Must Watch Top 5 Jio Hotstar OTT Malayalam Thrillers In Telugu: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి సరికొత్త కథాంశాలతో, మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
మైండ్ బ్లాక్ ట్విస్టులతో

ముఖ్యంగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar / Disney+ Hotstar) ఓటీటీలో ఎక్కువగా మలయాళ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో ఎన్నో థ్రిల్లర్స్ ఉన్నాయి. అయితే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒక్కోటి ఒక్కో రకంగా.. మైండ్ బ్లాక్ ట్విస్టులతో సాగే మస్ట్ వాచ్ టాప్ 5 థ్రిల్లర్స్ ఉన్నాయి.
తెలుగులోనూ స్ట్రీమింగ్
తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ థ్రిల్లర్ సినిమాలు, వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్, స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. సూక్ష్మదర్శిని (Sookshmadarshini)
ఐఎమ్‌డిబి రేటింగ్: 7.8/10
కథాంశం: ప్రియదర్శిని (నజ్రియా నజీమ్) అనే ఒక సాధారణ అమ్మాయి నివసించే కాలనీలోకి మాన్యువల్ (బాసిల్ జోసెఫ్) అనే యువకుడు కొత్తగా అద్దెకు వస్తాడు. అతని నడవడిక, రహస్య ప్రవర్తన చూసి ప్రియదర్శినికి అనుమానం వస్తుంది. దాంతో ఆమె అతనిపై ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఈ క్రమంలో అతని గురించి ఆమెకు తెలిసిన కొన్ని భయంకరమైన నిజాలు, ఆ కాలనీ చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటనేదే కథ.
ఆకట్టుకునే అంశాలు: ఇది నజ్రియా, బాసిల్ జోసెఫ్‌ల అద్భుతమైన కాంబినేషన్ సినిమా. ఇదొక డార్క్ హ్యూమర్ మిక్డ్స్ మిస్టరీ థ్రిల్లర్. స్లోగా మొదలై సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు మిమ్మల్ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి.
2. తుడరుమ్ (Thudarum)
ఐఎమ్‌డిబి రేటింగ్: 7.5/10
కథాంశం: బెంజ్ అనే ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ తన కుటుంబం, తన అంబాసిడర్ కారుతో చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ, తన కుమారుడు లాకప్ డెత్ అవడం, అతని కారులోనే కొడుకు డెడ్ బాడీ తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ హత్యను బెంజ్ చేశాడని పోలీసులు ఇరికిస్తారు. ఆ తర్వాత ఏమైంది?, పోలీసులపై బెంజ్ ఎలా పగ తీర్చుకున్నాడు? అలాగే తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు తన కొడుకు చావుకు కారణం ఏంటీ? వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే క్రైమ్ రివేంజ్ ఫ్యామిలీ డ్రామానే తుడరుమ్.
ఆకట్టుకునే అంశాలు: ఒక సామాన్యుడి చుట్టూ అల్లిన క్రైమ్ రివేంజ్ అండ్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా ఇది. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్.
3. సంభవం అధ్యాయం ఒన్ను (Sambhavam Adhyayam Onnu)
{{/usCountry}}ఆకట్టుకునే అంశాలు: ఒక సామాన్యుడి చుట్టూ అల్లిన క్రైమ్ రివేంజ్ అండ్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా ఇది. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్.
3. సంభవం అధ్యాయం ఒన్ను (Sambhavam Adhyayam Onnu)
{{/usCountry}}ఐఎమ్‌డిబి రేటింగ్: 7.4/10
కథాంశం: శిక్షాత్మక బదిలీ (Punishment Posting) పై ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తాడు సివిల్ పోలీస్ ఆఫీసర్ ఆనంద్. అక్కడ ఒక అపాయకరమైన రెస్క్యూ మిషన్ కోసం దట్టమైన, ఈరి (Eerie) వెల్లూర్క్కాట్ అడవిలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అయితే ఆ అడవిలోకి వెళ్లిన తర్వాత 30 ఏళ్ల కింద మిస్ అయిన వ్యక్తులు తారసపడటం, అతీంద్రియ శక్తులు ఎదురవ్వడం వంటి వింత పరిణామాలు జరుగుతాయి. ఆనంద్ ఆ మిస్టరీని ఎలా ఛేదించాడనేదే కథ.
ఆకట్టుకునే అంశాలు: మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్, లూప్, ఫాంటసీ ఎలిమెంట్స్ కలగలిపిన సినిమా ఇది. అడవి నేపథ్యంలో సాగే సీన్స్ చూస్తున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాగే, లూప్ కాన్సెప్ట్, బ్రిటీషర్స్, కాకి కథ వంటి అంశాలు హుక్ అయ్యేలా చేస్తాయి.
4. డీస్ ఇరాయ్ (Diés Iraé)
ఐఎమ్‌డిబి రేటింగ్: 6.9/10
కథాంశం: రోహన్ అనే ఒక సంపన్న యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. తన ఇంట్లోనే ఏదో ఒక అతీంద్రియ శక్తి, ఆత్మ తిరుగుతోందని అతను తీవ్రమైన భయానికి గురవుతుంటాడు. మొదట్లో అందరూ అది అతని భ్రమ అనుకున్నప్పటికీ, ఆ తర్వాత జరిగే కొన్ని వింత సంఘటనలు ఆ ఇంట్లో దాగున్న ఒక భయంకరమైన గతాన్ని, రహస్యాలను బయటకు వస్తాయి.
ఆకట్టుకునే అంశాలు: హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. సౌండ్ డిజైన్, లైటింగ్, సస్పెన్స్ అట్మాస్పియర్ సినిమా చూసే ప్రేక్షకుడికి అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.
5. ప్రతిచ్ఛాయ (Prathichaya)
ఐఎమ్‌డిబి రేటింగ్: 5.7/10
కథాంశం: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పొలిటికల్ వారసత్వానికి, అతని కొడుకు కార్పొరేట్ వ్యాపారాల వెనుక ఉన్న చీకటి రహస్యాలకు సంబంధించిన కథ ఇది. ఒక పెద్ద స్కాండల్ బయటపడటంతో, మీడియా మేనేజ్‌మెంట్, పొలిటికల్ పవర్స్ మధ్య ఒక మైండ్ గేమ్ మొదలవుతుంది. ఆ స్కాండల్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అనే మిస్టరీని పొలిటికల్ క్రైమ్ డ్రామాగా చూపించారు.
ఆకట్టుకునే అంశాలు: తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌తో సాగే పవర్‌ఫుల్ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామా ఇది. స్క్రీన్‌ప్లేలో వచ్చే పొలిటికల్ ఎత్తులు, పైఎత్తులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.