...
...
Next Story

Jailer 2: రజనీకాంత్ జైలర్ 2లో విలన్‌గా డర్టీ పిక్చర్ హీరోయిన్- సిగరెట్‌తో విద్యా బాలన్ ఫస్ట్ లుక్- బీజీఎమ్, డైలాగ్ అలా!

Vidya Balan In Jailer 2 First Look Released: సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' చిత్రం నుంచి ది డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్ యాబాలన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైంది. 'కాంత' పాత్రలో సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన విద్యా బాలన్ , నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్‌పై భారీ అంచనాలను పెంచేసింది.

Published on: Sep 21, 2026, 11:00:57 IST
Advertisement

Vidya Balan In Jailer 2 First Look Released: సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'జైలర్ 2' నుంచి వరుస అప్‌డేట్లు చిత్రసీమలో అంచనాలు పెంచేస్తున్నాయి. 2023లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి బాలీవుడ్ వర్సటైల్ నటి విద్యా బాలన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ సన్ పిక్చర్స్ తాజాగా విడుదల చేసింది.

సిగరెట్ పొగతో మాస్ ఎంట్రీ ఇచ్చిన ‘కాంత’

రజనీకాంత్ జైలర్ 2లో విలన్‌గా డర్టీ పిక్చర్ హీరోయిన్- సిగరెట్‌తో విద్యా బాలన్ ఫస్ట్ లుక్- బీజీఎమ్, డైలాగ్ అలా!
రజనీకాంత్ జైలర్ 2లో విలన్‌గా డర్టీ పిక్చర్ హీరోయిన్- సిగరెట్‌తో విద్యా బాలన్ ఫస్ట్ లుక్- బీజీఎమ్, డైలాగ్ అలా!

జైలర్ 2 సినిమాలో ది డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ 'కాంత' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. విడుదల చేసిన జైలర్ 2 కాంత గ్లింప్స్ వీడియోలో విద్యాబాలన్ నీలం రంగు చీరకట్టులో, చేతిలో వెలుగుతున్న సిగరెట్‌తో మెట్లు దిగుతూ గంభీరమైన లుక్‌లో కనిపించింది.

బాడీ లాంగ్వెజ్, పవర్‌ఫుల్ డైలాగ్

తనదైన కమాండింగ్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎమ్ ఈ సీన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. "ఇక్కడికి వచ్చాక మేం చెప్పేది వినకుండా నువ్వు తిరిగి వెళ్లలేవు" అంటూ విద్యా బాలన్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా ఉంది. 'టైగర్' ముత్తువేల్ పాండ్యన్‌గా నటిస్తున్న రజినీకాంత్‌తో ఆమె ఢీకొట్టే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

నయా విలన్లు.. పాత తారల కలయిక

ఇటీవలే జైలర్ 2 సినిమా నుంచి మలయాళ నటుడు సూరజ్ వెంజారమూడు పాత్రను 'దిలీప్' పేరుతో పరిచయం చేశారు. సిగార్ కాలుస్తూ కారు దిగిన సూరజ్ లుక్, ఆయన చెప్పిన వాయిస్ ఓవర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వీరితో పాటు ఎస్‌జే సూర్య 'బోధి' పాత్రలో నటిస్తున్నారు.

రజనీకాంత్‌కు విలన్‌గా విద్యా బాలన్

మొదటి భాగంలో కిడ్నాప్‌నకు గురైన తన కొడుకును రక్షించుకోవడానికి రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ చేసిన యాక్షన్, క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సీక్వెల్ కథ అక్కడి నుంచే కొనసాగనుంది.

దసరా బరిలో రజినీకాంత్ వేట

ఇప్పటికే విడుదలైన జైలర్ 2లోని'అలా బొలేలో' పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: జైలర్ 2 సినిమాలో విద్యా బాలన్ ఏ పాత్రలో నటిస్తోంది?

A1: విద్యాబాలన్ ఈ సినిమాలో 'కాంత' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తోంది.

Q2: జైలర్ 2 సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

A2: ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా 2026 అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Q3: జైలర్ 2 సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు ఎవరు?

A3: ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Q4: జైలర్ 2 నిర్మిస్తున్న సంస్థ ఏది?

A4: సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks