...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాకిచ్చిన దశరథ-సూర‌జ్‌ను పెళ్లి చేసుకోక‌పోతే!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 6 ఎపిసోడ్ లో సూరజ్ రివర్స్ డ్రామా కొనసాగిస్తాడు. ఆఫీస్ నుంచి కూడా వెళ్లిపోతాడు. మరోవైపు ఆస్తి దక్కించుకునే ప్లాన్ చెప్తుంది పారిజాతం. దశరథ వీలుమానాతో జ్యోత్స్నకు షాక్ ఇస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 6, 2026, 07:08:40 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 6 ఎపిసోడ్ లో.. జ్యోత్స్నతో రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు సూరజ్. జ్యోత్స్న ఎంత తిట్టినా ఆమె ముఖంలోకి మాత్రం చూడడు. ఔట్ హౌజ్ లో నుంచి వెళ్లిపోతానని చెప్పావ్ కదా అని జ్యోత్స్న అడుగుతుంది. అవును, ఔట్ హౌజ్ నుంచి వెళ్లిపోయాను కదా. మళ్లీ రాను అని సూరజ్ చెప్తాడు. ఆఫీస్ కు కూడా రాకూడదు అని జ్యో అంటుంది. అది నీకు సంబంధం లేని విషయం. నేను దీప అడ్వైజర్ ని అని సూరజ్ కౌంటర్ ఇస్తాడు.

జ్యోత్స్న అనుమానం

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నువ్వు నాకు కనిపించకూడదు అని జ్యో అంటే కళ్లు మూసుకోమని సూరజ్ మాట్లాడతాడు. నువ్వు ఏదో కొత్త ప్లాన్ చేశావు అని జ్యోత్స్న అడుగుతుంది. అదేంటో నువ్వే చెప్పు. నీ ముఖం చూడటం నాకు ఇష్టం లేదు. నిజం కంటే అబద్ధం చాలా గొప్పది. నువ్వు ఏం చేయలేవు జ్యోత్స్న అని సూరజ్ చెప్తాడు. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే, ఏదో ప్లాన్ చేశావ్ అని జ్యో టెన్షన్ పడుతుంది.

అప్పుడే ఆఫీస్ బాయ్ వచ్చి ఛైర్మన్ పిలుస్తున్నారని చెప్తే సూరజ్ వెళ్తాడు. మా తాతతో ఏం చెప్తావని జ్యోత్స్న అడుగుతుంది. అబద్ధం చెప్పను, అలా అని నిజం కూడా చెప్పను అని సూరజ్ తన స్టైల్లో మాట్లాడతాడు.

చూడకపోతే ఏమవుతుంది?

ఇక జ్యోత్స్న కాల్ చేసి సూరజ్ ఆఫీస్ లో కనిపించాడని పారిజాతానికి చెప్తుంది. అసలు రాత్రి ఏం జరగనట్లు, నేను వాడిని కొట్టనట్లు బిహేవ్ చేస్తున్నాడు. నా ముఖం కూడా చూడట్లేదని జ్యో చెప్తుంది. నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? వాడు నీ ముఖం చూడకపోతే నీకేంటని పారు అంటుంది. దీంతో జ్యో కోపంతో కాల్ కట్ చేస్తుంది.

సూరజ్ నా మనిషి

అతిథిలా వచ్చినవాళ్లు అతిథిలా వెళ్లిపోవాల్సిందే. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకోలేను. నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను సార్. దీప ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసి ఆఫీస్ నుంచి కూడా వెళ్లిపోతాను సార్ అని సూరజ్ పెద్ద షాక్ ఇస్తాడు. ఇక్కడ ఉండటం నీకు ఎందుకు ఇష్టం లేదని శివ నారాయణ అడుగుతాడు. నీ విషయంలో నేను కానీ నా వాళ్లు కానీ ఏదైనా తప్పు చేశారా? అని అడుగుతాడు.

తప్పొప్పులు నిర్ణయించాల్సిన అవసరం లేదు సార్. నా నిర్ణయాలు నావే. దీపకు చెప్పి ఇక్కడి నుంచి బయల్దేరుతానని సూరజ్ అంటాడు. వెళ్లే ముందు ఒకసారి ఇంటికి రమ్మని శివ నారాయణ సూరజ్ ను అడుగుతాడు. ఏం చెప్పకుండా సూరజ్ బయటకు వెళ్లిపోతాడు.

ఆఫీస్ నుంచి ఔట్

బయట సూరజ్ కు లిఫ్ట్ ఇస్తానని జ్యోత్స్న అంటుంది. అరెరే తమరు ఔట్ హౌజ్ లో ఉండటం లేదు కదా. ఎక్కడ ఉంటున్నావో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తా. మా తాతతో ఏం మాట్లాడావు అని జ్యో అడుగుతుంది. ఒకరి మాటలు ఒకరితో చెప్పే అలవాటు నాకు లేదు. అప్పుడే తను బుక్ చేసిన బైక్ రావడంతో జ్యోత్స్న పిలుస్తున్నా పట్టించుకోకుండా సూరజ్ వెళ్లిపోయాడు.

దీప వచ్చి సూరజ్ ఇక ఆఫీస్ కు రానన్నాడని జ్యోకు చెప్తుంది. చూస్తుంటే నీది కోపంలా లేదు. సూరజ్ నీ వైపు చూడటం లేదని డిసప్పాయింట్ అయినట్లున్నావని జ్యోత్స్నను కార్తీక్, దీప ఆటపట్టిస్తారు.

పారు ప్లాన్

రాత్రి ఇంట్లో జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. మెళకువలోనే కల కంటున్నావని బోర్డుపై సూరజ్, జ్యోత్స్న బలాలు, బలహీనతలు రాసుకొస్తుంది పారిజాతం. సూరజ్ బలాలు అని ఇంట్లో ఉన్న వాళ్లందరి పేర్లతో పాటు తన పేరు కూడా రాస్తుంది పారు. నేను కూడా వీళ్ల పార్టీలో చేరిపోయా. నువ్వు దాసు కూతురివి. ఈ విషయం సూరజ్ కు తెలియదు. కార్తీక్, దీప ఎలాగైనా అతనికి చెప్పరని పారు వివరిస్తుంది.

ఆస్తి కోసం

పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం నీకు రాస్తానని మీ నాన్న అన్నాడు. నీ మెడలో మూడు ముళ్లు పడటంతో పాటు ఆస్తి కూడా నీదే అవుతుంది. సూరజ్ ఇల్లరికం వస్తాడు. పెళ్లయిన తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉండొచ్చు. అడ్డూఅదుపూ లేకుండా ఇక్కడే ఉండొచ్చు. మీ అమ్మ కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. నీకు మనసులో సూరజ్ అంటే ఇష్టం ఉన్నా అహంకారంతో ఒప్పుకోవడం లేదు. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే యువరాణిలా బతకొచ్చు. వేరే సంబంధం చేసుకుంటే అత్తారింటికి వెళ్లిపోవాలని పారు చెప్పడంతో జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది.

నీకు ఇగో

పొద్దున అందరూ హాల్ లో కూర్చుంటారు. నిన్ను పెళ్లి చేసుకోమ్మని సూరజ్ తో మాట్లాడబోతున్నామని జ్యోతో దశరథ అంటాడు. నాకిష్టం లేదని జ్యోత్స్న అంటుంది. నీకు ఇష్టం లేకపోవడం కాదు, నీకు ఇగో అని సుమిత్ర చెప్తుంది. అప్పుడే కార్తీక్, దీప వీలునామాతో వస్తారు.

వీలునామాతో ట్విస్ట్

ఈ వీలునామా ప్రకారం సూరజ్ తాళి కట్టిన మరుక్షణం ఈ ఆస్తి మొత్తం జ్యోత్స్నకే దక్కుతుందని కార్తీక్ చదవడంతో అందరూ షాక్ అవుతారు. నేనే మార్చి రాయించానని దశరథ అంటాడు. వీలునామా ఎందుకు మార్చి రాయించావని శివ నారాయణ అడుగుతాడు. అందుకు కారణం నేనేనని సుమిత్ర చెప్తుంది. తాత ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తనకు అవసరం లేదని కార్తీక్ మరోసారి స్పష్టంగా చెప్తాడు.

నీ అమ్మానాన్నగా మేం బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం మీదే. పెళ్లి చేసుకో అని దశరథ అంటుంటే జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe