Best 6 OTT Crime Thrillers On JioHotstar: వీకెండ్ వస్తే చాలు చాలామందికి ఓటీటీ వేదికలపై థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం ఒక వ్యసనంగా మారింది. ఇక కొత్త వారం రాగానే ఆ వీకెండ్‌కు ఎలాంటి సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడాలో ముందే వెతుక్కుంటారు ఓటీటీ లవర్స్.
టాప్ 6 ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్

అలాంటి వారికోసం మర్డర్ మిస్టరీలు, అండర్ కవర్ ఆపరేషన్లు, రివెంజ్ డ్రామాలతో కూడిన టాప్ 6 క్రైమ్ థ్రిల్లర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. అవన్నీ ఒక్క జియోహాట్‌స్టార్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం. సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠ, చివరి వరకు సస్పెన్స్ కొనసాగించే డ్రామాతో తెరకెక్కిన ఈ జియో హాట్‌స్టార్ ఓటీటీ బెస్ట్ 6 క్రైమ్ థ్రిల్లర్స్‌ను మిస్ అవ్వకండి.
స్పెషల్ ఆప్స్ (Special Ops)
కేకే మేనన్, కరణ్ టాకర్, వినాయ్ పాఠక్, సయామీ ఖేర్, ముజమ్మిల్ ఇబ్రహీం ప్రధాన పాత్రల్లో నటించిన ఓటీటీ సిరీస్ 'స్పెషల్ ఆప్స్'. రా (RAW) అధికారి హిమ్మత్ సింగ్ పాత్రలో కేకే మేనన్ అద్భుతంగా జీవించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన వరుస ఉగ్రవాద దాడుల వెనుక ఒకే సూత్రధారి ఉన్నాడని హిమ్మత్ సింగ్ నమ్ముతాడు.
2001 పార్లమెంట్ దాడి నుంచి మొదలుకొని అనేక ఘటనల వెనుక ఉన్న ఆ మాస్టర్‌మైండ్‌ను పట్టుకునేందుకు హిమ్మత్ సింగ్ రహస్యంగా ఒక ఏజెంట్ల బృందాన్ని ఏర్పాటు చేస్తారు. మిడిల్ ఈస్ట్, కాశ్మీర్ వంటి ప్రాంతాలకు తన ఏజెంట్లను పంపి, ఆ ఉగ్రవాది జాడను ఎలా కనిపెట్టారనేదే ఈ వెబ్ సిరీస్ కథ. ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సిరీస్ సాగుతుంది.
ద వరస్ట్ ఆఫ్ ఈవిల్ (The Worst of Evil)
కొరియన్ డ్రామాలకు (K-Dramas) మన దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఆదరణ పెరిగింది. జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న 'ద వరస్ట్ ఆఫ్ ఈవిల్' కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 1990ల కాలం నాటి సియోల్ నగర నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
{{/usCountry}}కొరియన్ డ్రామాలకు (K-Dramas) మన దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఆదరణ పెరిగింది. జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న 'ద వరస్ట్ ఆఫ్ ఈవిల్' కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 1990ల కాలం నాటి సియోల్ నగర నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
{{/usCountry}}దక్షిణ కొరియా, చైనా, జపాన్ దేశాల మధ్య విస్తరిస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌ను అంతం చేసేందుకు పోలీస్ అధికారి పార్క్ జున్ మో (జీ చాంగ్ వూక్) అండర్ కవర్ ఏజెంట్‌గా 'గంగ్నమ్ యూనియన్' అనే గ్యాంగ్‌లో చేరతారు. గ్యాంగ్ లీడర్ జంగ్ గీ చోల్ నమ్మకాన్ని గెలుచుకుని, వారి సామ్రాజ్యాన్ని కూల్చివేయడమే ఆయన లక్ష్యం.
కానీ, అండర్ కవర్ మిషన్‌లో ఉన్న కొద్దీ తన అసలు గుర్తింపును దాచడం కష్టంగా మారుతుంది. దీనికి తోడు జున్ మో భార్యకు ఆ గ్యాంగ్ లీడర్‌తో సంబంధం ఉందనే నిజం బయటపడటంతో కథ అనేక మలుపులు తిరుగుతుంది.
ఆర్య (Aarya)
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ నటనతో అలరించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఆర్య'. మూడు సీజన్లుగా వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ క్రైమ్ డ్రామాలో చంద్రచూర్ సింగ్, సికందర్ ఖేర్, వికాస్ కుమార్, నమిత్ దాస్ కీలక పాత్రలు పోషించారు. భర్త దారుణ హత్యకు గురికావడంతో ఆర్య సరిన్ (సుస్మితా సేన్) జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది.
తన కుటుంబం వెనుక ఉన్న అక్రమ డ్రగ్స్ వ్యాపారం గురించి ఆమెకు అప్పుడే తెలుస్తుంది. పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటంతో, అంతవరకు ఆ వ్యాపారానికి దూరంగా ఉన్న ఆర్య, స్వయంగా డ్రగ్ సామ్రాజ్య బాధ్యతలు చేపడుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సాధారణ తల్లిగా ఉన్న మహిళ శక్తివంతమైన నేర సామ్రాజ్య నేతగా ఎలా మారింది? భర్త హత్యకు ఎలా పగ తీర్చుకుంది అనేది ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా చూపించారు.
ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (A Shop for Killers)
లీ డాంగ్ వూక్, కిమ్ హ్యే జున్, సెయో హ్యూన్ వూ ముఖ్య పాత్రల్లో నటించిన మరో ఆకట్టుకునే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ 'ఏ షాప్ ఫర్ కిల్లర్స్'. జంగ్ జీ ఆన్ అనే యువతి బాబాయ్ జంగ్ జిన్ మాన్ అకస్మాత్తుగా మరణించడంతో ఒంటరైపోతుంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన జీ ఆన్, ఆయన వస్తువులను సర్దుతుండగా ఒక సంచలన నిజం తెలుసుకుంటుంది.
తన బాబాయ్ డార్క్ వెబ్‌లో కిల్లర్స్ కోసం ఆయుధాలు సరఫరా చేసే ఒక ఆన్‌లైన్ షాప్ నడుపుతున్నాడని ఆమె గుర్తిస్తుంది. ఆ రహస్యం పూర్తిగా అర్థమయ్యేలోపే, సాయుధులైన కిరాయి మూకలు ఆమె ఇంటిపై దాడి చేస్తాయి. తన చిన్నతనంలో బాబాయ్ నేర్పించిన బ్రతుకుదెరువు మెళకువల ఆధారంగా జీ ఆన్ ఆ దాడి నుంచి ఎలా తప్పించుకుంది, బాబాయ్ మరణం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఎలా తెలుసుకుంది అనే కథనం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్‌ను అందిస్తుంది.
క్రిమినల్ జస్టిస్ (Criminal Justice)
పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ ఓటీటీ కోర్టు రూమ్ క్రైమ్ డ్రామా సిరీస్ 'క్రిమినల్ జస్టిస్'. ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌లో విక్రాంత్ మాస్సీ, జాకీ ష్రాఫ్, కీర్తి కుల్హారీ, అనుప్రియ గోయెంకా, శ్వేతా బసు ప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ తనతో ప్రయాణించిన యువతి హత్యకు గురికావడంతో చిక్కుల్లో పడతాడు.
అసలు ఏం జరిగిందో గుర్తులేని ఆ కుర్రాడే ప్రధాన నిందితుడిగా మారతాడు. అలాంటి సమయంలో న్యాయవాది మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి) అతడి కేసును చేతుల్లోకి తీసుకుంటారు. కోర్టు గదిలో సాగే వాదోపవాదాలు, జైలు జీవితం, నిజం కోసం సాగే శోధన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
జియోహాట్‌స్టార్ ఓటీటీలో
ఈ వెబ్ సిరీస్‌లన్నీ విభిన్నమైన కథాంశాలతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో రూపొందాయి. వీటిలో ది వరస్ట్ ఆఫ్ ఈవిల్, షాప్ ఫర్ కిల్లర్స్ తప్పా మిగతా నాలుగు సిరీస్‌లన్నీ ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇవి జియోహాట్‌స్టార్‌లో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.