Jana Nayagan Movie Review In Telugu And Rating: తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన నటనకు వీడ్కోలు పలుకుతూ, ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ముందు నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). తెలుగులో జన నాయకుడు. హెచ్. వినోథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే చేసింది.
జన నాయగన్ రివ్యూ

తమిళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. యానిమల్ విలన్ బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు నటించిన జన నాయగన్ ఇవాళ )జూలై 23) థియేటర్లలో విడుదల అయింది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ కథలోని ప్రధానాంశాలను తీసుకుని, తమిళ రాజకీయ వాతావరణానికి అనుగుణంగా మార్చి తెలుగులో జన నాయకుడుగా రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి జన నాయగన్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
పోలీస్ ఆఫీసర్ అయిన దళపతి వెట్రి కొండన్ (దళపతి విజయ్) డీఎస్పీ అమ్రిష్ పుజారి (బాబీ డియోల్)ని చంపి జైలు పాలవుతాడు. ఈ కేసులో కొండన్‌కి వ్యతిరేకంగా అతని తల్లి (రేవతి) సాక్ష్యం చెబుతుంది. పశ్చాత్తాపంతో చనిపోయిన తల్లి చివరి కోరికను నెరవేర్చేందుకు వెట్రికి జైలర్ శ్రీకాంత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) సహాయం చేస్తాడు.
అయితే, ఓ ప్రమాదంలో శ్రీకాంత్ చనిపోవడంతో అతని కూతురు విజ్జీ (మమితా బైజు) బాగోగులను వెట్రి చూసుకుంటాడు. భయం ఫోబియా, మానసిక సమస్యలతో బాధపడుతున్న విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయించేందుకు వెట్రి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పొలిటిషియన్ రోజా రంగసామితో గ్యాంగ్‌స్టార్ జాన్ హిమ్మర్ మతకల్లోలాలకు ప్లాన్ చేస్తాడు.
{{/usCountry}}అయితే, ఓ ప్రమాదంలో శ్రీకాంత్ చనిపోవడంతో అతని కూతురు విజ్జీ (మమితా బైజు) బాగోగులను వెట్రి చూసుకుంటాడు. భయం ఫోబియా, మానసిక సమస్యలతో బాధపడుతున్న విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయించేందుకు వెట్రి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పొలిటిషియన్ రోజా రంగసామితో గ్యాంగ్‌స్టార్ జాన్ హిమ్మర్ మతకల్లోలాలకు ప్లాన్ చేస్తాడు.
{{/usCountry}}మరి వారి కుట్రలను దళపతి ఎలా తిప్పికొట్టాడు?, విజ్జీని చంపాలని గ్యాంగ్‌స్టర్ మనుషులు ఎందుకు అనుకున్నారు? అసలు నిజాయితీపరుడైన అమ్రిష్ అవినీతి పరుడిగా ఎందుకు మారాడు? వెట్రికి సొంత తల్లి ఎందుకు విరుద్ధంగా తప్పుడు సాక్ష్యం చెప్పింది? కయల్ (పూజా హెగ్డే) పాత్ర ఏంటీ? విజ్జీ తనలోని భయాలను పొగొట్టుకుందా? అనేదే జన నాయగన్ కథ.
విశ్లేషణ:
జన నాయగన్ (తెలుగు టైటిల్ జన నాయకుడు) విజయ్ దళపతి ఆఖరి సినిమా అని చెప్పినప్పటి నుంచి విపరీతమైన హైప్ పెరిగింది. విజయ్ సీఎం కాకుముందే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా సెన్సార్ కట్స్ తట్టుకుని ఎట్టకేలకు థియేటర్లలో అడుగుపెట్టింది.
ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్‌కి జన నాయగన్ సంతృప్తిని ఇచ్చిందా అంటే.. ఇచ్చిందనే చెప్పాలి. ఇది పక్కా దళపతి ఫ్యాన్స్ విజిల్స్ వేసుకునే సినిమా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు విజయ్ గురించి వచ్చే ఎలివేషన్స్, "దళపతి మన రక్షణలో లేడు.. మనమే ఆయన రక్షణలో ఉన్నాం" వంటి డైలాగ్స్ అభిమానులను సీట్లలో సైలెంట్‌గా కూర్చోనివ్వవు.
సామాజిక అంశాలతో
విజయ్ స్టార్‌డమ్ బేస్ చేసుకుని సీన్లు రాసుకున్నారు డైరెక్టర్ వినోథ్. యాక్షన్ సీన్స్, విజయ్ ఎలివేషన్స్, పొలిటికల్ డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్. మమితా బైజుతో వచ్చే విజయ్ సీన్లు ఎమోషనల్‌గా బాగున్నాయి. ఫస్టాఫ్ అంతా పాత్రలు, వారి మోటివ్, కొన్ని యాక్షన్, ఎలివేషన్స్ సీన్స్‌తో సాగుతుంది.
రెండో భాగంలో వెట్రి, జాన్ హిమ్లర్ మధ్య జరిగే ఘర్షణలు, వారి గతం వెలుగులోకి వస్తాయి. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, మహిళలపై అన్యాయాలు, మహిళా సాధికారత చుట్టూ కథ సాగుతుంది.
మార్పులు చేర్పులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన సూచనలు, స్థానిక రాజకీయ పక్షాల ప్రస్తావనలు, విజయ్ రియల్ లైఫ్ రాజకీయ ప్రసంగాల ఘట్టాలు సినిమాలో పుష్కలంగా కనిపిస్తాయి. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’లోని చిన్నాన్న-కూతురి సెంటిమెంట్ థ్రెడ్‌ను ఇందులో మహిళా సాధికారత అంశంతో ముడిపెట్టి కథను నడిపించారు.
ఇది భగవంత్ కేసరి సినిమా మూలకథను తీసుకుని తమదైన స్టైల్‌లో మార్పులు చేసి వండించిన సినిమా. అయితే, ఆ మార్పులు తెలుగు ఆడియెన్స్‌కు పెద్దగా ఎక్కవు. బలవంతపు ఎమోషన్, అనవసరమైన యాక్షన్ సీన్లతో సాగదీశారు. క్లైమాక్స్ బాగుంది. కానీ, తెలుగు వారికి జస్ట్ క్లైమాక్స్ అంతే.
విజయ్ వన్ మ్యాన్ షో..
ఈ సినిమా సంపూర్ణంగా విజయ్ వన్ మ్యాన్ షో. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన నటన, వేగవంతమైన డ్యాన్స్ మూవ్స్, స్టైలిష్ డైలాగ్ డెలివరీ అభిమానులను కట్టిపడేస్తాయి. ప్రతికూల పాత్రలో బాబీ డియోల్ తన ఫిజిక్, విలనిజంతో మెప్పించారు. మమితా బైజూ నటన కథకు ప్రధాన బలంగ నిలవగా, పూజా హెగ్డే పాత్ర పరిమితంగా ఉంది.
అభిమానులకు మాత్రమే
ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, సునీల్, నరేన్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, విజయ్ పాత్రకే ప్రాధాన్యం ఇవ్వడంతో మిగిలిన పాత్రలు కాస్త పక్కకు వెళ్లాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు పర్వాలేదు. బీజీఎమ్ సీన్స్‌కు తగ్గట్లు ఉంది. మూడు గంటలకు పైగా ఉన్న నిడివి, కొన్ని చోట్ల ఎక్కువైన పొలిటికల్ మెసేజింగ్ మినహా, దళపతి చివరి సినిమాగా 'జన నాయగన్' అభిమానులకు మాత్రం పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ ట్రీట్!