...
...
Next Story

Jana Nayagan Twitter Review: జన నాయగన్ ట్విటర్ రివ్యూ- సీఎంగా టైటిల్ కార్డ్- దళపతి విజయ్ ఆఖరి సినిమా ఆడియెన్స్ టాక్ ఇలా!

Jana Nayagan Twitter Review In Telugu: తమిళనాడు సీఎం నాయకుడు, స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' జూలై 23న థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి ప్రదర్శన నుంచే మూవీకి ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. ఆ వివరాలు జన నాయగన్ ట్విటర్ రివ్యూలో చూద్దాం.

Published on: Jul 23, 2026, 10:50:26 IST
Advertisement

Jana Nayagan Movie Twitter Review In Telugu: డ్యాన్స్, ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్‌ను ఏలే దళపతి విజయ్.. తన వెండితెర వీడ్కోలు చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan)తో థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టించేందుకు రెడీ అయ్యారు.

జన నాయగన్ రిలీజ్

జన నాయగన్ ట్విటర్ రివ్యూ- సీఎంగా టైటిల్ కార్డ్- దళపతి విజయ్ ఆఖరి సినిమా ఆడియెన్స్ టాక్ ఇలా!
జన నాయగన్ ట్విటర్ రివ్యూ- సీఎంగా టైటిల్ కార్డ్- దళపతి విజయ్ ఆఖరి సినిమా ఆడియెన్స్ టాక్ ఇలా!

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో అభిమానులు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణం సృష్టించారు.

తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ హిట్ 'భగవంత్ కేసరి' కథ నుంచి స్ఫూర్తి పొంది తమిళ నేటివిటీకి తగ్గట్టు ఈ చిత్రాన్ని రూపుదిద్దినట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌గా మమితా బైజు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉంది, ఆడియెన్స్ ఏమంటున్నారనే వివరాలను జన నాయగన్ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

థియేటర్లలో పొలిటికల్ పూనకాలు.. సీఎంగా టైటిల్ కార్డ్!

సినిమా ప్రారంభంలో విజయ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి అని అర్థం వచ్చేలా వేసిన టైటిల్ కార్డ్ చూసి థియేటర్లు ఈలలు, గోలలతో హోరెత్తిపోయాయి. ప్రసిద్ధ నటుడు, తమిళ మాజీ ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ (MGR) రెఫరెన్సులు, అలాగే బాలకృష్ణ ప్రస్తావనలు తమిళ, తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన జోష్ ఇచ్చాయి.

"అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, 'దళపతి కచ్చేరి' పాట థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయి" అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.

మాస్ యాక్షన్.. భావోద్వేగాల వీడ్కోలు!

కథానాయకుడితో పాటు విలన్‌గా నటించిన బాబీ డియోల్ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టారు. పూజా హెగ్డే, మమితా బైజు తమ పాత్రల్లో ఒదిగిపోగా.. ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నారాయణ్ తదితరులు కథకు బలంగా నిలిచారు అని టాక్ వస్తోంది.

"జన నాయగన్ ఫస్టాఫ్ బ్లాక్‌బస్టర్ స్టఫ్. ఆరంభం నుంచి చివరి దాకా గూస్‌బంప్స్. దళపతి విజయ్ పేరుతో వేసిన టైటిల్ కార్డ్ మొదటి 20 నిమిషాలు అయితే పూర్తిగా వేడుకల సాగింది. ప్రతి సీన్‌కి, పాటకి థియేటర్ దద్దరిల్లుతోంది. అద్భుతమైన కనెక్టింగ్ సీన్స్, శక్తివంతమైన ఎలివేషన్ మూమెంట్స్, విలన్‌తో పర్ఫెక్ట్‌గా కలిసేలా చక్కగా రాసిన ఇన్‌స్పెక్టర్ పాత్రతో స్క్రీన్‌ప్లే చాలా స్మార్ట్‌గా ఉంది" అని ఒకరు రివ్యూ ఇచ్చారు.

"మమితా బైజు విజయ్‌తో పంచుకున్న ఎమోషనల్, హృద్యమైన సీన్స్ ప్రేక్షకులను చాలా అందంగా కనెక్ట్ చేస్తాయి. ఇంటర్వెల్ ఫైట్.. "నేను వస్తున్నాను" మూమెంట్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. మాస్, ఎమోషన్, సంబరాల పర్ఫెక్ట్ మిశ్రమం. రెండవ భాగం లోడ్ అవుతోంది" అని రాసుకొచ్చారు.

"దళపతి విజయ్ జన నాయగన్ మాస్ ఇమేజ్‌తో నడిచే ఒక పాత తరహా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. విజయ్ వన్ మ్యాన్ షో. యాక్షన్, ఎమోషన్, వినోదం, డ్యాన్స్.. ఇలా అన్నింటిలోనూ అదరగొడుతూ సినిమా అంతటా మిమ్మల్ని అలరిస్తారు.ఇప్పటివరకు ఇంట్రో, 'Thalapathy Katcheri' పాట, ఇంటర్వెల్ థియేటర్‌లో మంచి అనుభూతినిచ్చాయి" అని ఒకరు చెప్పారు.

"ఒక సన్నివేశంలో అనిరుధ్ అందించిన 'కత్తి' తరహా నేపథ్య సంగీతం, 'రావణ ద' బీజీఎమ్ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ వినోద్ భగవంత్ కేసరి కథాంశాన్ని మార్చి, మరింత బలమైన లక్ష్యంతో కూడిన విభిన్నమైన విలన్ ట్రాక్‌ను ఇందులో జోడించారు. ఇప్పటివరకు ఎంతో వినోదాత్మకంగా, ఆసక్తికరంగా సాగే కమర్షియల్ చిత్రం" అంటూ పేర్కొన్నారు.

సినిమా చివరి నిమిషంలో విజయ్ సినిమా ప్రస్థానానికి ఇచ్చిన ట్రిబ్యూట్ అభిమానుల కళ్లల్లో నీళ్లు తిరిగేలా చేస్తోంది. ఆయన పాత సినిమాల జ్ఞాపకాలను చూపిస్తూ, అనిరుధ్ ఎమోషనల్ మ్యూజిక్ మధ్య విజయ్ వేసిన చివరి డ్యాన్స్ స్టెప్పులు వెండితెరకు ఒక అద్భుతమైన వీడ్కోలుగా నిలిచాయని అంటున్నారు. ఇలా సీఎం విజయ్ జన నాయగన్‌పై అదిరిపోయే టాక్ వస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe