...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కుట్ర బట్టబయలు- జ్యోత్స్నకు శివ నారాయణ ఊహించని షాక్-దీప నా కూతురిగా పుట్టుంటే అన్న సుమిత్ర!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 10 ఎపిసోడ్ లో మాణిక్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మరీ నిజం తెలిసేలా దీప, కార్తీక్ చేస్తారు. బిర్యానీలో బొద్దింక డ్రామా ఆడించింది జ్యోత్స్న అని తెలుస్తుంది. జ్యోకు మైండ్ బ్లాక్ అవుతుంది. తాత, తల్లి కలిపి జ్యోపై ఫైర్ అవుతారు.

Published on: Jun 10, 2026, 07:06:21 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజురోజుకూ అత్యంత ఆసక్తికరమైన ట్విస్టులతో సాగుతోంది. జ్యోత్స్న ఆడిన బొద్దింక డ్రామాను సూరజ్, కార్తీక్ కలిసి అట్టర్ ఫ్లాప్ చేశారు. నిజం బయటపడటంతో సుమిత్ర, శివనారాయణ జ్యోత్స్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కార్తీక దీపం 2 టుడే జూన్ 10 నాటి పూర్తి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

నిజం ఎందుకు దాచావ్ దీపా?

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

బొద్దింక డ్రామా వెనుకాల ఉంది జ్యోత్స్ననే అనే నిజం రెస్టారెంట్ దగ్గరే అందరికీ చెప్పకుండా ఎందుకు ఆపావని దీపను సూరజ్ అడుగుతాడు. "ఇలాంటి ఛాన్స్ మళ్లీ వస్తుందా? ఇది తెలిస్తే శివనారాయణ గారు జ్యోత్స్నను అసహ్యించుకునేవారు, మీరు సీఈఓ అయ్యేవాళ్లు కదా" అని సూరజ్ అంటాడు.

దానికి దీప సమాధానమిస్తూ.. "ఆ రెస్టారెంట్ పెద్దయ్యగారి భార్య పేరు మీద ఉంది. జ్యోత్స్న రెస్టారెంట్ అంటే జనాల్లో నమ్మకం ఉంది. తప్పు చేసింది జ్యోత్స్న అని తెలిస్తే అందరూ ఆమెను, ఈ ఫ్యామిలీని తప్పుపడతారు. లేనిపోని పుకార్లు వస్తాయి. కుటుంబం పరువు బజారున పడకూడదనే ఆగాను" అని చెప్తుంది. అయితే తప్పు చేసిన జ్యోత్స్నకు శిక్ష పడాల్సిందేనని, నిజాయితీగా పెద్దాయనకు నిజం తెలిసేలా చేద్దామని కార్తీక్ అంటాడు.

కార్తీక్ ఎంట్రీ.. జ్యోత్స్న మైండ్ బ్లాక్!

సీన్ కట్ చేస్తే.. శివ నారాయణ ఇంట్లో అందరూ మాణిక్యం గురించే మాట్లాడుకుంటారు. డబ్బుకు కక్కుర్తి పడి పరువు తీయాలనుకునే వాళ్లను క్షమించకూడదని దశరథ అంటుండగా.. "ఇది నువ్వే చేశావు కదా" అని జ్యోత్స్నతో పారిజాతం మెల్లగా అంటుంది. తప్పు చేసిన వాళ్లను పోలీసులకు అప్పగించాల్సిందేనని సుమిత్ర అనే సమయానికి కార్తీక్ చప్పట్లు కొడుతూ ఎంట్రీ ఇస్తాడు.

పోలీస్ స్టేషన్ భయానికి మాణిక్యం అసలు నిజం చెప్పేస్తాడు. "జ్యోత్స్న మేడమే నాకు డబ్బులిచ్చి ఈ పని చేయించారు" అని అందరి ముందూ ఒప్పుకుంటాడు. పారిజాతం కవర్ చేయడానికి ప్రయత్నించినా.. కార్తీక్ తన దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్‌లు, వీడియో ప్రూఫ్‌లు బయటపెడతానంటాడు. ఈ నిజం రెస్టారెంట్ లోనే ఎందుకు చెప్పలేదని పారు అడగ్గా.. పెద్దయ్య ఆత్మగౌరవం కోసమే దీప అక్కడ ఆపిందని సూరజ్ అసలు విషయం చెప్తాడు.

దీప నా కడుపున పుట్టి ఉంటే.. సుమిత్ర ఎమోషనల్

సొంత మనవరాలే ఇంత నీచమైన పని చేసిందని తెలిసి శివనారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది. వెంటనే జ్యోత్స్నను కొట్టేందుకు సుమిత్ర చేయి ఎత్తుతుంది. "నిన్ను సరిగ్గా పెంచనందుకు మమ్మల్ని మేము దండించుకోవాలి. నువ్వు సొంత కూతురివి అయ్యుండి తప్పు చేశావ్.. కానీ రక్త సంబంధం లేని దీప మన పరువు కాపాడింది. నీ బదులు దీప నా కడుపున పుట్టి ఉంటే తల్లిగా నా జన్మ సార్థకమయ్యేది" అంటూ సుమిత్ర ఎమోషనల్ అవుతుంది.

కార్తీక్ కూడా జ్యోత్స్న కుతంత్రాలపై మండిపడతాడు. చివరగా శివనారాయణ తీవ్ర నిర్ణయం తీసుకుంటాడు. "నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అసలు ఈ పోటీ ఎందుకు పెట్టానా అనిపిస్తోంది. ఈ రోజు నుంచి నా కుటుంబంలో నువ్వు ఉండవు" అంటూ జ్యోత్స్నకు గెట్ అవుట్ చెప్తాడు. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? జ్యోత్స్న నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా? దీపను శివనారాయణ సీఈఓ చేస్తారా? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks