...
...
Next Story

Jaya Prada: విమర్శించడం చాలా సులభం, కానీ.. ఆ ట్రోలింగ్‌పై సీనియర్ హీరోయిన్ జయప్రద కౌంటర్!

Jaya Prada Counter To Dhurandhar Critics: బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' చిత్రాన్ని మాజీ ఎంపీ, సీనియర్ హీరోయిన్ జయప్రద ఆకాశానికెత్తారు. ధురంధర్ 2 సినిమాపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ, ప్రతి ఒక్కరూ చూడాల్సిన అద్భుత చిత్రమని జయప్రద కొనియాడారు.

Published on: Mar 23, 2026, 11:34:22 IST
Advertisement

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధరంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై ప్రశంసలు, విమర్శలతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విమర్శించడం చాలా సులభం, కానీ.. ఆ ట్రోలింగ్‌పై సీనియర్ హీరోయిన్ జయప్రద కౌంటర్!
విమర్శించడం చాలా సులభం, కానీ.. ఆ ట్రోలింగ్‌పై సీనియర్ హీరోయిన్ జయప్రద కౌంటర్!

చాలా వరకు ధురంధర్ 2పై సినీ సెలబ్రిటీలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, రవితేజ, కంగనా రనౌత్, రాజమౌళి వంటి వారు ప్రశంసించారు. తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు జయప్రద కూడా ఈ ‘ధురంధర్ 2’ గూఢచారి కథను ప్రశంసలతో ముంచెత్తారు.

"ఇలాంటి సినిమా చూసి చాలా కాలమైంది"

ధురంధర్ 2 సినిమా కథాంశం, నటీనటుల ప్రతిభ అద్భుతమని పేర్కొంటూనే, కావాలని విమర్శలు, ట్రోలింగ్ చేసే వారికి సీనియర్ హీరోయిన్ జయప్రద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యూస్ ఏజెన్సీ ANIతో మాట్లాడిన జయప్రద.. ధురంధర్ ది రివేంజ్ కోసం మూవీ యూనిట్ పడిన కష్టాన్ని అభినందించారు.

"చాలా ఏళ్ల తర్వాత ప్రజలు చూస్తున్న ఒక అద్భుతమైన చిత్రమిది. ఈ సినిమా విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. ఏదైనా విషయాన్ని విమర్శించడం చాలా సులభం. కానీ, ఇంత గొప్ప స్క్రిప్ట్ రాసి, దాన్ని సక్సెస్ చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో శ్రమించారు. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడాలని, ఆదరించాలని నేను కోరుతున్నాను" అని మాజీ ఎంపీ జయప్రద పిలుపునిచ్చారు.

700 కోట్లకు పైగా కలెక్షన్స్

అయితే, సోషల్ మీడియాలో ధురంధర్ 2 సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ కామెంటేటర్ ధ్రువ్ రాఠీ వంటి వారు ఈ సినిమాను విమర్శించగా, పెద్ద నోట్ల రద్దు (Demonetisation) వంటి అంశాలను సమర్థించడంపై కొందరు ఇది ‘ప్రొపగాండా’ అని ఆరోపిస్తున్నారు.

విమర్శలపై జయప్రద కౌంటర్

ఇలా ధురంధర్ 2 విమర్శలు, ట్రోలింగ్ నేపథ్యంలో జయప్రద చేసిన కామెంట్స్ వారికి కౌంటర్‌లా ఉన్నాయి. దీంతో జయప్రద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డ్

ఇదిలా ఉంటే, 2025లో వచ్చిన సూపర్ హిట్ ధురంధర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ధురంధర్ ది రివేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులు సృష్టించింది. ఒకే రోజులో రూ. 100 కోట్లు వసూలు చేసిన ఏకైక హిందీ చిత్రంగా చరిత్రకెక్కింది.

గూఢచారి ప్రయాణం

మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, యామీ గౌతమ్ (అతిథి పాత్ర), డానిష్ ఇక్బాల్ వంటి స్టార్ కాస్ట్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రస్తుతం ఈ గూఢచారి ప్రయాణం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe