ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా- రియల్ లైఫ్ కేసు ఆధారంగా మూవీ- 8.6 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా హక్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. చారిత్రాత్మక షా బానో వంటి రియల్ లైఫ్ కేసు ఆధారంగా తెరకెక్కిన హక్ ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మహిళా హక్కుల పోరాటాన్ని చూపుతుంది.
భారతీయ న్యాయ చరిత్రలో మైలురాయిగా నిలిచిన 'షా బానో' రియల్ లైఫ్ కేసు ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘హక్’ (Haq). సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.

తెలుగు సినిమా హీరోయిన్
థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హక్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో హక్ ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన యామీ గౌతమ్, ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమే హక్.
హక్ కథా నేపథ్యం
హక్ సినిమా కథ షాజియా (యమీ గౌతమ్ ధర్) అనే ఒక సాధారణ గృహిణి చుట్టూ తిరుగుతుంది. చదువుకోకపోయినా సంప్రదాయాలకు కట్టుబడి ఉండే షాజియా.. విజయవంతమైన న్యాయవాది అబ్బాస్ ఖాన్ (ఇమ్రాన్ హష్మీ)ను వివాహం చేసుకుంటుంది.
భరణం, ఆత్మగౌరవం కోసం
కానీ, ఉన్నట్టుండి అబ్బాస్ రెండో పెళ్లి చేసుకోవడం, ఆపై ఆమెకు 'ట్రిపుల్ తలాక్' చెప్పడంతో షాజియా ప్రపంచం తలకిందులవుతుంది. తన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, భరణం కోసం ఒక సామాన్య మహిళ దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేసిన పోరాటమే ఈ ‘హక్’.
నటీనటుల ప్రతిభ
షాజియా పాత్రలో యమీ గౌతమ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకులు కొనియాడారు. భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించే ఆవేదన, నిశ్శబ్దం ప్రేక్షకులను కదిలిస్తాయి.
నేటి సమాజానికి అవసరమైన
ఇమ్రాన్ హష్మీ తన పాత్రలోని స్వార్థాన్ని, గంభీరతను ఎంతో నిజాయితీగా పండించారు. 1985లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమైన సందేశాన్ని అందించేలా డైరెక్టర్ తీర్చిదిద్దారు.
హక్ రేటింగ్
గతేడాది నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన హక్ మూవీ ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.6 రేటింగ్ కూడా దక్కించుకుంది. ఇలాంటి హక్ ఓటీటీలోకి వచ్చేయనుంది.
హక్ ఓటీటీ రిలీజ్
నెట్‌ఫ్లిక్స్‌లో హక్ ఓటీటీ రిలీజ్ కానుంది. జనవరి 2 అర్థరాత్రి నుంచే హక్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించింది.
నెట్‌ఫ్లిక్స్ పోస్ట్
"ఇంటి నాలుగు గోడల నుంచి న్యాయస్థానం వరకు.. ఈ ప్రయాణం నిస్సహాయతది కాదు, ఆత్మవిశ్వాసానిది" అంటూ హక్ సినిమా పోస్టర్‌ను పంచుకుంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


