Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ వంటింట్లో టీ పెడుతుంది. అది అయిందో లేదో కనుక్కోమని బామ్మర్దికి చెబుతాడు రామరాజు. బామ్మర్ది, ప్రేమ ఇద్దరు టీ గురించి సంగీతం, గాత్రంతో మాట్లాడుకుంటారు. అలాగే పాట పాడుతూ రామరాజుకు టీ పోసి ఇస్తుంది. తర్వాత రామరాజుకు ప్రేమ టీ ఇస్తుంది.
ఎస్సై ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావ్

ప్రేమకు ధీరజ్ కాల్ చేసి ఎగ్జామ్ ఎలా రాశావని అడిగితే.. మనం దేంట్లో అయిన టాపర్ అని గొప్పలుపోతుంది ప్రేమ. అందుకేనా ఎస్సై ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావ్ అని చెప్పిన ధీరజ్ ప్రేమ చేసిన ఓవరాక్షన్ గురించి నానా మాటలు అంటాడు ధీరజ్. దాంతో తప్పించుకోడానికి కస్టమర్ అందుబాటులో లేదని కాల్ కట్ చేస్తుంది ప్రేమ. పోలీస్ ఎగ్జామ్ ఫెయిల్ అంటున్నావ్ ఎవరు అయ్యారని రామరాజు అడుగుతాడు.
అది ఎగ్జామ్ గురించి కాదు.. ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ గురించి అని అబద్ధం చెప్పి వెళ్లిపోతుంది ప్రేమ. ఓటీటీలు, వెబ్ సిరీసులు అంతా కొత్త ట్రెండ్ అని, నీది పాతకాలపు ఫోన్ అని, నువ్వు కూడా పాతకాలపు మనిషివి కదా, మనిద్దరం క్లాస్‌మేట్స్ కాబట్టి సలహా ఇస్తున్నా. నువ్వు కాస్తా ఎదగాలి బావ. బ్రెయిన్ పరంగా ఎదగాలి అని బామ్మర్ధి అంటాడు. దాంతో ఒక్కటి పీకి రైస్ మిల్‌లో పని చూడకుండా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూస్తున్నావా అని తిడతాడు రామరాజు.
మరోవైపు స్వామిజీ కాళ్ల మీద భాగ్యం, దంపతులు పడి మీరే నాకు దారి చూపించాలని అంటారు. దాంతో బాత్రూమ్కు దారి చూపిస్తాడు స్వామిజీ. తమ అల్లుడు చందుకి వశీకరణ మంత్రం చేయాలని, తన కూతురు చుట్టే అల్లుడు తిరగేందుకు వశీకరణం చేయాలని భాగ్యం, తన భర్త అంటారు. అలాగే, మీ భర్తతో నీకు ఉన్న యుద్ధం ఏంటని స్వామిజీ అడిగితే.. అదంతా నేను చెప్పాకా నువ్వెందుకు. వీడు మనలాగే బురిడి స్వామిజీలా ఉన్నాడు పదా అని శ్రీవల్లి అంటుంది.
చందుకు వశీకరణ తాయిత్తు
{{/usCountry}}మరోవైపు స్వామిజీ కాళ్ల మీద భాగ్యం, దంపతులు పడి మీరే నాకు దారి చూపించాలని అంటారు. దాంతో బాత్రూమ్కు దారి చూపిస్తాడు స్వామిజీ. తమ అల్లుడు చందుకి వశీకరణ మంత్రం చేయాలని, తన కూతురు చుట్టే అల్లుడు తిరగేందుకు వశీకరణం చేయాలని భాగ్యం, తన భర్త అంటారు. అలాగే, మీ భర్తతో నీకు ఉన్న యుద్ధం ఏంటని స్వామిజీ అడిగితే.. అదంతా నేను చెప్పాకా నువ్వెందుకు. వీడు మనలాగే బురిడి స్వామిజీలా ఉన్నాడు పదా అని శ్రీవల్లి అంటుంది.
చందుకు వశీకరణ తాయిత్తు
{{/usCountry}}దాంతో కోపంగా వాళ్లపై బూడిద కొడతాడు స్వామిజీ. తర్వాత స్వామిజీకి జరిగింది అంతా చెబుతుంది భాగ్యం. బాగా అర్థమైందన్న స్వామిజీ మీ అల్లుడు పచ్చి తాగుబోతు. రోజు తాగి వచ్చి మీ కూతురుని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక మీ అత్తమామలు అయితే వేపుకు తింటున్నారు అని స్వామిజీ అంటాడు. చూశావా వీడు దొంగ స్వామిజీ అని శ్రీవల్లి అంటాడు. దాంతో మళ్లీ క్లియర్‌గా చెబుతాను అని భాగ్యం భర్త అంటే.. మళ్లీ మీ దరిద్రం వినాలా వద్దు. మీ అమ్మాయి చుట్టూ మీ అల్లుడు తిరిగేలా వశీకరణం చేయాలి అంతేగా అని స్వామిజీ అంటాడు.
సరే ఒక వెయ్యి ఇచ్చి ఈ తాయిత్తు తీసుకోండి అని స్వామిజీ అంటే.. వెయ్యి లేదు వంద ఉన్నాయని భాగ్యం అంటుంది. దాంతో సచ్చినోడికి వచ్చిందే కట్నం అని వంద తీసుకుని తాయిత్తు ఇస్తాడు స్వామిజీ. ఈ తాయిత్తు కట్టాకా నా బావ నా చుట్టు తిరగకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది శ్రీవల్లి. మరోవైపు ధీరజ్ రాక కోసం భయంగా ఎదురుచూస్తుంటుంది ప్రేమ. నర్మద వస్తే భయపడుతుంది.
ఏమైందని నర్మద అడిగితే.. ధీరజ్ కొడతాడేమో అక్క.. నేను తప్పాను అని ప్రేమ అంటుంది. దాంతో ఏంటీ నెల తప్పావా. అలా అయితే ధీరజ్ చాలా సంతోషిస్తాడుగా అని అంటుంది నర్మదా. కాదు ఎస్సై ఎగ్జామ్ తప్పాను. అమూల్య విషయంలో టెన్షన్‌గా ఉండి ఎగ్జామ్ సరిగా రాయలేదని చెబుతుంది ప్రేమ. ధీరజ్‌తో తాను మాట్లాడతానని, కింద పడిన బట్టలు తీయు, వేరే తాడు తీసుకొస్తా అని చెప్పి వెళ్లిపోతుంది నర్మదా.
ప్రేమ సూసైడ్
అక్కడ ఉన్న తాడును పైకి వేయడానికి ప్రేమ ట్రై చేస్తుంది. అది దూరం నుంచి చూసిన ధీరజ్.. ప్రేమ సూసైడ్ చేసుకుంటుందనుకుని వద్దని వచ్చి ఆపుతాడు. వెనుక నుంచి పట్టుకుని ప్రేమను ఆపి.. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే ఇలా చస్తారా అని అంటాడు ధీరజ్. ఓహో చేతిలో తాడు చూసి నేను ఏదో చేసుకుంటున్నాని హీరో అనుకున్నాడా అని మనసులో అనుకుంటుంది ప్రేమ. ధీరజ్ పెద్ద లెక్చర్ ఇస్తాడు.
దాంతో ప్రేమ మరింత ఓవరాక్షన్ చేస్తుంది. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయానురా అని బాధపడినట్లు తెగ నటించేస్తుంది ప్రేమ. నీకు నా మొహం చూపించలేను. అలా చేయాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి. దానికి అంత టైమ్, బడ్జెట్ లేదు. అందుకే చద్దామనుకున్నా అని ప్రేమ అంటుంది. దీనికే చస్తారా. నువ్వు నా బంగారంవి అని ధీరజ్ అంటే.. ప్రేమ హగ్ చేసుకుని సంతోషిస్తుంది.
ఇంతలో నర్మద వచ్చి స్ట్రాంగ్ తాడు తీసుకొచ్చానని, ఎంత ట్రై చేసిన తెగదంటుంది. దాంతో ధీరజ్ షాక్ అయి ఏంటీ వదినా మీరు తప్పని చెప్పకుండా చెల్లి చనిపోడానికి అక్క తాడు తీసుకొచ్చి ఇస్తుందా అని ధీరజ్ అంటాడు. దాంతో నర్మదా షాక్ అయి బట్టల దండెం తెగిపోతే తాడు తీసుకొచ్చానని నిజం చెబుతుంది. అదా విషయం అని ప్రేమ ఆడిన నాటకాన్ని ధీరజ్ బయటపెడతాడు.
ధీరజ్, నర్మదకు దొరికిన లారీ డ్రైవర్
ఆహా ఎంత డ్రామాలు ఆడావే అని ఆ తాడుతో నిజంగానే ప్రేమను కట్టేయాలని చూస్తాడు ధీరజ్. ప్రేమ వెంట పడతాడు ధీరజ్. ఇద్దరు సరదాగా పోట్లాడుకుంటారు. తర్వాత రాత్రి సాగర్ ఇంటికి వస్తాడు. అదోలా ఉండటం చూసి ఏమైంది, ఎందుకిలా ఉన్నావని నర్మద అడుగుతుంది. దాంతో నర్మదపై చిరాకుతో అరుస్తాడు సాగర్. దేనిమీదో కోపం నా మీద చూపిస్తావేంటీ అని నిలదీస్తుంది నర్మదా.
తర్వాత ధీరజ్, నర్మద భాగ్యం షాప్‌కు వెళ్తారు. అక్కడ వల్లీ గిన్నెలు కడగడం చూసి ధీరజ్, నర్మద చలించిపోతారు. అక్కడికే లారీ డ్రైవర్ వస్తాడు. అతన్ని నర్మద చూసి ధీరజ్‌కు చెబుతుంది. దాంతో భాగ్యంతో సహా అంతా కంగారుపడుతారు. లారీ డ్రైవర్ వెంట పడిన ధీరజ్ తంతాడు. ధీరజ్, నర్మదకు లారీ డ్రైవర్ దొరుకుతాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.