Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో కిడ్నాప్ డ్రామా అంతా జ్యోత్స్నదే అని కార్తీక్ కు వైరా చెప్తాడు. దీంతో జ్యోత్స్నను ఇక క్షమించేది లేదని, గట్టిగా బుద్ధి చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు. ఈ నేపథ్యంలో జ్యోత్స్న విషయంలో కార్తీక్ ఏం చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది. మరి కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
కాంచన కోపం

పొద్దున డ్యూటీకి వెళ్లేందుకు కార్తీక్ రెడీ అవుతాడు. చేతికి దెబ్బ తగిలింది కదా వెళ్లొద్దని కాంచన అంటుంది. స్కూటీ దీప నడుపుతుందని కార్తీక్ చెప్తాడు. నువ్వు డ్రైవర్ వి కదా, మరి అక్కడికి వెళ్లాక కారు ఎలా నడుపుతావ్? కారు నడపలేని నువ్వు అక్కడికి వెళ్లి ఏం చేస్తావ్? ఊరికే తిరగడానికి అంత దూరం వెళ్లడం ఎందుకు? అని కాంచన గట్టిగా అడుగుతుంది.
కిడ్నాప్ కేసు
మేం వెళ్లి, తొందరగా వచ్చేస్తామని తల్లితో కార్తీక్ చెప్తాడు. కానీ కాంచన వినదు. ఎందుకు వెళ్తున్నారని గుచ్చిగుచ్చి అడుగుతుంది. నాక్కూడా చెప్పుకోలేని సీక్రెట్స్ ఏమున్నాయో అని కాంచన అంటుంది. జ్యోత్స్న కిడ్నాప్ కేసు ఎంక్వైరీ జరుగుతుంది కదా పోలీసులు వస్తే నేను ఉండాలని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. వీళ్లు నా దగ్గర ఏదో దాస్తున్నారని కాంచన అనుమానపడుతుంది.
జ్యో వెటకారం
దీప, కార్తీక్ స్కూటీపై రావడం చూసి జ్యోత్స్న కుళ్లుకుంటుంది. వీర మహిళ అంటే నువ్వే దీప. బావకి బుల్లెట్ తగిలిందని ఈ రోజు డ్యూటీకి రారేమో అనుకున్నా. మీరు ఆది దంపతులు కదా రాకుండా ఎలా ఉంటారని జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. బావ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నన్ను కాపాడాడు. దీప అంటే లెక్క లేనట్లే కదా. నా కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ బావకు ఉందని జ్యో అంటుంది.
నిన్ను క్షేమంగా తీసుకొస్తానని అత్తకు మాటిచ్చాను కాబట్టే అలా చేశా. మా అత్త మీద నీకు ప్రేమ ఉంటే వైరాతో చేతులు కలిపేదానివే కాదు అని కార్తీక్ అనడంతో జ్యో షాక్ అవుతుంది. ఇక్కడ అత్త గుండెలు బాదుకుంటుంటే, నువ్వు అక్కడ నచ్చింది తింటూ వాటా కోసం ఎదురు చూశావని కార్తీక్ అంటాడు.
బావపై ప్రేమ
{{/usCountry}}నిన్ను క్షేమంగా తీసుకొస్తానని అత్తకు మాటిచ్చాను కాబట్టే అలా చేశా. మా అత్త మీద నీకు ప్రేమ ఉంటే వైరాతో చేతులు కలిపేదానివే కాదు అని కార్తీక్ అనడంతో జ్యో షాక్ అవుతుంది. ఇక్కడ అత్త గుండెలు బాదుకుంటుంటే, నువ్వు అక్కడ నచ్చింది తింటూ వాటా కోసం ఎదురు చూశావని కార్తీక్ అంటాడు.
బావపై ప్రేమ
{{/usCountry}}అసలు నువ్వు మనిషివేనా? అని దీప మండిపడుతుంది. నిజం తెలిసిపోయినా జ్యోత్స్న తగ్గదు. బావకు నా మీద ఎంత ప్రేమ ఉందోనని ఆలోచిస్తున్నానని జ్యో అంటుంది. హద్దులు దాటొద్దని దీప వార్నింగ్ ఇస్తుంది. బావ నీ మెడలో తాళి కట్టాడు. నా కోసమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ప్రాణాలు ఇచ్చే ప్రేమ ఎప్పుడూ గొప్పదేనని జ్యో లాజిక్ మాట్లాడుతుంది.
దీపను రెచ్చగొట్టేలా
హలో, మిస్ హైదరాబాద్. నిన్ను కాపాడింది ప్రేమతో కాదు. మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్లు అత్త ప్రాణాలు నీలో ఉన్నాయి. అందుకే కాపాడానని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. వైరా ఫోన్ చేసి చెప్పడం తప్ప ఇంకేం చేస్తాడు? అని జ్యో అంటుంది. బావతో తాళి కట్టించుకున్నా నువ్వు చూస్తు ఉండటం తప్పా ఏం చేయలేవని దీపను జ్యో రెచ్చగొడుతుంది.
జ్యో పెళ్లి
తాళి కట్టించుకుంటానని ఎగురుతున్నావ్ కదా. ఈ రోజు డేట్ గుర్తు పెట్టుకో. వచ్చే నెలలో ఇదే రోజున నీ మెడలో తాళి పడుతుంది. నేను, నా భార్య కలిసి నీ పెళ్లి చేస్తాం. పెళ్లి కొడుకు వస్తాడు. నీకు మాటిస్తున్నాం అని జ్యోత్స్న చేతిలో కార్తీక్, దీప చేయి పెడతారు. నెల రోజుల్లో ఓ కుర్రాడిని చూసి నీకు కొంగుముడి వేసే బాధ్యత మాది అని కార్తీక్ అనగానే పారిజాతం విజిల్ వేసుకుంటూ వస్తుంది. ఏం చేస్తారో చూస్తానంటూ జ్యో లోపలికి వెళ్లిపోతుంది.
జాతకంలో దోషం
దీప దగ్గరకు పారు వెళ్తుంది. నానమ్మ అని పిలవమంటుంది. జ్యోత్స్నకు డెడ్ లైన్ ఇచ్చాం కదా అని కార్తీక్ అంటాడు. అందరిముందు జ్యోత్స్న నీ మొగుడిని కౌగిలించుకుంది. పెళ్లానివి నువ్వే నోర్మూసుకుని ఉన్నప్పుడు, నేనేం చేస్తా. దానికి పెళ్లి కాదు. నీతో నిశ్చితార్థం అనుకున్నారు, జరిగిందా? పెళ్లి జరిగిందా? గౌతమ్ తో పెళ్లి జరిగిందా? జ్యోత్స్న జాతకంలో దోషం ఉందేమో అనిపిస్తుందని పారు చెప్తుంది.
చేతులు కలిపి
అప్పుడే జ్యోత్స్న వస్తుంది. మీరు నా మనసును మార్చలేరని జ్యో అంటుంది. అది మనసు కాదు చెత్తబుట్ట అని పారు ఫైర్ అవుతుంది. దీపే కార్తీక్ భార్య అని పారు అంటే దాన్ని అబద్ధం చేస్తానని జ్యో చెప్తుంది. దీంతో జ్యో పైకి పారు దూసుకెళ్తోంది. మీరు ఏం చేయలేరని జ్యో వెళ్లిపోతుంది. పాప జాతకంలో ఏదో దోషం ఉందని కార్తీక్ కూడా డౌట్ పడతాడు. కార్తీక్ చెప్పడంతో పారు కూడా చేతులు కలుపుతుంది.
ఆపరేషన్ జ్యోత్స్న
నువ్వు ఇప్పుడు డాక్టర్ బాబు. ట్రీట్మెంట్ షురూ అని పారు అంటుంది. ఆపరేషన్ జ్యోత్స్న, క్యాప్షన్ ఏమో తొందర్లోనే పెళ్లి అని కార్తీక్ చెప్పడంతో పారు ఎగ్జైట్ అవుతుంది. హాల్ లో శివ నారాయణ, దశరథ, సుమిత్ర ఉంటారు. అప్పుడే పంతులు వస్తాడు. నేనే పంతులును పిలిచానని కార్తీక్ చెప్తాడు.
జ్యోత్స్నకు పెళ్లి చేయాలి కదా, జాతకం చూసేందుకు పంతులును రమ్మన్నానని కార్తీక్ అంటాడు. పంతులుతో కార్తీక్ సరదాగా మాట్లాడతాడు. పంతులు వచ్చాడు, మిమ్మల్ని రమ్మన్నారని జ్యోతో దీప అంటుంది. ఏం ప్లాన్ చేశారో చెప్పమని జ్యో అడుగుతుంది. వెయిట్ చేస్తున్నారు, రమ్మని చెప్పి దీప వెళ్లిపోతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.