హ్యాపీ జర్నీ'ని ఒకసారి చూడవచ్చు.