Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 12 ఎపిసోడ్ లో.. లగేజీతో ఇంటి నుంచి వెళ్లిపోయిన జ్యోత్స్న, కార్తీక్ ఇంటికి వచ్చి షాక్ ఇస్తుంది. జ్ణాపకాలు ఇచ్చి వెళ్లేందుకు వచ్చానని చెప్తుంది జ్యో. బావ ఇచ్చిన గిఫ్ట్ లను తిరిగి ఇచ్చేస్తున్నా. ఇన్ని రోజులు బావ నన్ను వద్దనుకున్నాడు. ఇప్పుడు నేనే వద్దనుకుంటున్నా. ఫోన్లో బావతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేశానని జ్యో చెప్తుంది.
కొత్తగా జ్యోత్స్న

కార్తీక్ తనకు ఇచ్చిన ఒక్కో గిఫ్ట్ గురించి చెప్తూ అన్నింటినీ తీసి టేబుల్ మీద పెడుతుంది జ్యోత్స్న. ఇవన్నీ నువ్వే తీసుకో బావ అని జ్యోత్స్న అంటుంది. మనిషి అన్నాక పెళ్లి చేసుకోవాలని కాంచన, శ్రీధర్ జ్యోత్స్నకు చెప్తారు. శ్రీధర్ కు పెళ్లి విషయంలో జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. ఈ రోజు నుంచి నీకు, నాకు ఏ సంబంధం లేదు బావ. నీకు, నాకు పెళ్లి చేయాలని పెద్దవాళ్లు అనుకున్న బాధ ఈ రోజుతో పోయినట్లే అని జ్యోత్స్న కొత్తగా మాట్లాడుతుంది.
సూరజ్ ఎంట్రీ
ఈ రోజు నుంచి కార్తీక్ అంటే మేనత్త కొడుకు మాత్రమే. నాకు వరుసకు బావ అవుతాడు కాబట్టి బావ అని పిలుస్తానని జ్యో వెళ్లబోతుంది. అప్పుడే సూరజ్ కూడా కార్తీక్ ఇంటికి వస్తాడు. సూరజ్ ను చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. రెస్టారెంట్ గురించి మాట్లాడేందుకు నేనే రమ్మన్నానని కార్తీక్ చెప్తాడు.
మనసు ఇవ్వలేవంటూ
సూరజ్.. నా భర్త ఇచ్చిన వస్తువులన్నింటినీ జ్యోత్స్న తిరిగి ఇచ్చేసిందని దీప చెప్తుంది. కానీ మనసు మాత్రం ఇవ్వలేదు. నీ మనసులోని ప్రేమను ఎలా ఇవ్వగలవు? అని సూరజ్ జ్యోతో తిక్కగానే మాట్లాడతాడు. మనసులోని ప్రేమను ఎలా ఇస్తారు అని జ్యోత్స్న కోపంగా మాట్లాడుతుంది. కార్తీక్ మధ్యలో జోక్యం చేసుకొని గొడవ ఆపతాడు.
రెస్టారెంట్ డీల్
{{/usCountry}}సూరజ్.. నా భర్త ఇచ్చిన వస్తువులన్నింటినీ జ్యోత్స్న తిరిగి ఇచ్చేసిందని దీప చెప్తుంది. కానీ మనసు మాత్రం ఇవ్వలేదు. నీ మనసులోని ప్రేమను ఎలా ఇవ్వగలవు? అని సూరజ్ జ్యోతో తిక్కగానే మాట్లాడతాడు. మనసులోని ప్రేమను ఎలా ఇస్తారు అని జ్యోత్స్న కోపంగా మాట్లాడుతుంది. కార్తీక్ మధ్యలో జోక్యం చేసుకొని గొడవ ఆపతాడు.
రెస్టారెంట్ డీల్
{{/usCountry}}మరోవైపు రెస్టారెంట్ డీల్ గురించి దక్షిణామూర్తి, మాలిని మాట్లాడుకుంటారు. మెయిన్ సెంటర్లో ఉన్న రెస్టారెంట్ నష్టాల్లో ఉంది. ఓనర్ దాన్ని అమ్మాలనుకుంటున్నాడని మాలిని చెప్తుంది. పోటీకి శివ నారాయణ వస్తాడు కదా అని దక్షిణామూర్తి అనుమానపడతాడు. బాబాయికి ఆ సెంటర్ అవసరం లేదు. దాని ముందు లైన్లోనే బాబాయి రెస్టారెంట్ ఉంది. బాబాయి పోటీకి వచ్చినా మంచిదే కదా. మనతో పోటీ మనకే కదా అని మాలిని పైకి సాఫ్ట్ గా మాట్లాడుతుంది.
శివ నారాయణ తలదించుకునేలా
శివ నారాయణ గురించి ఆలోచించొద్దు. మనం సుమిత్ర గురించే మాట్లాడాలి. ఈ సారి పోటీకి వస్తే వాడే గెలుస్తాడని దక్షిణామూర్తి అంటాడు. మీ కోడలు ఆగిపోదు మామయ్య. ఈ సారి మనం గెలుస్తాం. సుమిత్ర మన వీక్ నెస్ గా మారొద్దు. శివ నారాయణ తలదించుకునేలా చేస్తా మామయ్య అని మాలిని చెప్తుంది. వాళ్లను సర్వనాశనం చేసేదాకా నాకు ప్రశాంతత ఉండదని మాలిని లోపల పగతో రగిలిపోతుంది.
కాంచన ఆశ్చర్యం
ఇటు కాంచన ఇంట్లో అందరూ భోజనాలకు రెడీ అవుతారు. జ్యోత్స్న అందరిలాగే కింద కూర్చుని తింటుంది. వింతలన్నీ ఒకేసారి చూస్తున్నా. గత కొన్ని రోజులుగా నీ జీవితంలో జరిగేవన్నీ వింతల్లాగే ఉన్నాయని కాంచన షాక్ అవుతుంది. కాలంలో పరిచమయ్యే మనుషులతో అన్నీ మారతాయని జ్యోత్స్న ఇండైరెక్ట్ గా సూరజ్ గురించి చెప్తుంది. సూరజ్ వెళ్లి జ్యోత్స్న కాలుపై కాలు వేసుకొని కూర్చుని భోజనం చేస్తాడు.
జ్యో పెళ్లి
జ్యోత్స్న కొత్తగా కనిపిస్తుంది బావ అని కార్తీక్ తో దీప మెల్లగా మాట్లాడుతుంది. నీకు పెళ్లా అని జ్యోను శౌర్య అడుగుతుంది. రాత్రి అమ్మానాన్న నిద్రపోకుండా మాట్లాడుతుంటే విన్నానని శౌర్య గుట్టురట్టు చేస్తుంది. నా నిర్ణయం చెప్పిన తర్వాత కూడా మీరు నిద్రపోకుండా నా పెళ్లి గురించి మాట్లాడుకోవటం ఏంటీ? అని జ్యోత్స్న అడుగుతుంది. కార్తీక్ ఏదో డైైవర్ట్ చేస్తాడు. అందరూ భోజనం చేస్తారు.
జ్యో మరో షాక్
సాంబార్ చాలా బాగుందని జ్యోత్స్న అంటుంది. సూరజ్ అంకుల్ కు కూడా సాంబార్ అంటే ఇష్టమున్నట్లు ఉంది. సూరజ్, జ్యో ఇష్టాలు ఒకటే అని శౌర్య భలే గమ్మత్తుగా మాట్లాడుతుంది. ఇష్టాలకు సర్టిఫికేట్లు అడుగుతారని సూరజ్ పై జ్యో కౌంటర్లు వేస్తుంది. ఇక జ్యో ఏమో తాను తిన్న ప్లేటు కడిగి మరో షాక్ ఇస్తుంది.
టెస్టు పాస్
పాతకాలంలో ఆడపిల్లలకు తిన్న ప్లేటు కడగే టెస్టు పెట్టేవాళ్లంటా. ఇప్పుడు నువ్వా టెస్టు పాసైపోయావని కార్తీక్ జ్యోతో అంటాడు. అంటే జ్యోత్స్నను చేసుకోబోయేవాడు లక్కీ అని శ్రీధర్ అంటాడు. ఏం సూరజ్ అని కాంచన కావాలనే అంటుంది. అక్కడ అందరూ ఇండైరెక్ట్ గా జ్యోత్స్న, సూరజ్ కు ముడిపడాలనే మాట్లాడతారు.
క్యాబ్ లో ఇంటికి వెళ్తానని జ్యోత్స్న అంటే అందరూ వద్దంటారు. సూరజ్ ఎలాగో అక్కడికే వెళ్తాడు కదా, దింపేస్తాడని కార్తీక్ అంటాడు. నేనే వెళ్లిపోతానని జ్యోత్స్న బయటకు వెళ్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.