...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: తాతయ్య కావాలన్న శౌర్య- స్వ‌ప్న ముందు కాశీకి శ్రీధ‌ర్ క్లాస్-శ‌త్రువు వైరాతో జ్యోత్స్న కుట్ర

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 18 ఎపిసోడ్ లో తాతయ్య దగ్గరకు కాంచనను పంపించాలని శౌర్య మరోసారి అంటుంది. వర్క్ మీద కాశీ ఫోకస్ తగ్గిందని శ్రీధర్ ఫైర్ అవుతాడు. ఇక దశరథ బిజినెస్ శత్రువు అయిన వైరాతో కలిసి జ్యోత్స్న కుట్ర పన్నుతుంది.

Published on: Dec 18, 2025, 06:59:58 IST
Advertisement

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 18 ఎపిసోడ్ లో శౌర్యకు దీప అన్నం తినిపిస్తుంది. దీప వచ్చినప్పటి నుంచి మాట్లాడటం లేదని అనసూయతో కాంచన అంటుంది. శౌర్య పరుగెత్తితే వెనకాల దీప పరుగులు తీస్తుంది. అప్పుడు కాంచన ఆ ప్లేట్ తీసుకుని, కడుపులో బేబీతో అమ్మ పరుగెత్తితే పడిపోతుంది కదా అని శౌర్యతో అంటుంది.

తాతయ్య దగ్గరకు

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

మా అమ్మ నాకు తినిపించకుండా, నేనే తినేలా? చేస్తుంది నానమ్మ మంచిది కాదు. అందుకే తాతయ్య దగ్గరకు పంపించాలని శౌర్య అంటుంది. ఇదే మాట ఎన్ని సార్లు అంటావే అని దీప చేయి ఎత్తుతుంది. వెంటనే దీప అని ఆపిన కాంచన తాతయ్య దగ్గరకు పంపించాలని ఎవరు చెప్పారే అని శౌర్యను అడుగుతుంది. అందరినీ చూసి నాతో నేనే చెప్పుకొన్నానని అంటుంది శౌర్య.

కాంచన ఆన్సర్

నేను ముద్దుల తాత ఇంటికి వెళ్లినప్పుడు జోగు రాణి తాతతో ఉంటుంది. సుమిత్ర అమ్మమ్మ తాతతో ఉంటుంది. మరి మనకు తాత ఉన్నాడు కదా. నువ్వు తాతతో ఉండాలి కదా నానమ్మ. మా ఫ్రెండ్స్ కు తాత నానమ్మలు ఉన్నారు. వాళ్లతో ఆడుకుంటారు. మరి నాకు తాత నానమ్మలు ఉండరా? అందుకే అలా అన్నాను. అలా అనడం నచ్చకపోతే సారీ నానమ్మ అని చెప్తుంది శౌర్య.

నీకు తాతయ్యతో ఆడుకోవాలనిపిస్తే చెప్పు మీ నాన్నతో పిలిపిస్తా. అంతే కానీ బాధపడకు అని శౌర్యతో అంటుంది కాంచన. మీ తాతను నాన్నతో పిలిపిస్తా అనకుండా నేనే పిలుస్తాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ని అమ్మ అని కార్తీక్ అనుకుంటాడు.

వర్క్ మీద ఫోకస్

ఇంకేదో ఇష్టం ఉండాలి కదా. మీతో ఉంటే ఫుడ్ ట్రక్ బిజినెస్ గురించి తెలుస్తుంది కదా. ఆ తర్వాత మేమే ఫుడ్ ట్రక్ పెట్టుకుంటాం లేదా రెస్టారెంట్ పెట్టుకుంటామని స్వప్న అంటుంది. అందుకు కాశీ ఓకే అంటాడు. రేపు ఫుడ్ ట్రక్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. ఏ మాత్రం తేడా వచ్చిన మా మామయ్య ఊరుకోరని శ్రీధర్ చెప్తాడు. జ్యోత్స్న హెల్ప్ చేస్తే బాగుండని కాశీ అనుకుంటాడు.

వైరాను కలిసిన జ్యోత్స్న

మరోవైపు బిజినెస్ శత్రువు అయిన వైరాను జ్యోత్స్న కలుస్తుంది. వేలం పాట నేను మర్చిపోలేనని వైరా అంటాడు. బిజినెస్ తెలివితో చేయాలి పగతో కాదని జ్యో చెప్తుంది. నువ్వు శివ నారాయణ మనవరాలివని ఒప్పుకుంటున్నానని వైరా అంటాడు. నీకు గెలిచే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? నేను సీఈఓగా ఉండాలి. ఇప్పుడున్న సీఈఓ దిగిపోవాలి. నాలా ఆలోచించగలిగేది మీరేనని జ్యో అంటుంది.

డీల్ ఓకే

నా మీద పగ తీర్చుకోవడానికి మీ నాన్నే నిన్ను పంపించి ఉంటే ఎలా? అని వైరా అడుగుతాడు. అప్పుడు గ్రీన్ టీ కప్ తీసుకుని ఓడిపోయినవాడిని మళ్లీ ఓడించాల్సిన అవసరం లేదు. నాకు సీఈఓ పోస్ట్ కావాలి. ఎలా చేయాలో నేను చెప్తా. ఏం చేయాలో మీరు చేయండని కాశీ ఫొటోను వైరాకు పంపుతుంది జ్యో. ఇప్పుడున్న సీఈఓను దింపేయాలంటే వీడు ఉపయోగపడతాడు. వీడికి మీరు జాబ్ ఇవ్వాలని జ్యో అడుగుతుంది. వైరా ఓకే అనడంతో జ్యో వెళ్లిపోతుంది.

జ్యో ఫ్రాడ్ గురించి

కాశీని తన రూమ్ లోకి పిలిపించుకుని జ్యోత్స్న మాట్లాడిందని కార్తీక్ కు దీప చెప్తుంది. అత్త పేరున స్థలం కొన్నానని కంపెనీ డబ్బును జ్యోత్స్న వాడింది కదా అలాంటివి బాగానే చేసింది. జ్యోత్స్న ఫ్రాడ్ గురించి నాన్న చెప్పాడు. అది తాతకు తెలిస్తే జ్యోత్స్నను క్షమించడు. ఇదంతా జ్యోత్స్నకు తెలిస్తే ఛాన్స్ లేదు. కాశీ జ్యోత్స్నను నమ్మడు. తన అవసరం కోసం ఎవరినైనా వాడుకుంటుందని కార్తీక్ అంటాడు.

ఆస్తి మొత్తం జ్యోత్స్న పేరున రాయించుకోవడానికి వాళ్లు ఏమైనా చేస్తారు. మా నాన్న నీతో ఏం మాట్లాడాడు అని దీపను అడుగుతాడు కార్తీక్. అత్త గురించి అడిగాడు. మనం చేయలేని పని శౌర్య చేసిందనుకున్నా. అత్త మనస్థత్వం నాకు అర్థమైంది బావ. మళ్లీ వీళ్లు కలవాలంటే బలమైన సంఘటన జరగాలని దీప చెప్తుంది. కాశీ, స్వప్న మధ్య కూడా అండర్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా ఒక బంధం కావాలనుకుంటే దారులు వేసుకోవాలి. కాశీతో ఒకసారి మాట్లాడాలని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe