ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 20 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 20 ఎపిసోడ్ లో.. తండ్రి రామరాజుపై రూ.5 లక్షలు విసిరిగొట్టిన సాగర్ ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటాడు. నర్మద చేయి పట్టుకుని లాక్కెళ్తాడు. వేదవతి తన కొడుకును ఆపాలని చూస్తుంది. అమ్మా ఆపుతావా డ్రామాలు అని సాగర్ అంటాడు.
సాగర్ వెళ్లిపో

కన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాడని నేను బాధపడితే నీకు డ్రామాలా కనిపిస్తుందా? అమ్మ ప్రేమకు ఇచ్చే విలువ ఇదేనా? అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బుజ్జమ్మను ఆపిన రామరాజు.. సాగర్ ను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటాడు. రూ.5 లక్షలు ఇవ్వమంటే డబ్బు మనిషిలా కనిపించానే తప్పా, కొడుకును ఆపడానికే అలా అన్నానని వాడికి కనిపించడం లేదని రామరాజు సీరియస్ అవుతాడు.
నర్మదను తీసుకొని
కొడుకు కళ్ల ముందే ఉండాలనే నాన్న బాధ వాడికి అర్థం కావడం లేదు. నేను ఎన్నిసార్లు ఆపాలి. నీ భార్యను తీసుకుని వెళ్లిపో అని నేనే చెప్తున్నానని రామరాజు సీరియస్ అవుతాడు. వెంటనే.. నిన్ను కలిపి కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా ఉన్నావేంటీ, పదా వెళ్దాం. మొగుడితో కలిసి ఉండాలనుకుంటే రా. లేదంటే నువ్వు కూడా నాకు అక్కర్లేదని నర్మదతో సాగర్ అంటాడు. ఆ సమయంలో అందరూ బాధ పడుతుంటే శ్రీవల్లి మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ప్రేమ డ్రైవింగ్
సీన్ కట్ చేస్తే ప్రేమ కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవడం అంత అవసరమా? అని ప్రేమను ధీరజ్ ప్రశ్నిస్తాడు. ఫైనాన్సియర్ చెప్పిన సంగతి గుర్తుందా? ఈఎంఐ కట్టకపోతే కారు తీసుకెళ్తారు. నీకు హెల్త్ బాలేనప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు నేను డ్రైవింగ్ చేస్తానని ప్రేమ బిల్డప్ గా చెప్తుంది.
{{/usCountry}}సీన్ కట్ చేస్తే ప్రేమ కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవడం అంత అవసరమా? అని ప్రేమను ధీరజ్ ప్రశ్నిస్తాడు. ఫైనాన్సియర్ చెప్పిన సంగతి గుర్తుందా? ఈఎంఐ కట్టకపోతే కారు తీసుకెళ్తారు. నీకు హెల్త్ బాలేనప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు నేను డ్రైవింగ్ చేస్తానని ప్రేమ బిల్డప్ గా చెప్తుంది.
{{/usCountry}}కారును ఇష్టమున్నట్లు తిప్పుతుంది ప్రేమ. నువ్వు ఎక్కడెక్కడో తాకుతున్నావ్, అందుకే కాన్సట్రేషన్ పెట్టలేకపోతున్నానని చెప్తుంది. ఇద్దరు ముగ్గురుని గుద్దితేనే డ్రైవింగ్ వస్తుందని చెప్తుంది.
ధీరజ్ కు కాల్
సీన్ మళ్లీ రామరాజు ఇంటికి మారుతుంది. సాగర్ బట్టలు సర్దుకుంటాడు. ఈ అర్థం లేని కోపం ప్రమాదం అని నర్మద చెప్పినా సాగర్ వినడు. సాగర్ ను ఎలా ఆపాలో అర్థం కావడం లేదని ధీరజ్ కు కాల్ చేస్తుంది నర్మద. త్వరగా వచ్చి మీ అన్నయ్యను ఆపమని అడుగుతుంది.
మరోవైపు అటు వాడు, ఇటు మీరు మొండిగా మాట్లాడితే ఎలా? అని భర్తకు చెప్తుంది వేదవతి. చందు కూడా అదే మాట అంటాడు. అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాడు లేడు. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే కోపంతో ఉన్నాడు. విడిపోవాలనే వాడికి ఏం చెప్పగలమని రామరాజు చెప్తాడు.
భాగ్యం ప్లాన్
అటు గదిలో భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తో మాట్లాడుతూ శ్రీవల్లి తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాగర్ రావడం ఒక్క క్షణం లేట్ అయినా నర్మద నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లేదని వల్లి అంటుంది. సాగర్ బీభత్సం వెనుక ఉన్నది మీ అమ్మనే. ఈ గొడవకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఈ భాగ్యమేనని భాగ్యం అనడంతో వల్లి షాక్ అవుతుంది. ప్రసాద్ రావును రెచ్చగొట్టిన విషయాన్ని భాగ్యం చెప్తుంది.
అది విని వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు కొంపలు కూల్చే కంత్రీ ఖిలాడివి అని మరోసారి నిరూపించావని తల్లితో అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.