...
...
Next Story

Illu Illalu Pillalu November 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. తప్పించుకున్న అంజలి- భాగ్యాన్ని రెచ్చగొట్టిన భద్రావతి

Illu Illalu Pillalu November 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 2 ఎపిసోడ్లో అంజలిని సాగర్ కూడా చూస్తాడు. ధీరజ్ నేమో ప్రేమ తన కొంగుకు కట్టేసుకుంటుంది. ఇక బల్లక్కాయ్ పై చందు, వేదవతి సీరియస్ అవుతూనే ఉంటారు. మరోవైపు విడాకుల నోటీసుతో వెళ్లిన భద్రావతి.. భాగ్యాన్ని రెచ్చగొడుతుంది.

Published on: Nov 2, 2026, 07:58:51 IST
Advertisement

Illu Illalu Pillalu November 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గుడిలో తన అన్న చందు మాజీ లవర్ అంజలిని ధీరజ్ చూస్తాడు. కానీ అంజలి పట్టించుకోకపోవడంతో తాను పొరపడినట్లు ధీరజ్ అనుకుంటాడు. అంజలి తప్పించుకొని వెళ్లిపోతుంది. అంతా కన్ ఫ్యూజింగ్ గా ఉందే అని ధీరజ్ తల పట్టుకుంటాడు.

ఆ అమ్మాయి అంజలినే

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మరోవైపు లంచం డబ్బు కోసం సాగర్ ఫోన్లో మాట్లాడుతుంటాడు. అప్పుడే ధీరజ్ అక్కడికి వెళ్లి ఆ దూరంగా వెళ్తున్న అమ్మాయి అంజలినే కదా అని అడుగుతాడు. ఆ అమ్మాయిని చూసి అంజలినే అని సాగర్ చెప్తాడు. వెళ్లి పెద్దోడికి చెప్దామని సాగర్ అంటాడు. కానీ అంజలిని ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యకు మళ్లీ పాత గాయం గుర్తు చేయొద్దని ధీరజ్ ఆపుతాడు.

కొంగున కట్టేసుకున్న ప్రేమ

అప్పుడే తింగరి ప్రేమ వచ్చి ధీరజ్ చెవి పట్టుకుంటుంది. ఇంత అందమైన భార్యను పక్కనపెట్టుకొని వేరే అమ్మాయిని చూస్తావేంటని అడుగుతుంది. ఒక కాలు, ఒక చేయి తీసేస్తానని ధీరజ్ చేయిని మెలిపెడుతుంది ప్రేమ. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అని ధీరజ్ అంటాడు. కానీ అదేమీ వినని ప్రేమ తన కొంగుతో ధీరజ్ చేతులను కట్టేసి లాక్కెళ్తుంది.

ఇది కొరివి దెయ్యం

రామరాజు కుటుంబం అంతా అమ్మవారికి మొక్కుతుంది. అప్పుడే వల్లి సైలెంట్ గా అక్కడికి వెళ్తుంది. అప్పుడే ధీరజ్ ను ప్రేమ లాక్కుని వస్తుంది. మొగుణ్ని కొంగున కట్టేసుకోవడం అంటే ఇదేనన్నమాట. ఏం వేదవతి నీ కోడలు భలే గడుసు పిల్లలా ఉందే అని అక్కడున్న ఆడవాళ్లు అంటారు. గడుసు పిల్ల కాదు కొరివి దెయ్యం. దొంగని పోలీసోళ్లు బేడీలు వేసుకొని లాక్కొచ్చినట్లు తీసుకొచ్చిందని ధీరజ్ అంటాడు.

వేదవతి ఫైర్

రామరాజు, తిరుపతి, సాగర్, ధీరజ్ తమ భార్యలను ఆశీర్వదిస్తారు. అప్పుడే వల్లి అక్షింతలు తీసుకుని చందు దగ్గరకు వెళ్తుంది. బా.. ప్రేమగా పలకరించకపోయినా, ఇంట్లోకి రానివ్వకపోయినా పర్వాలేదు. కనీసం ఆశీర్వదించొచ్చు కదా అని వల్లి అడుగుతుంది. ఈ చీప్ ట్రిక్స్ నా దగ్గర ఉపయోగించకు అని చందు సీరియస్ గా చెప్తాడు. మామయ్య, అత్తయ్య మీరైనా చెప్పండని బల్లక్కాయ్ రిక్వెస్ట్ చేస్తుంది.

నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా కరిగేది లేదు. నిన్ను మాలో కలుపుకునేదే లేదని వేదవతి కోపంగా మాట్లాడుతుంది. అత్తాకోడళ్లు ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోమ్మని చెప్తాం. అలాంటిది మీరు ఇలా చేస్తున్నారు ఏంటీ? జరిగేది చూస్తుంటే కోడలిని ఇంట్లో నుంచి గెంటేశారనే మాట నిజమేనన్నమాట. ఇదిగో అబ్బాయి పెద్దవాళ్లకు కోపాలు ఉంటాయి. కానీ నువ్వు నచ్చచెప్పుకోవాలని అక్కడున్న ఆడవాళ్లు అంటారు.

నేను వందల తప్పులు చేశా

ఏదైనా ఉంటే నన్ను అనండి. నేను వందలకొద్ది తప్పులు చేశా. వీళ్ల మనసులు గాయపడేలా మోసం చేశా. వీళ్ల కోపానికి కారణం నేను. మా అత్తయ్య, మామయ్యలు పార్వతీ పరమేశ్వరులు. ఇది మా ఇంటి సమస్య. మేం చూసుకుంటాం. ఇంకో మాట మాట్లాడితే బాగుండదని వల్లి అంటుంది. మామయ్యను క్షమించమంటుంది వల్లి. ఇకనైనా నీ నాటకాలు ఆపమని చందు అంటాడు.

నీదే తప్పని దైవసాక్షిగా తలదించుకుని నిలబడ్డావ్. నువ్వు ఎంత మారావన్నది నాకు అర్థమైంది. అందరికీ అర్థం కావడానికి టైమ్ పడుతుందని నర్మద చెప్తుంది. నీ మాటలు వింటుంటే రేపటి మీద ఆశ పుడుతుంది. మీ అందరితో కలిసి అత్తారింట్లో సంతోషంగా గడిపేందుకు ఎదురు చూస్తున్నానని వల్లి చెప్తుంది.

విడాకుల నోటీసుతో భద్రావతి

ఇటు భాగ్యం ఇంటికి భద్రావతి వస్తుంది. ఇవి మీ అమ్మాయికి అని చందు పంపిన కోర్టు విడాకుల నోటీసును భద్రావతి ఇస్తుంది. ఆ రామరాజు పెద్ద కొడుకు మీ అమ్మాయికి విడాకుల నోటీసు పంపించాడని భద్రావతి చెప్తుంది. అంతే కాకుండా ఆ రామరాజు తన కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలని మంచి సంబంధాల కోసం వెతుకున్నాడని లేనిపోని అబద్ధాలను భద్రావతి చెప్తుంది.

భాగ్యాన్ని రెచ్చగొట్టేలా

అందరికీ మీ అమ్మాయి మంచిది కాదని చెప్తున్నారు. మీ అమ్మాయి కారణంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మీరు ఈ విడాకుల నోటీసు మీద సంతకం పెడితే వెంటనే తన కొడుక్కి మరో పెళ్లి చేస్తాడు ఆ రామరాజు. అందుకే మీరు కూడా ఆ రామరాజు మార్గంలోనే వెళ్లాడు. నువ్వు వెళ్లి ఊరందరి ముందు రామరాజు గురించి, రామరాజు కొడుకు గురించి చెడుగా చెప్పి పరువు తీయాలని భాగ్యాన్ని భద్రావతి రెచ్చగొడుతుంది.

అలా చేస్తే వల్లిని తన ఇంటికి తీసుకెళ్తారని భద్రావతి అంటుంది. ఇప్పుడే వెళ్తానని భాగ్యం ఊగిపోతుంది. కానీ భాగ్యం చేసే పని కరెక్ట్ కాదని ఇడ్లీ బాబాయి చెప్తాడు. అయినా భాగ్యం వినదు. ఇక బతుకమ్మ సంబరాల్లో వల్లిని వేదవతి, చందు తిడుతూనే ఉంటారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks