Telugu Family Drama Illu OTT Streaming Today: ఇటీవల ఎక్కువగా ఓటీటీల్లో లవ్ స్టోరీలు, క్రైమ్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ల సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. వీటి హడావుడి మధ్య.. మనసుకు హత్తుకునే సరికొత్త ఫీల్ గుడ్ డ్రామా తెలుగు ఫ్యామిలీ చిత్రం'ఇల్లు' (Illu Movie).
ఓటీటీలోకి ఇల్లు సినిమా

తెలుగు సీనియర్ నటుడు, రైటర్ హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి భార్యాభర్తలుగా ప్రధాన పాత్రలు పోషించిన ఇల్లు ఓటీటీలోకి ఇవాళ (జూన్ 12) వచ్చేసింది. ఒక ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల మధ్య ఉండే కాంక్రీట్ కట్టడమా? లేక మన జ్ఞాపకాలు, అనుబంధాలు ముడిపడి ఉండే ఒక భావోద్వేగమా? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని హత్తుకునేలా, సెటైరికల్‌గా మలిచారు.
కథేంటంటే?
కృష్ణ ప్రసాద్ (హర్షవర్ధన్) ఒక మధ్యవయస్కుడైన రచయిత. పదేళ్లుగా ఒక అద్దె ఇంట్లోనే నివసిస్తూ, పుస్తకాలు, జ్ఞాపకాలు, విభిన్న రకాల మొక్కల పెంపకంతో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు.
అయితే, అమెరికా నుంచి తిరిగి వస్తున్న తమ కొడుకు ఆ ఇంట్లో ఒక స్టార్టప్ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని యజమానులు చెబుతారు. ప్రాణంగా చూసుకున్న ఇల్లును వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణ ప్రసాద్ కొత్త ఇల్లు కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు.
మంచి ట్విస్ట్
ఈ క్రమంలో భువన్ (పవన్ రమేష్) అనే హౌస్ బ్రోకర్ అతనికి పరిచయమవుతాడు. కృష్ణ ప్రసాద్ బడ్జెట్‌కు సరిపోయేలా, అతను పెంచుకునే మొక్కలకు వీలుగా ఉండే ఇల్లు కోసం వీరిద్దరూ నగరం నలుమూలలా తిరుగుతారు. ఎన్నో ఇబ్బందుల తర్వాత శంషాబాద్‌లోని ఒక పెంట్‌హౌస్ ఓకే అవుతుంది.
సామాన్లు సర్దుకుని పాత ఇల్లు వదిలి కృష్ణ ప్రసాద్ వెళ్లిపోయేముందు ఓ మంచి ట్విస్ట్ ఎదరువుతుంది. అదేంటీ, యజమానులతో జరిగే ఎమోషనల్ సన్నివేశాలు ఏంటీ, చివరికి ఇంటి ఓనర్ కొడుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాంటే నేడు ఓటీటీ రిలీజ్ అయిన ఇల్లు సినిమా చూడాల్సిందే.
ఇల్లు నటీనటులు
{{/usCountry}}సామాన్లు సర్దుకుని పాత ఇల్లు వదిలి కృష్ణ ప్రసాద్ వెళ్లిపోయేముందు ఓ మంచి ట్విస్ట్ ఎదరువుతుంది. అదేంటీ, యజమానులతో జరిగే ఎమోషనల్ సన్నివేశాలు ఏంటీ, చివరికి ఇంటి ఓనర్ కొడుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాంటే నేడు ఓటీటీ రిలీజ్ అయిన ఇల్లు సినిమా చూడాల్సిందే.
ఇల్లు నటీనటులు
{{/usCountry}}హర్షవర్ధన్, బిందు చంద్రమౌళితోపాటు అనీష్ కురువిల్లా, పవన్ రమేష్, సునందిని కీలక పాత్రలు పోషించారు. రోహిత్ పెనుమత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి క్యాంప్ శశి కథను అందించారు. మనోహరి ఆర్ట్స్ బ్యానర్‌పై కిషోర్ మారిశెట్టి ఈ సినిమాను నిర్మించారు.
సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన స్వరాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. శశాంక్ రాఘవుల సినిమాటోగ్రఫీ అందించగా, అవంతి రుయా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సందేశాత్మక చిత్రాలు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఈ వీకెండ్‌లో 'ఇల్లు' సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
ఈటీవీ విన్ ఓటీటీలో
అందరు కనెక్ట్ అయ్యే ఇల్లు ఎమోషనల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 14న ఈటీవీ విన్‌లో ఇల్లు ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధలో భాగంగా నేటి ఆదివారం ఇల్లు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చింది.