OTT Weekend: ఫ్రెండ్స్‌తో కలిసి ఓటీటీలో చూడాల్సిన 5 బెస్ట్ కామెడీ సినిమాలు ఇవే! క్రైమ్, ఎమోషన్ టచ్‌తో-వీకెండ్‌కు బెస్ట్!

Must Watch OTT Movies With Friends This Weekend: వీకెండ్‌లో స్నేహితులతో సరదాగా సమయం గడపాలనుకుంటున్నారా? నవ్వుల పువ్వులు పూయించే 5 క్రేజీ బడ్డీ కామెడీ చిత్రాలు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఓటీటీల్లో ఉన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Oct 4, 2026, 20:07:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Must Watch OTT Movies With Friends This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్ అందరూ ఒక్కచోట చేరి కబుర్లు చెప్పుకోవడం, సరదాగా గడపడం మన దగ్గర సాధారణ విషయం. అలాంటి సమయాల్లో మంచి కామెడీ సినిమా తోడైతే ఆ మజానే వేరు. స్నేహం నేపథ్యంలో వచ్చే రోడ్‌ట్రిప్‌లు, కాలేజీ జ్ఞాపకాలు, చిలిపి గొడవలు ఎప్పుడూ బోర్ కొట్టవు.

ఫ్రెండ్స్‌తో కలిసి ఓటీటీలో చూడాల్సిన 5 బెస్ట్ కామెడీ సినిమాలు ఇవే! క్రైమ్, ఎమోషన్ టచ్‌తో-వీకెండ్‌కు బెస్ట్!
ఫ్రెండ్స్‌తో కలిసి ఓటీటీలో చూడాల్సిన 5 బెస్ట్ కామెడీ సినిమాలు ఇవే! క్రైమ్, ఎమోషన్ టచ్‌తో-వీకెండ్‌కు బెస్ట్!

నవ్వుకోవడానికి ఓటీటీలో

మీరు కూడా మీ గ్యాంగ్‌తో కలిసి ఫుల్లుగా నవ్వుకోవడానికి ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ ఐదు అద్భుతమైన బడ్డీ కామెడీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ ఓటీటీ సినిమాల జాబితా మీకోసం.

జిందగీ నా మిలేగీ దొబారా: యూరప్ అందాలు.. ముగ్గురు మిత్రుల ప్రయాణం

స్నేహితుల సినిమాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకువచ్చే చిత్రం 'జిందగీ నా మిలేగీ దొబారా'. 2011లో వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ముగ్గురు బాల్య మిత్రులు కలిసి స్పెయిన్‌కు బ్యాచిలర్ ట్రిప్‌ వెళ్లడం, అక్కడ ఎదురయ్యే అనుభవాలు వారి జీవితాలను ఎలా మార్చాయో దర్శకురాలు జోయా అక్తర్ అద్భుతంగా తెరకెక్కించారు. స్కై డైవింగ్, డీప్ సీ డైవింగ్, ప్రసిద్ధ లా టొమాటినా ఫెస్టివల్ సన్నివేశాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరినీ తమ పాత మిత్రులను గుర్తు చేసుకునేలా చేస్తుంది.

మడ్గావ్ ఎక్స్‌ప్రెస్: గోవా ట్రిప్ హంగామా

చిన్నప్పటి నుంచి గోవా వెళ్లాలని కలలు కనే ముగ్గురు స్నేహితులు.. పెద్దయ్యాక ఎలాగోలా ఆ కల నెరవేర్చుకుంటారు. తీరా అక్కడికి వెళ్లాక డ్రగ్ మాఫియా చిక్కుల్లో పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే కథాంశంతో నటుడు కునాల్ ఖేము దర్శకత్వం వహించిన ఓటీటీ క్రైమ్ కామెడీ చిత్రం 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్'.

దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. గ్యాంగ్‌స్టర్లు, మారణాయుధాలు, పొరపాట్ల వల్ల జరిగే రచ్చతో సాగే ఈ పూర్తిస్థాయి కామెడీ డ్రామా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

ఛిఛోరే: నోస్టాల్జిక్ కాలేజీ జ్ఞాపకాలు

కాలేజీ రోజుల నాటి మధుర స్మృతులను, హాస్టల్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం 'ఛిఛోరే'. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్, వరుణ్ శర్మ నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కాలేజీ రోజుల్లో విడిపోయిన మిత్రులు ఓ క్లిష్ట పరిస్థితిలో మళ్లీ ఎలా ఏకమయ్యారనేది ఇందులో చూడవచ్చు. నవ్వులతో పాటు చక్కని ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమా జియో హాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ రిలీజ్ అయింది.

ధమాల్: నాన్‌స్టాప్ నవ్వుల పండగ

ఏమాత్రం లాజిక్ ఆలోచించకుండా కేవలం నవ్వుకోవడమే ధ్యేయంగా సినిమా చూడాలనుకుంటే 'ధమాల్' సరైన ఎంపిక. నిధి వేటలో పడ్డ నలుగురు మిత్రులు చేసే మూర్ఖపు పనులు, కొనితెచ్చుకునే చిక్కులు విపరీతమైన వినోదాన్ని పంచుతాయి. సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ నటించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 2 ఓటీటీల్లో చూడవచ్చు.

ది హ్యాంగోవర్ ఓటీటీ

ఇక హాలీవుడ్ క్లాసిక్ బడ్డీ కామెడీ 'ది హ్యాంగోవర్' గురించి ఎంత చెప్పినా తక్కువే. లాస్ వెగాస్‌కు బ్యాచిలర్ పార్టీకి వెళ్లిన నలుగురు మిత్రులు రాత్రి ఏం జరిగిందో మరచిపోవడం, తప్పిపోయిన తమ స్నేహితుడిని వెతికే క్రమంలో ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు మైండ్ బ్లాక్ చేస్తాయి. బ్రాడ్లీ కూపర్, ఎడ్ హెల్మ్స్ నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లలో ది హ్యాంగోవర్ ఓటీటీ రిలీజ్ అయింది.

స్నేహం విలువను, పాత జ్ఞాపకాలతో

ఈ ఐదు సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, స్నేహం విలువను, పాత జ్ఞాపకాలను మళ్లీ నెమరువేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఈ ఓటీటీ చిత్రాలను చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయండి!

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More