...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు- శ్రీధ‌ర్ చిన్న‌కొడుకుగా సూర‌జ్‌- జ్యో షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 5 ఎపిసోడ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. జ్యోత్స్న, సూరజ్ పెళ్లికి శివ నారాయణ ఓకే అంటాడు. సూరజ్ ను దత్తత తీసుకుంటానని శ్రీధర్ షాకిస్తాడు. కానీ ఔట్ హౌజ్ లో సూరజ్ కనిపించడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Aug 5, 2026, 07:11:33 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 5 ఎపిసోడ్ లో సూరజ్ ను దత్తత తీసుకుంటానని జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇస్తాడు శ్రీధర్. కానీ ఔట్ హౌజ్ లో సూరజ్ ఉండడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

సూరజ్ గురించి గొప్పగా

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ ఉత్తముడు, అందగాడు. అలాంటి వాడు కంపెనీలో ఉండాలని మీరు కోరుకున్నారు. మరి మీ మనవరాలికి భర్తగా ఉండే అర్హత లేదంటారా అని శివ నారాయణను దీప అడుగుతుంది. నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్ను అర్థం చేసుకున్నాడు నాన్న అని సూరజ్ గురించి కాంచన గొప్పగా చెప్తుంది.

శ్రీధర్ ప్రశ్నలు

మిమ్మల్ని, మీ మనవరాలిని కాపాడటానికి సూరజ్ పుట్టుక అడ్డురాలేదు. కంపెనీలో అడ్వైజర్ గా పెట్టుకున్నప్పుడు పుట్టుక అడ్డురాలేదు. సూరజ్ నా మనిషి అని మాలినికి చెప్పినప్పుడు పుట్టుక అడ్డురాలేదు. నా మనవడు అని చెప్పినప్పుడు కూడా అడ్డు రాని పుట్టుక గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే, మీరు మీలా లేరు మామయ్య. మీరు పెద్దవాళ్లు, మీకు నేను చెప్పలేను. కానీ మీ నిర్ణయం తెలియాలని శ్రీధర్ ఇరకాటంలో పెట్టేస్తాడు.

శివ నారాయణ నిర్ణయం

దశరథ, నువ్వేమంటావ్ అని శివ నారాయణ అడుగుతాడు. నీ నిర్ణయం నా నిర్ణయం అని దశరథ అంటాడు. నా ఒక్కగానొక్క మనవరాలి పెళ్లి పదేళ్లు గుర్తుండిపోయేలా చేయాలని, పెద్ద కుటుంబానికి పంపించాలని అనుకున్నా. అందుకే సూరజ్ అనాథ అనగానే వద్దనుకున్నా. కానీ మీ అందరి మాటలు విన్నాక నిర్ణయం మార్చుకుంటున్నా. ఈ పెళ్లికి ఒప్పుకొంటున్నానని శివ నారాయణ అనగానే జ్యోత్స్న దిమ్మ తిరుగుతుంది. మిగతా వాళ్లందరూ సంతోషంతో సంబరపడతారు.

ప్రేమిస్తున్నాడన్న సుమిత్ర

ఎంతమంది చెప్తున్నా వాడు నాకు నచ్చలేదని జ్యోత్స్న అరుస్తుంది. దీన్ని పొగరు అంటారు. నీ అహంకారాన్ని పక్కన పెట్టి చూడు. నీ పక్కన నిలబడే అర్హత కనిపిస్తుందని సుమిత్ర అంటుంది. వాడొక అనాథ, అనాథ. నేను వాడిని పెళ్లి చేసుకోలేనని జ్యోత్స్న చెప్తుంది. సూరజ్ అనాథ అన్నదే నీ ప్రాబ్లెం అయితే, వాడిని నేను దత్తత తీసుకుంటానని శ్రీధర్ షాక్ ఇస్తాడు.

ఆస్తి కూడా

వెంటనే కార్తీక్, దీప విజిల్ కొడతారు. కాంచన కూడా ఓకే అంటుంది. ఇప్పుడు సూరజ్ అనాథ కాదు. నా చిన్న కొడుకు. తల్లి పేరు కాంచన. అన్న పేరు కార్తీక్. వదిన పేరు దీప. కావాలంటే నా ఆస్తిని మూడు ముక్కలు చేసి కార్తీక్, స్వప్నతో పాటు సూరజ్ కు ఇస్తానని శ్రీధర్ చెప్తుంటే జ్యోత్స్న మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం బావ, నీ కూతురిని మా ఇంటి కోడలిని చేయాలనే నీ చెల్లి కోరిక నెరవేరుతుంది. నీక ఓకేనా? అని శ్రీధర్ అడిగితే.. ఓకేనని దశరథ చెప్తాడు.

నీ మాటతో దాని పొగరు దిగిపోయింది అన్నయ్య అని సుమిత్ర అంటుంది. సూరజ్ ను తీసుకురమ్మని కార్తీక్ ను పంపిస్తుంది సుమిత్ర. పారు, దీపను కూడా వెంట తీసుకెళ్తాడు కార్తీక్. కానీ ఔట్ హౌజ్ ఖాళీగా ఉంటుంది. జ్యోత్స్నకు ఇచ్చిన మాట కోసం సూరజ్ ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. కార్తీక్ కాల్ చేసినా సూరజ్ లిఫ్ట్ చేయడు.

సూరజ్ లేడని

సూరజ్ లేడు, ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని కార్తీక్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. సూరజ్ ను నువ్వు ఏమైనా అన్నావా? ఎక్కడికైనా వెళ్లాడా? అని జ్యోత్స్నను సుమిత్ర అడుగుతుంది. అన్నింటికీ నేనే కారణమా? మామయ్య మీ దత్తపుత్రుడిని వెతుక్కో అని వెటకారంగా చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది. సూరజ్ వెళ్లిపోవడం వెనుకాల ఏదో జరిగిందని కార్తీక్ చెప్తాడు.

ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ

కార్తీక్, దీప ఆఫీస్ వెళ్లేసరికి సూరజ్ పని చేసుకుంటూ కనిపిస్తాడు. ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయావ్ బ్రదర్? ఎందుకు ఔట్ హౌజ్ ఖాళీ చేశావని కార్తీక్ అడుగుతాడు. నాకు నేనే నచ్చలేదు. గాయాలున్నాయని ఛైర్మన్ జాలిపడి ఉండమన్నారు. ఇప్పుడు ఖాళీ చేయాలనుకున్నానని సూరజ్ చెప్తాడు. అప్పుడే ఆఫీస్ కు వచ్చిన జ్యోత్స్న.. సూరజ్ ను చూసి షాక్ అవుతుంది.

పట్టించుకోని సూరజ్

కార్తీక్, దీప ఎంత అడిగినా జరిగిన విషయం మాత్రం సూరజ్ చెప్పడు. ఎవరో నిన్ను హర్ట్ చేశారు. నువ్వు బాధపడ్డావ్. ఆ బాధ తట్టుకోలేక వెళ్లిపోయావని కార్తీక్ అంటాడు. నన్ను హర్ట్ చేసేవాళ్లు ఇంకా పుట్టలేదు బ్రదర్. నన్ను బాధపెట్టానని ఎదుటి వాళ్లు అనుకుంటారు. కానీ నేను ఆ బాధను తీసుకోను. నాకు నచ్చినన్ని రోజులు, నచ్చిన చోట ఉంటానని సూరజ్ చెప్తాడు. సరేనని కార్తీక్, దీప లోపలికి వెళ్లిపోతారు.

ఎందుకు వచ్చావ్ రా అని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. కానీ సూరజ్ పట్టించుకోడు. మరోవైపు కార్తీక్, దీప లోపల మాట్లాడుకుంటారు. సూరజ్ విషయంలో అత్తను నమ్మి ముందుకు వెళ్దామని కార్తీక్ చెప్తాడు.

సూరజ్ కౌంటర్

ఇటు సూరజ్ తాగుతున్న కాఫీ కప్ ను లాక్కొని జ్యోత్స్న పగలగొడుతుంది. అయినా సూరజ్ పట్టించుకోడు. నా ముఖం చూసి ఎందుకు మాట్లాడట్లేదని జ్యోత్స్న అడుగుతుంది. అది నా ఇష్టం అని సూరజ్ కౌంటర్ వేస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe