...
...
Next Story

OTT Horror: ఓటీటీలో వణికించే తెలుగు హారర్ థ్రిల్లర్- సైకలాజికల్ ట్విస్టులు, దాగుడుమూతల మిస్టరీ- ఒంటరిగా అస్సలు చూడకండి!

Kannamoochi OTT Streaming And Review: ఓటీటీలో తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరస్ కన్నాముచి ఆకట్టుకుంటోంది. దెయ్యాల నుంచి మూగ, చెవిటి కుమార్తెను కాపాడుకునేందుకు ఒక తల్లి చేసే ఉత్కంఠభరిత పోరాటం, 20 ఏళ్ల నాటి హత్యారహస్యం నేపథ్యంలో సాగే ఈ ఓటీటీ సిరీస్ రివ్యూలో చూద్దాం.

Published on: Oct 2, 2026, 09:01:34 IST
Advertisement

Kannamoochi OTT Release And Review: డిజిటల్ పరిధి పెరిగిన తర్వాత ఓటీటీ ప్రియులు సైకలాజికల్, హర్రర్ థ్రిల్లర్ కథలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ విభాగంలో ప్రేక్షకులను భయపెడుతూనే, చివరివరకు ఉత్కంఠకు గురిచేసే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి.

ఓటీటీలో ఆకట్టుకుంటున్న హారర్ థ్రిల్లర్

ఓటీటీలో వణికించే తెలుగు హారర్ థ్రిల్లర్- సైకలాజికల్ ట్విస్టులు, దాగుడుమూతల మిస్టరీ- ఒంటరిగా అస్సలు చూడకండి!
ఓటీటీలో వణికించే తెలుగు హారర్ థ్రిల్లర్- సైకలాజికల్ ట్విస్టులు, దాగుడుమూతల మిస్టరీ- ఒంటరిగా అస్సలు చూడకండి!

సరిగ్గా అలాంటి అనుభూతినే తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ అన్నమూచి అందిస్తుంది. సూపర్ నేచురల్ అంశాలకు సైకలాజికల్ ట్విస్టులు జోడించి తెరకెక్కించిన ఈ సిరీస్ హారర్ ప్రేమికులను ఓటీటీలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్నమూచిలో తెలుగు హీరోయిన్ పూర్ణ అలియాస్ షమ్నా కాసిమ్ మెయిన్ లీడ్ రోల్ పోషించింది.

గుండె గగుర్పొడిచే కథాంశం

భర్తను కోల్పోయిన ప్రియ (షమ్నా కాసిమ్ / పూర్ణ) అనే మహిళ, తన మూగ, చెవిటి కుమార్తెతో కలిసి చెన్నైలోని ఒక కొత్త అపార్ట్‌మెంట్‌కు మారుతుంది. పాత జ్ఞాపకాలను మర్చిపోయి, కూతురితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తుంది.

ప్లాట్‌లో ఆత్మహత్య

కానీ, అక్కడ అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆ తల్లీకూతుళ్లకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొన్నేళ్ల క్రితం ఆ ఫ్లాట్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడనే చేదు నిజం వారికి ఆలస్యంగా తెలుస్తుంది.

దాగుడుమూతల ఆటలో ఊహించని మలుపు

ఒకరోజు ఇంట్లో చిన్నారితో కలిసి 'కన్నామూచి' (దాగుడుమూతలు) ఆడుతుండగా పాప అకస్మాత్తుగా మాయమవుతుంది. కనిపించకుండా పోయిన కూతురి కోసం వెతుకులాట ప్రారంభించిన ప్రియకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి.

20 ఏళ్ల నాటి రహస్యం

కష్టాల్లో ఉన్న తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ పూర్ణ జీవించారు. తన బిడ్డను వెతుక్కునే సన్నివేశాల్లో ఆమె కనబరిచిన భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బాలనటి ఆరాధ్య, నటుడు వివేక్ ప్రసన్న తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు అవినాష్ హరిహరన్ కథను నడిపించిన తీరు, సీన్ల ఆధారంగా అందించిన సౌండ్ ఎఫెక్ట్స్ భయాన్ని రెట్టింపు చేస్తాయి.

20 నుంచి 30 నిమిషాల ఎపిసోడ్స్

యూనికాన్, ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్ 2020 మార్చి 13న విడుదలైంది. ప్రతి ఎపిసోడ్ 20 నుంచి 30 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లుగా సాగుతుంది. అనవసర సాగదీత లేకుండా వేగవంతమైన కథనంతో సాగడం దీని ప్లస్ పాయింట్.

కన్నమూచి ఓటీటీ స్ట్రీమింగ్

ప్రస్తుతం జీ5 (ZEE5)లో అన్నమూచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి 5 భాషల్లో జీ5లో అన్నమూచి ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్ ఐఎమ్‌డీబీ (IMDb)లో 6.3 రేటింగ్ సాధించింది.

జీ5 ఓటీటీలో చూడొచ్చు

థ్రిల్లర్, హారర్ కథలను ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను అస్సలు మిస్ కాకూడదు. రాత్రి వేళల్లో ఒంటరిగా కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జీ5 ఓటీటీలో చూస్తే ఈ హారర్ రైడ్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks