Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 14 ఎపిసోడ్ లో పోటీకిి ఒప్పుకొంటాడు శివ నారాయణ. ఆ బాధ్యత మొత్తం దీప మీదే వేస్తాడు. ఈ పోటీలో దీపను ఓడించాలని జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ ను చూసేయండి.
సుమిత్ర కోసం

దక్షిణామూర్తితో పోటీకి వెళ్లాలని సుమిత్ర గట్టిగా అరుస్తుంది. నా మెట్టినింటి పౌరుషం ఏంటో వాళ్లకు తెలియాలి. మామయ్య ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. ఇది నా కోసం అని అని సుమిత్ర సమరానికి సై అంటుంది. పోటీ బాధ్యత మొత్తం కంపెనీ సీఈఓ దీప మీద పెడతాడు శివ నారాయణ.
దీప నమ్మకం
ఇది పోటీ కాదు. ఈ ఇంటి కోడలిగా నా ఆత్మ గౌరవం. దాన్ని నువ్వు గెలిపించాలని దీపతో సుమిత్ర చెప్తుంది. దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్లే అని షాకింగ్ కామెంట్లు చేస్తాడు శివ నారాయణ. మనం గెలుస్తామని దీప, కార్తీక్, సూరజ్ నమ్మకంగా చెప్తారు.
ఫీల్ అయిన దక్షిణామూర్తి
శివ నారాయణ పోటీకి దిగాడు. ఓడిపోతే తల ఎత్తుకోలేను. శివ నారాయణ మాటల మనిషి కాదు చేతల మనిషి అని కోడలు మాలినితో చెప్తాడు దక్షిణామూర్తి. శివ నారాయణ వల్ల నా కంటే నీకే ఎక్కువ నష్టం జరిగింది. నా కూతురు, అల్లుడు నా దగ్గర ఉంటే ఆ శివ నారాయణకు దక్షిణామూర్తి అంటే ఏంటో చూపించేవాడిని. నా కూతురే బలహీనత. అదే వాడి బలం అని దక్షిణామూర్తి ఫీల్ అవుతాడు.
మాలిని మాట
సుమిత్ర నా ఆడ పడుచు. ఆమె తిరిగి ఈ ఇంట్లో అడుగుపెట్టడం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని మాలిని తన మామయ్యకు చెప్తుంది. మన గతాన్ని మనం మార్చలేం. కానీ గతాన్ని చూసే విధానాన్ని మార్చొచ్చు. సుమిత్రను ఈ ఇంటికి తీసుకొస్తానని నేను మీకు మాటిచ్చా. ఏం చేసైనా అది నిలబెట్టుకోవాలి. మనం ఈ పోటీలో గెలుస్తున్నాం. సుమిత్రను ఈ ఇంటికి తీసుకొస్తున్నాం అని మాలిని కాన్ఫిడెంట్ గా చెప్తుంది.
శిక్ష పడాల్సిందే
{{/usCountry}}సుమిత్ర నా ఆడ పడుచు. ఆమె తిరిగి ఈ ఇంట్లో అడుగుపెట్టడం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని మాలిని తన మామయ్యకు చెప్తుంది. మన గతాన్ని మనం మార్చలేం. కానీ గతాన్ని చూసే విధానాన్ని మార్చొచ్చు. సుమిత్రను ఈ ఇంటికి తీసుకొస్తానని నేను మీకు మాటిచ్చా. ఏం చేసైనా అది నిలబెట్టుకోవాలి. మనం ఈ పోటీలో గెలుస్తున్నాం. సుమిత్రను ఈ ఇంటికి తీసుకొస్తున్నాం అని మాలిని కాన్ఫిడెంట్ గా చెప్తుంది.
శిక్ష పడాల్సిందే
{{/usCountry}}అదే జరగాలని దక్షిణామూర్తి లోపలికి వెళ్లిపోతాడు. మిమ్మల్ని అడ్డుపెట్టుకుని బాబాయిని యుద్ధంలోకి లాగా. ఒకరిని క్షమించి, ఒకరిని శిక్షించాలని అనుకుంటున్నారు. నేనైతే ఎవరినీ వదిలిపెట్టను. అందరికీ శిక్ష పడాల్సిందే. మీ కూతురు సుమిత్ర ఇంకా ఇంటికి తిరిగొస్తుందని అనుకుంటున్నారు. శివ నారాయణను పునాదులతో సహా తొలగించాలని అనుకుంటున్నా. బాబాయిని ఎవరు కాపాడుకుంటారో చూస్తానని మాలిని అనుకుంటుంది.
శౌర్య సరదాలు
మరోవైపు ఇంటికి వెళ్లగానే నాన్న ఎక్కడా అని కాంచనను అడుగుతాడు కార్తీక్. తాత రాలేదని శౌర్య చెప్తుంది. వెదర్ కండీషన్ బాగా లేకపోవడంతో రాలేకపోతున్నట్లు శ్రీధర్ పంపిన వీడియో మెసేజ్ ను కాంచన చూపిస్తుంది. ఇక అనసూయను చూసి దీప ఫీల్ అవుతుంది. నాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్లొద్దని దీప చెప్తుంది. కార్తీక్ కూడా అదే మాట చెప్తాడు. కూర చేస్తే సాంబారులా ఉంటుంది, సాంబారు ఏమో రసంలా ఉంటుందని అనసూయ వంటలకు వంక పెడుతుంది శౌర్య.
శౌర్య సరదాగా మాట్లాడటంతో అందరూ నవ్వుకుంటారు. ఇదే పెద్దమ్మా మేం మిస్ అయ్యాం. అసలు శౌర్య కాలుకు పట్టీలు ఉన్నాయనే విషయమే మర్చిపోయామని అనసూయతో కార్తీక్ అంటాడు. నేను వచ్చింది ఉండిపోవడానికి కాదు, వెళ్లిపోవడానికే అని మనసులో అనసూయ అనుకుంటుంది.
కన్నింగ్ జ్యో
ఇటు పోటీ గురించి జ్యోత్స్న ఆలోచిస్తుంటుంది. ఎప్పుడూ లేనిది మా మమ్మీకి కోపం వచ్చింది. దక్షిణామూర్తి తలనొప్పి అంటే, అసలు ఈ మాలిని ఎవరు? అని పారిజాతాన్ని జ్యో అడుగుతుంది. పోటీలోకి దించారు. మాలిని అంటే ఓ అగ్ని పర్వతం లాంటిది. ఈ ఇంటిని తగలపెట్టడం కోసం హోమంతో ముహూర్తం పెట్టింది మాలిని అని పారు అంటుంది. మనకు కావాల్సిందే జరిగింది గ్రానీ అని జ్యో కన్నింగ్ గా మాట్లాడుతుంది.
మనమే ఓడించుకోవాలి
మాలిని మామూలుది కాదు. అది చీర కట్టుకున్న తుపాకీ లాంటిది. మెట్టెలు పెట్టుకున్న నాటు బాంబు లాంటిది అని పారు తెగ ఎలివేషన్ ఇస్తుంది. నేను మా అత్తలాగా యుద్ధంలోకి నేరుగా వెళ్లే రకం కాదు. నేను బ్యాక్ స్టాబ్ (వెన్ను పోటు) చేస్తా. దీప మీద తాతకు ఉన్న నమ్మకాన్ని పోగొడతా. దీప కారణంగా తాత పరువు పోయిందనుకో దీప చెడ్డది అవుతుంది, జ్యో మంచిది అవుతుందని జ్యో అంటుంది. ఈ పోటీలో కష్టపడి మనల్ని మనమే ఓడించుకోవాలని కుట్ర పన్నుతుంది.
సూరజ్ ను పోటీకి రాకుండా ఎలా ఆపాలో ఆలోచించమని గ్రానీని అడుగుతుంది జ్యో. మార్నింగ్ కాఫీతో పాటు ఐడియా కూడా ఇస్తానని పారు అంటుంది.
అనసూయ ఎమోషనల్
ఇక ఊరికి వెళ్లిపోతానని అనసూయ అంటుంది. వెళ్లిపోని, నేనేమీ తన సొంత మేనకోడలిని కాదు కదా. పరాయి దాన్ని అనుకుంటుంది. ఎందుకు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలని దీప అడుగుతుంది. ముత్యాల గూడెంలో ఉన్న ఇంటికి వెళ్తే మా తమ్ముడితో ఉన్నట్లు ఉంటుందని అనసూయ ఎమోషనల్ అవుతుంది.
మాతో ఉండు నానమ్మ. నీకు మా అమ్మానాన్న, చిన్న నానమ్మ, నేను ఉన్నాం. అక్కడ ఎవరు ఉన్నారు? నాకు నువ్వు కావాలి నానమ్మ. నీకు వెళ్లాలనిపిస్తే వెళ్లు, కానీ అక్కడే ఉండదు. మళ్లీ వచ్చేయ్. నాకు ఏం వద్దు, నువ్వు చాలు అనే శౌర్య మాటలకు అనసూయ కరిగిపోతుంది. అలాగే ఉండిపోతానని అనసూయ మనసు మార్చుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.