...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: బిగ్ ట్విస్ట్- దీపే అసలైన వారసురాలని తెలుసుకున్న పారిజాతం- నిజం చెప్పిన జ్యోత్స్న

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మే 13 ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. దీపే అసలైన వారసురాలని పారిజాతానికి జ్యోత్స్నచెప్తుంది. కార్తీక్, దీపను ఆటాడుకుంటానని పారు చెప్తుంది. నెల్లూరు బ్రాంచ్ లో ఫ్రాడ్ జరిగిందని జ్యో కుట్ర పన్నుతుంది.

Published on: May 13, 2026, 07:00:59 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో పారిజాతానికి నిజం తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. తానే పారు సొంత మనవరాలిని అని దాసుతోనే జ్యోత్స్న చెప్పిస్తుంది. నిజం తెలుసుకున్న పారు.. మళ్లీ జ్యోతో చేతులు కలుపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 13 ఎపిసోడ్ లో చూసేయండి.

పారు కన్ఫ్యూజన్

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నువ్వు అసలైన వారసురాలివి కానప్పుడు నీ బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? నీ బోన్ మ్యారో ఎలా ఇచ్చావ్? మళ్లీ నాకు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? నువ్వు దాసు కూతురివా? సుమిత్ర కూతురివా? అని జ్యోత్స్నను అడుగుతూ పారిజాతం గందరగోళానికి గురవుతుంది. సుమిత్ర ఆపరేషన్ జరిగింది. కన్న కూతురే బోన్ మ్యారో ఇచ్చిందని జ్యోత్స్న అంటుంది.

శివ నారాయణ మనవరాలు ఎవరు?

ఎక్కడో ఉన్న కన్న కూతురు ఎలా ఇచ్చింది? అని పారు టెన్షన్ పడుతుంది. కన్న కూతురు ఎవరో తెలియకపోవచ్చు. కానీ కన్న తల్లి ఎవరో ఆ కన్న కూతురికి తెలుసు అని జ్యో మాట్లాడుతుంది. ఆ కన్న కూతురు ఎవరో నీకు తెలుసా? అని పారు అడిగితే, తెలుసని జ్యో షాక్ ఇస్తుంది. జ్యో కాళ్లను పట్టుకుని ఎవరు? అని పారు అడుగుతుంది. చిన్నప్పుడు వదిలేసిన ప్రాణాలు ఇప్పుడు తీస్తా. శివ నారాయణ మనవరాలు ఎవరు? అని పారు గట్టిగా అడుగుతుంది.

అటు కిచెన్ లో ఉన్న దీపకు పొలమారుతుంది. నేను తన మనవరాలు కాదన్న విషయం పారిజాతానికి తెలిసిపోయిందేమోనని దీపకు డౌట్ వస్తుంది. పారు ఎవరు చెప్పినా వినదు. జ్యోత్స్న చెప్పినా వినదు. నీ గురించి జ్యోత్స్నకు పారు ఏం చెప్పినా నమ్మదని కార్తీక్ అంటాడు. మరోవైపు శివ నారాయణ మనవరాలు ఎవరు అని పారు మళ్లీ అడుగుతుంది.

వారసురాలు దీప

ఇక్కడ ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. పారిజాతం ఎంత అమాయకురాలివే అని పారు చెంపలు కొట్టుకుంటుంది. నట సౌర్వభౌమ కార్తీక్, మహానటి దీప, సహజ నటి జ్యోత్స్న, సహాయ నటుడు దాసు లాంటి ఉత్తమ నటులు ఉన్నారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. బై బర్త్ నేను విలన్ నే. అందరిని తొక్కిపట్టి నార తీస్తానని పారిజాతం ఆవేశపడుతుంది.

జ్యో కుట్ర

నువ్వు బయటపడితే నష్టం మనకేనని పారును జ్యో ఆపుతుంది. అందరికి దీప గురించి నిజం తెలిసేలోపు ఆస్తి నా పేరు మీద రాసుకోవాలి. బావను పెళ్లి అని జ్యో అంటుండగా పారు ఆపుతుంది. వాడెందుకే నీకు? కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని ఆలోచన వదిలేయమని పారు చెప్తుంది. ఆస్తి మనది కావాలంటే, నీకు ఏ నిజం తెలియనట్లే ఉండాలి. మనిషివి అటు ఉంటావ్, ఆట ఇటు ఆడతావని జ్యో కుట్ర పన్నుతుంది.

జ్యోత్స్న మొసలి లాంటిది. నువ్వు నీరు గ్రానీ. మనం కలిస్తే ఈ ఇంటి చరిత్రే మార్చేయొచ్చని జ్యో అంటుంది. జ్యో, పారు చేతులు కలుపుతారు. వాళ్లతో నేను కబడ్డీ ఆడతానని పారు ఎగిరిపడుతుంది.

బ్రాంచ్ లో ఫ్రాడ్

మరోవైపు దక్షిణామూర్తి మాటలను శివ నారాయణ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే శివ నారాయణకు కాల్ వస్తుంది. ఎవరి మీదో కోప్పడతాడు. దశరథను పిలుస్తాడు. కార్తీక్, దీప, జ్యో, పారు కూడా వస్తారు. గుమాస్తా విష్ణు ఫోన్ చేశాడు. నెల్లూరు బ్రాంచ్ లో పెద్ద ఫ్రాడ్ జరిగింది. నెల్లూరు వెళ్లాలని శివ నారాయణ కారు తీయమంటాడు. దశరథ వెళ్తానంటాడు.

దీపకు డౌట్

దీపకు జ్యోత్స్నపై అనుమానం వస్తుంది. దీపను పారు అలాగే చూస్తుంటుంది. మీరిద్దరూ కొత్తగా కనిపిస్తున్నారు. నేను పిచ్చి మాలోకాన్ని. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తానని కార్తీక్ తో పారు అంటుంది. కార్తీక్, దీప బయటకు వెళ్తారు. పారు ఏదో తేడాగా ఉందని, నెల్లూరు ప్లాన్ జ్యోత్స్నదేమోనని కార్తీక్ తో దీప అంటుంది. నెల్లూరు ప్లాన్ నీదే కదా అని జ్యోతో పారు అంటుంది. సైలెంట్ గా ఉండు, రేపు బోర్డ్ మెంబర్స్ మీటింగ్ ఉందని జ్యో చెప్తుంది.

ఉలిక్కిపడ్డ కాంచన

కార్తీక్, దీప ఇంటికి వెళ్తారు. నానమ్మ కాంచనకు శౌర్య కౌంటర్లు వేస్తుంది. అత్త వాళ్ల నాన్న దక్షిణామూర్తి గురించి ఏమైనా తెలుసా అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. కాంచన ఉలిక్కిపడుతుంది. ఆ పేరు ఎలా తెలుసని కాంచన అడుగుతుంది. ఇంటికి వచ్చాడని కార్తీక్ చెప్తాడు. ఆ తాత గురించి ఎందుకు తెలియనివ్వలేదని దీప అంటే, ఎవరే తాత అని కాంచన కోప్పడుతుంది.

మన దృష్టిలో ఆ కుటుంబం చచ్చిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ మనిషి ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదని కాంచన అంటుంది. వాళ్లకు, మనకు ఏం గొడవ జరిగిందని కార్తీక్ అంటాడు. మరోసారి అడిగితే నేను చచ్చినంత ఒట్టేనని కాంచన అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks