...
...
Next Story

Kamakshi Bhaskarla: అనుష్క, సమంత, రష్మిక తరహాలోనే నటి కామాక్షి భాస్కర్ల.. హారర్ థ్రిల్లర్ అగధతో కొత్త అధ్యాయానికి నాంది?

Kamakshi Bhaskarla In Anushka Samantha Rashmika Route: స్టార్ హీరోయిన్లు అనుష్క, సమంత, రష్మిక మందన్నా బాటలోనే టాలీవుడ్ బ్యూటిఫుల్ నటి కామాక్షి భాస్కర్ల నడుస్తోందని తెలుస్తోంది. హారర్ థ్రిల్లర్ అగధ సినిమాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్‌ను కామాక్షి కంటిన్యూ చేయనుందా అనే ఆసక్తి మొదలైంది.

Published on: Aug 13, 2026, 12:58:43 IST
Advertisement

Kamakshi Bhaskarla In Anushka Samantha Rashmika Route: తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు హీరోయిన్లే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.

అనుష్క, సమంత, రష్మిక తరహాలో

అనుష్క, సమంత, రష్మిక తరహాలోనే నటి కామాక్షి భాస్కర్ల.. హారర్ థ్రిల్లర్ అగధతో కొత్త అధ్యాయానికి నాంది?
అనుష్క, సమంత, రష్మిక తరహాలోనే నటి కామాక్షి భాస్కర్ల.. హారర్ థ్రిల్లర్ అగధతో కొత్త అధ్యాయానికి నాంది?

స్టార్ హీరోయిన్స్ అనుష్క (అరుంధతి, ఘాటి, భాగమతి), సమంత (యశోద, శాకుంతలం, మా ఇంటి బంగారం), రష్మిక మందన్నా (ది గర్ల్‌ఫ్రెండ్), నివేదా థామస్ (శాకిని డాకిని, 35 చిన్న కథ కాదు) తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తున్న మరో టాలీవుడ్ బ్యూటీ సాయి కామాక్షి భాస్కర్ల.

మా ఊరి పొలిమేర, పొలిమేర 2, డెకాయిట్, షో టైమ్, 12ఏ రైల్వే కాలనీ తదితర సినిమాలతో నటిగా పాపులర్ క్రేజ్ తెచ్చుకున్నారు కామాక్షి భాస్కర్ల. నటనతో మెప్పించే కామాక్షి భాస్కర్ల త్వరలో హారర్ మిస్టరీ థ్రిల్లర్ ‘అగధ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఆస్తక్తి రేపిన అగధ ట్రైలర్

ఆగస్టు 14న విడుదల కానున్న ‘అగధ’లో కామాక్షి భాస్కర్ల మహాదేవి అనే పాత్రలో మెయిన్ లీడ్ రోల్ పోషించారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్, నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా ఆసక్తి నెలకొంది.

తెలుగు సినిమాలో మహిళా ప్రధాన కథలకు ఉన్న ఆదరణను పరిశీలిస్తే ఈ మార్పు కేవలం ఒక ట్రెండ్‌గా కాకుండా ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న పరిణామంగా కనిపిస్తోంది. సమంత ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. రష్మిక మందన్నా కూడా స్టార్ హీరోలతో కలిసి నటిస్తూనే ‘ది గర్ల్‌ఫ్రెండ్’, మైసా వంటి కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తోంది.

నివేదా థామస్ ‘35’ వంటి చిత్రాలతో నటనకు ప్రాధాన్యమున్న మహిళా ప్రధాన కథల్లో తనదైన ముద్ర వేశారు. అనుష్క శెట్టి అయితే ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’, ‘ఘాటి’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాలో మహిళా ప్రధాన చిత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థాయిని తీసుకొచ్చారు.

కామాక్షి భాస్కర్ల కెరీర్‌లో

ఇలాంటి నేపథ్యంలో ‘అగధ’ సినిమా కామాక్షి భాస్కర్ల కెరీర్‌లో కూడా కీలకమైన అడుగుగా నిలవనుందనే ఆసక్తి నెలకొంది.‘పొలిమేర’ చిత్రాలతో నటిగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కామాక్షి, ఇప్పుడు ‘అగధ’లో పూర్తిగా భిన్నమైన మహాదేవి పాత్రతో తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, నటిగా విభిన్నమైన భావోద్వేగ ప్రపంచాలను అన్వేషించాలనే ఆసక్తి కామాక్షిలో కనిపిస్తోంది. ‘అగధ’లోని మహాదేవి పాత్ర కూడా తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మెట్టుగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏ స్థాయిలో మెప్పించనుందనేది?

ఇప్పటికే ‘అగధ’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొన్న నేప‌థ్యంలో ఒక మహిళా ప్రధాన కథను తన భుజాలపై మోస్తూ కామాక్షి భాస్కర్ల మహాదేవిగా ఏ స్థాయిలో మెప్పించనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కామాక్షి భాస్కర్ల కెరీర్‌లో ‘అగధ’ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? మహిళా ప్రధాన చిత్రాల విజయ పరంపరలో మరో విజయాన్ని నమోదు చేస్తుందా? తెలుసుకోవాలంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe