Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 4 ఎపిసోడ్ లో సూరజ్ తో జ్యోత్స్నపెళ్లి చేయాలని మాట్లాడతారు. కానీ జ్యో ఒప్పుకోదు. సూరజ్ ను కొట్టి, అవమానించి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
జ్యోత్స్న రచ్చ

తనపై ఎవరికి ప్రేమ లేదని, ఉంటే అడ్రస్ లేని అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునేవాళ్లా? నన్ను అందరూ వదిలించుకోవాలని చూస్తున్నారు. అందరికీ అంత బరువైపోయానా? నా జీవితాన్ని నాశనం చేయాలనుంటున్నారా? దానికంటే కూడా నేను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం హ్యాపీగా ఉండగలను అని సూరజ్ తో పెళ్లి విషయంలో జ్యోత్స్న నానా రచ్చ చేస్తోంది.
శివ నారాయణ ఫైర్
చివరకు ఆ మాలిని అన్నదే నిజం చేశారు. నా జీవితానికి అన్యాయం చేసేందుకు రెడీ అయ్యారని జ్యోత్స్న అంటుంది. ఆ మాటలకు శివ నారాయణ ఫైర్ అవుతాడు. పెద్ద ఇంటికే పంపించాలనుకున్నా. సూరజ్ కు కన్నవాళ్లు లేకపోయినా కావాల్సిన వాళ్లయినా ఉండాలి కదా అని శివ నారాయణ అంటాడు. సూరజ్ ను వెంటనే గెంటేయండి. వాడు నా కంటికి కనిపించడానికి వీల్లేదని జ్యోత్స్న కోపంగా చెప్తుంది.
సూరజ్ కరెక్ట్
కార్తీక్, దీప ఇంటికి వెళ్తుంటే జ్యోత్స్న బయటకు వచ్చి మాట్లాడుతుంది. సూరజ్ అనాథ అని తెలిసే తీసుకొచ్చారు. ఈ రోజే తెలిసినట్లు నటించారు. సూరజ్ నాకు కరెక్ట్ అని మీరే చెప్పారంటా కదా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును, సూరజ్ నీ కంటే మంచివాడు. అన్నం పెట్టినవాళ్లను మర్చిపోలేడు. నీ కంటే సూరజ్ చాలా ఉత్తముడు. నీలాంటి దానికి వాడే కరెక్ట్ అని దీప గట్టిగా మాట్లాడుతుంది.
సూరజ్ కు అమ్మానాన్న ఉంటే పెళ్లి చేసేవాళ్లు కదా. సూరజ్ తన ముందు ఎందుకు పనికిరాడని జ్యోత్స్న అంటుంది. కానీ సూరజ్ ను మించిన భర్త నీకు జన్మలో దొరకడని చెప్పి దీప వెళ్లిపోతుంది. ఈ మాటలన్నీ సుమిత్ర వింటుంది. జ్యోత్స్నకు సూరజ్ సరైన జోడీ అని అనుకుంటుంది.
కాంచన ట్విస్ట్
{{/usCountry}}సూరజ్ కు అమ్మానాన్న ఉంటే పెళ్లి చేసేవాళ్లు కదా. సూరజ్ తన ముందు ఎందుకు పనికిరాడని జ్యోత్స్న అంటుంది. కానీ సూరజ్ ను మించిన భర్త నీకు జన్మలో దొరకడని చెప్పి దీప వెళ్లిపోతుంది. ఈ మాటలన్నీ సుమిత్ర వింటుంది. జ్యోత్స్నకు సూరజ్ సరైన జోడీ అని అనుకుంటుంది.
కాంచన ట్విస్ట్
{{/usCountry}}మరోవైపు కాంచన ఇంట్లో సూరజ్ గురించి మాట్లాడుకుంటారు. మంచోళ్లకు అన్యాయమే జరుగుతుంది. వాడికో కుటుంబం ఉంటే బాగుండేది. అనాథ అనే విషయం వదిలేస్తే ఆ అబ్బాయి మంచోడని శ్రీధర్ చెప్తాడు. ఒక అనాథకు జ్యోత్స్నను ఇచ్చి చేయాలని మా నాన్న అనుకోడని కాంచన అంటుంది. జ్యోత్స్న పెళ్లితో దీపకు ఏదో సంబంధం ఉందని శ్రీధర్, కాంచన ట్విస్ట్ ఇస్తారు. వీళ్ల మాటలను కార్తీక్ డైవర్ట్ చేస్తాడు.
సూరజ్ కు చెంపదెబ్బ
ఇటు రాత్రి కాగానే సూరజ్ రూమ్ లోకి కోపంతో వెళ్తుంది జ్యోత్స్న. సూరజ్ ను లాగిపెట్టి కొడుతుంది. నన్ను ట్రాప్ చేయడానికి ఎంతకు అమ్ముడుపోయావ్? ఎవరి మనిషివి? నన్ను లైన్ లో పెడితే ఎంత ఇస్తామన్నారు? నువ్వు రాకముందు నా జీవితం ఇలా ఉండేది కాదు. నన్ను ట్రాప్ చేయమని దీప చెప్పిందా? మా బావ చెప్పాడా? దీప నిజాయతీ లేని మనిషి. తన స్వార్థానికే బతుకుతుందని జ్యోత్స్న ఫైర్ అవుతూనే ఉంటుంది.
ప్లాట్ ఫామ్ పై కాపురం
డే వన్ నుంచి పెళ్లి చేసుకుందామనే వెంటపడ్డా కానీ అప్పుడు కోపంగా ఎందుకు మాట్లాడలేదు. నీకు ఏదో అయిందని సూరజ్ అడుగుతాడు. అనాథ, నీ బతుక్కి తగ్గట్లే నీ కోరిక ఉండాలి. ఇల్లు లేదు, బంధువులు లేరు. ఉంది ప్లాట్ ఫామ్ ఒకటే. అందులో టెంట్ వేసి కాపురం పెడతావా? నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావ్? అమ్మానాన్న ఎవరో తెలియదు. పెళ్లి కోసం అనాథ శరణాలయానికి వెళ్లాలి. అక్కడ అనాథకు తాళి కట్టి పెళ్లి చేసుకోవాలని జ్యో నానామాటలు అంటుంది.
ఈ మాటలతో సూరజ్ కు కోపం వస్తుంది. నేను అనాథను అని ఎవరు చెప్పారు? నీకు ఏం కావాలో చెప్పు అని సూరజ్ అడుగుతాడు. నువ్వు ఔట్ హౌజ్ వదిలి వెళ్లిపోవాలని జ్యోత్స్న అంటుంది. నేను నీకు మాట ఇచ్చాను. నేను నీకు ఇంకా కనబడను అని సూరజ్ చెప్తాడు.
సుమిత్ర రిక్వెస్ట్
ఉదయం కాంచనను పిలిపించి మరీ సూరజ్ తో జ్యోత్స్న విషయంలో సాయం అడుగుతుంది సుమిత్ర. అందరం కలిసి మామయ్యను ఒప్పిద్దామని అడుగుతుంది. అందరూ సరేనంటారు. లోపలికి వెళ్లి మాట్లాడతారు. మామయ్యతో సుమిత్ర మాట్లాడుతుంది. ఆరు నెలలుగా సంబంధాలు చూస్తున్నాం కానీ, ఎవరూ నచ్చట్లేదు. సూరజ్ మాత్రం సరైనవాడిలా కనిపించాడని సుమిత్ర అంటుంది.
మొండిగా జ్యోత్స్న
వాడు అనాథ, అందుకే నాకు నచ్చలేదని జ్యోత్స్న మొండిగా వాదిస్తుంది. ఇప్పుడు పెళ్లయిన మగవాళ్లు కూడా అమ్మానాన్నకు దూరంగా ఉంటున్నారని సుమిత్ర అంటుంది. శ్రీధర్, కాంచన కూడా ఇదే మాట చెప్తారు. కానీ ఎన్ని చెప్పినా సూరజ్ ను పెళ్లి చేసుకోనని జ్యో అంటుంది.
దీప అంటే నమ్మకం
దీపను పిలిచిన సుమిత్ర దీనికి అమ్మానాన్న ఉన్నారా? ఎవరు కన్నారో తెలియదు? ఎక్కడ పుట్టిందో తెలియదు? కష్టాల్లో పుట్టింది. కష్టాల్లో పెరిగింది. కానీ తన జీవితాన్ని చక్కదిద్దుకుంది కదా. ఈ రోజు దీప అంటే ఓ నమ్మకం. అది సీఈఓ పోస్టు కంటే గొప్పది. సూరజ్ కూడా దీప లాంటి మంచి మనసున్న మనిషి. తనకు ఎవరూ లేరు కాబట్టి మన అందరినీ తన వాళ్లు అనుకున్నాడని సుమిత్ర చెప్పుకొస్తుంది.
జ్యోత్స్న మాత్రం అసలు ఒప్పుకోదు. తాతను, నాన్నను చెప్పమంటుంది. చివరకు మామయ్యను సుమిత్ర రిక్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ సూరజ్ అనాథ అయితే, ఆ తప్పు చేసింది సూరజ్ కాదు వాళ్ల అమ్మానాన్నలు అని కార్తీక్ అంటాడు. సూరజ్ బాగా చదువుకున్నాడు. అందగాడు. జ్యోత్స్నకు ఈడుజోడు అని దీప చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.