Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మనసులో ఉన్నదాన్ని బయటపెట్టేలా కార్తీక్ చేస్తాడు. బావనే పెళ్లి చేసుకుంటానని జ్యో తెగేసి చెప్తుంది. దీప మెడలోని తాళిని పట్టుకుంటుంది. దీంతో జ్యోను దీప, సుమిత్ర కొడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 1 ఎపిసోడ్ లో చూసేయండి.
బావనే పెళ్లి చేసుకుంటా

కార్తీక్ నీ భర్త అని జ్యోత్స్నతో ఎన్నో సార్లు చెప్పా. అలా చెప్పి తప్పు చేశా. ఇప్పుడు తనే అర్థం చేసుకోవాలి. చిన్న పిల్ల కాదు కదా. సుమిత్ర న్యాయంగానే మాట్లాడుతుందని దశరథ అంటాడు. నా జీవితం గురించి మాట్లాడేందుకు అందరికీ న్యాయాలు గుర్తుకొస్తాయని జ్యో అంటుంది. నాకు బావ కావాలి, బావనే పెళ్లి చేసుకుంటానని జ్యో ఒకటే పాట పాడుతుంది.
పారు చెప్పిన నిజం
నీకు బుద్ధి రాదా? చీ.. నువ్వేం మనిషివి అని జ్యోను సుమిత్ర అసహ్యించుకుంటుంది. ఇప్పుడు నన్ను తిడుతున్నారు. మరి బావను ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదు. నేనంటే ఇష్టం లేదని బావ ముందే ఎందుకు చెప్పలేదని జ్యో లాజిక్ గా మాట్లాడుతుంది. నాతో చెప్పాడని పారిజాతం అనగానే అందరూ షాక్ అవుతారు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోలేనని, తనతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని నాతో చెప్పాడని గతాన్ని పారు గుర్తు చేసుకుంటుంది.
కార్తీక్ చెప్పిన విషయం
లండన్ నుంచి కార్తీక్ రాగానే మీరందరూ పెళ్లి గురించి మాట్లాడుతుంటే, వీడు జ్యోత్స్నను పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. కానీ ఆ విషయాన్ని మీతో నేను చెప్పలేదు. రెండు కుటుంబాలు ముక్కలు కాకూడదనే చెప్పలేదు. జ్యోత్స్న చిన్నప్పటి నుంచి కార్తీక్ మీద ప్రాణం పెట్టుకుంది. అందుకే కార్తీక్ పెళ్లి చేసుకోడని చెప్తే జ్యోత్స్న ఏం చేసుకుంటుందోనని భయమేసిందని పారు నిజం చెప్తుంది.
ఇంట్లో నుంచి గెంటేస్తా
నష్టపోయిన నాకు న్యాయం జరగాలి. బావ నా మెడలో తాళి కట్టాలని జ్యో మళ్లీ అదే మాట అంటుంది. ఒక తల్లిగా చెప్తున్నా. మరోసారి కార్తీక్ ను పెళ్లి చేసుకుంటానని నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. నీ మీద నాకు ప్రేమ ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని ఎదుటి వాళ్ల జీవితాలతో ఆడుకుంటానంటే క్షమించనని సుమిత్ర సీరియస్ గా చెప్తుంది.
{{/usCountry}}నష్టపోయిన నాకు న్యాయం జరగాలి. బావ నా మెడలో తాళి కట్టాలని జ్యో మళ్లీ అదే మాట అంటుంది. ఒక తల్లిగా చెప్తున్నా. మరోసారి కార్తీక్ ను పెళ్లి చేసుకుంటానని నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. నీ మీద నాకు ప్రేమ ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని ఎదుటి వాళ్ల జీవితాలతో ఆడుకుంటానంటే క్షమించనని సుమిత్ర సీరియస్ గా చెప్తుంది.
{{/usCountry}}కార్తీక్ కు సుమిత్ర థ్యాంక్స్ చెప్తుంది. తన కూతురిపై ఓ క్లారిటీ వచ్చిందని సుమిత్ర అంటుంది. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేయడం మనందరికీ టాస్క్ అని కార్తీక్ చెప్తాడు.
టూర్ కు వెళ్తానన్న స్వప్న
సీన్ శ్రీధర్ ఇంటికి మారుతుంది. ఫ్రెండ్స్ తో కలిసి టూర్ వెళ్తున్నా నాన్న అని స్వప్న చెప్తుంది. టూర్ కు రావట్లేదని నీ ఫ్రెండ్ కు చెప్పు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు వీల్లేదని శ్రీధర్ గట్టిగా చెప్తాడు. కాశీని చూడలేక టూర్ కు వెళ్దామని అనుకుంటున్నా. టూర్ కు వెళ్తున్నా. కాశీ ఇంట్లో నుంచి వెళ్లిపోయేంత వరకూ ఇంటికే రానని స్వప్న అరుస్తుంది.
శ్రీధర్ సీరియస్
చెప్పింది వినాలని శ్రీధర్ ఇంకా గట్టిగా అరుస్తాడు. జ్యోత్స్నను వైరా కిడ్నాప్ చేసిన విషయం చెప్తాడు. అలాగే నా కూతురిని కిడ్నాప్ చేశామని చెప్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని శ్రీధర్ ఆయాసపడతాడు. జీవితం విలువ గురించి చెప్తాడు. సంతోషంగా లేనంటాడు. టిఫిన్ కంప్లీట్ చేయకుండానే చేయి కడుక్కుని వెళ్లిపోతాడు శ్రీధర్.
దీపకు సారీ
మరోవైపు దీపతో సుమిత్ర మాట్లాడుతుంది. తన భర్తను మాత్రం మరొకరితో పంచుకోవాలని ఏ ఆడది అనుకోదు. ఈ రోజు నా కూతురు అన్న ప్రతి మాట నీ గుండెను చీల్చేసి ఉంటుందని నాకు తెలుసు. అందుకే సారీ చెప్తున్నా. ఆడపిల్ల ప్రవర్తన సరిగ్గా లేదంటే తల్లిదే తప్పు అని సుమిత్ర ఫీల్ అవుతుంది.
జ్యోత్స్న ఏం చిన్నపిల్ల కాదు. మీరు చెప్పారని తను మిస్ హైదరాబాద్, కంపెనీకి సీఈఓ అయిందా? ఇవన్నీ తన ఇష్టప్రకారమే జరిగాయి కదా అని దీప చెప్తుంది. అర్థమయ్యేలా చెప్పాలని దీప అంటుంది. ఇదంతా మా కర్మ అని సుమిత్ర బాధపడుతుంది.
శ్రీధర్ కు గుండెపోటు
ఇక శ్రీధర్ కారు డ్రైవ్ చేసుకుంటూ స్వప్న మాటలను తలుచుకుంటాడు. అప్పుడే శ్రీధర్ కు గుండె నొప్పి వస్తుంది. కారు ఆపిన అతను కార్తీక్ కు కాల్ చేసేందుకు ట్రై చేసి, స్పృహ కోల్పోతాడు. అక్కడికి వచ్చిన జనాలు అంబులెన్స్ కు కాల్ చేస్తారు.
అప్పుడే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. క్యాబ్ లో హాస్పిటల్ కు తీసుకెళ్దామని కారు డోర్ ను బలంగా తెరిచి శ్రీధర్ ప్రాణాలు కాపాడతాడు. హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో కార్తీక్ కంగారుగా వెళ్తాడు. బెడ్ మీద తండ్రిని చూసి బాధపడతాడు. జరగిన విషయాన్ని శ్రీధర్ చెప్తాడు.
నిన్ను సేవ్ చేసిన మనిషికి థ్యాంక్స్ చెప్పాలని కార్తీక్ బయటకు వెళ్తాడు. అక్కడే ఆ వ్యక్తిని ఢీ కొడతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.