కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 4 ఎపిసోడ్ లో.. దీప కడుపులో బిడ్డను వదులుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదని దశరథ అన్న మాటలను పారిజాతం వింటుంది. ఇదే ఒక్కటే దారి అని కార్తీక్, దీప వెళ్లిపోతారు. సమస్య నుంచి బయటపడటానికి ఇదొక్కటే దారి అని కార్తీక్ అంటున్నాడు ఏంటీ, ఈ మాట మరొకరికి చెప్పాలని పారు అనుకుంటుంది.
కావేరి కోపం

విడాకుల మీద సంతకాలు పెట్టినందుకు కూతురికి ఆపిల్ కట్ చేసి పెడుతున్నారా? ఇంకా నయం కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేయలేదని భర్త శ్రీధర్ పై కావేరి ఫైర్ అవుతుంది. మంచి లాయర్ ను చూసి కూతురికి, అల్లుడికి విడాకులు ఇప్పిస్తున్నారని కావేరి సీరియస్ అవుతుంది. మీకెందుకు నా మీద కోపం లేదని తండ్రి శ్రీధర్ ను స్వప్న అడుగుతుంది.
నాన్న ఒక హీరో
తన కూతురి జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని మీ అమ్మ భయపడుతుంది. కానీ నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. ప్రతి కూతురికి నాన్న ఒక హీరో. నా కూతురికి నేనే ధైర్యాన్ని. వివాహ బంధాన్ని ఎవరూ కావాలని తెంచుకోరు. ఇష్టం లేదని వద్దనుకున్నావు. అందరిలాగే నేనూ నిన్ను తిడితే వాళ్లకు, నాకు తేడా ఏం ఉంటుంది? నేను నీకు ధైర్యంగానే ఉంటా. నీకు నచ్చింది చేయ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండమని స్వప్నతో శ్రీధర్ చెప్తాడు. ఈ మాటలకు స్వప్న ఏడ్చేస్తుంది.
పారిజాతం ఫోన్
మరోవైపు కాంచనకు పారిజాతం కాల్ చేస్తుంది. నువ్వేమో కోడలు, పుట్టబోయే బిడ్డ గురించి గంపెడు ఆశలు పెట్టుకుని ఉన్నావు. వాటిలో ఏ ఒక్కటి నిజం కాదని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? నీ కోడలు కడుపు వద్దని అనుకుంటుంది. నమ్మకపోతే నష్టపోయేది నువ్వే. కళ్లారా చూసిందే చెప్పా. నీ కోడలు కడుపు వద్దనుకుంటుంది. నీ కొడుకు, నీ అన్న, నీ కోడలు ముగ్గురు మాట్లాడుకుంటుంటే నేను విన్నానని కాంచనతో పారిజాతం చెప్తుంది.
కారణం తెలుసుకోమ్మని
బిడ్డ, సమస్య, పరిష్కారం, కడుపు లేకపోతే, నిర్ణయం తీసుకున్నాం అనే పదాలైతే విన్నా. నీ కోడలికి ఈ కడుపు మోయడం ఇష్టం లేదు. దానికి వెనుక ఉన్న కారణం నువ్వే తెలుసుకో. నువ్వు జాగ్రత్తపడతావని ఫోన్ చేశా. నువ్వు ఇంకా నా కోడలు, నా కొడుకు పిల్లలు అనే ఆశలు ఉంటే వదిలేసుకోవడం మంచిది. నీ కోడలు నీ కొడుకును గుప్పిట్లో పెట్టుకుందని కాంచనకు చెప్పి పారిజాతం కాల్ కట్ చేస్తుంది.
కార్తీక్ కు దీప ప్రశ్నలు
{{/usCountry}}బిడ్డ, సమస్య, పరిష్కారం, కడుపు లేకపోతే, నిర్ణయం తీసుకున్నాం అనే పదాలైతే విన్నా. నీ కోడలికి ఈ కడుపు మోయడం ఇష్టం లేదు. దానికి వెనుక ఉన్న కారణం నువ్వే తెలుసుకో. నువ్వు జాగ్రత్తపడతావని ఫోన్ చేశా. నువ్వు ఇంకా నా కోడలు, నా కొడుకు పిల్లలు అనే ఆశలు ఉంటే వదిలేసుకోవడం మంచిది. నీ కోడలు నీ కొడుకును గుప్పిట్లో పెట్టుకుందని కాంచనకు చెప్పి పారిజాతం కాల్ కట్ చేస్తుంది.
కార్తీక్ కు దీప ప్రశ్నలు
{{/usCountry}}తాతకంటే అబద్దం చెప్పావు. అత్తకు ఏం చెప్తావని కార్తీక్ ను దీప అడుగుతుంది. మరో అబద్దం చెప్తానని కార్తీక్ అంటాడు. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేది కాదు కదా. హాస్పిటల్లో ఉండాలి. అనుమానం రాదా? ఏం చెప్తావ్? మా నాన్నను కన్వీన్స్ చేయగలం. కానీ అత్తయ్య అలా కాదు కదా. నేను బిడ్డ గురించి తనకు మాటిచ్చా. అత్తయ్య ముఖం కూడా చూడలేనని దీప బాధ పడుతుంది. నా బాధ కూడా అదే దీప అని కార్తీక్ అంటాడు.
అమ్మ బతకాలి
మార్నింగ్ లగేజీ సర్దుకుని బయల్దేరాలి బావ. అత్తను నమ్మించేలా అబద్దం చెప్పాలి. ఇప్పుడే వెళ్లి మాట్లాడమని కార్తీక్ కు దీప చెప్తుంది. ఏం చెప్తే మా అమ్మ బాధపడుతుందోనని ఆలోచిస్తున్నానని కార్తీక్ అంటాడు. ఏదైతే అనుకున్నామో అదే మాట మీద ఉందాం. అమ్మను కాపాడాలి. అమ్మ బతకాలి. మనం ధైర్యంగా ఉందాం బావ. అత్త నమ్మేలా చెప్పు అని కార్తీక్ తో దీప అంటుంది.
ఏం జరిగినా నువ్వు రేపు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నావు. మీ నాన్న కోసం కానీ, మా అమ్మ కోసం కానీ మనం ఆగడం లేదు. మన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని కార్తీక్ చెప్తాడు.
దాసుకు నిజం
ఉదయం దాసును దశరథ కలుస్తాడు. నాకు చాలా పెద్ద శిక్ష వేయాలి. నేను తప్పు చేయడం లేదు పాపం చేస్తున్నా. మీ వదినను కాపాడటానికి నా కూతురు దీప ఉంది. కానీ మనవరాలిని ఎవరు కాపాడుతారు. మీ వదినను కాపాడాలంటే దీప కావాలి. దీప ఆపరేషన్ కు రెడీగానే ఉంది. కానీ ఆపరేషన్ కు సిద్ధపడితే కడుపులో ఉన్న బిడ్డను కాపాడలేనని డాక్టర్ చెప్పింది. దీప ఆగిపోతే కడుపులో ఉన్న బిడ్డ బతుకుతుంది కానీ మీ వదిన బతకదు. ఆపరేషన్ చేస్తే మీ వదిన బతుకుతుంది. కానీ కడుపులో ఉన్న బిడ్డ బతకదు అని దాసుకు దశరథ అసలు విషయం చెప్పేస్తాడు.
బిడ్డ మృత్యుంజయురాలు
దీప కథను ఏ రాతి గుండె రాసింది అన్నయ్య? దీప జీవితానికి ఇన్ని కష్టాలు ఏంటీ? బిడ్డకు ఏం కాదని నాకు నమ్మకం ఉంది అన్నయ్య. దీప కడుపులో బిడ్డకు ఏం కాదు అనిపిస్తుంది. దీప కడుపులో బిడ్డ మృత్యుంజయురాలు అవుతుంది అన్నయ్య. నా మాట నమ్ము అని దశరథకు దాసు గట్టిగా చెప్తాడు.
కార్తీక్ ను నిలదీసిన కాంచన
పారిజాతం ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని శ్రీధర్, అనసూయకు కాంచన చెప్తుంది. దీప కడుపు వద్దనుకుంటుందని కాంచన అంటుంది. నీ అనుమానం తీరాలంటే నేను ఏం చేయాలి అని అనసూయ అడుగుతుంది. అప్పుడే లగేజీ బ్యాగ్ తో కార్తీక్, దీప వస్తారు. సరదాగా కొన్ని రోజులు బయటకు వెళ్లాలని అనుకుంటున్నామని కార్తీక్ చెప్తాడు. ఇంకా నిజాలు ఎందుకు దాస్తున్నారు? పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పిందని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.