సౌత్‌లో మంచి క్రెజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ఈ మూవీలో ప్రదీప్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి నటించింది. 'లవ్ టుడే' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్‌కు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ప్రదీప్ సినిమాల కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా ఎల్ఐకే చిత్రం కేవలం 60.23 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ప్రదీప్ గత చిత్రాలైన 'డ్రాగన్' (రూ. 151 కోట్లు), 'డ్యూడ్' (రూ. 114 కోట్లు) వంద కోట్ల క్లబ్‌లో చేరగా, ఈ సినిమా ఆ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విఫలమైంది.
ఈ సినిమాకు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. విఘ్నేష్ శివన్ మార్క్ కామెడీ, ఎస్.జె. సూర్య నటన ఉన్నప్పటికీ, కథలో వేగం లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. భవిష్యుత్తులో ప్రేమ ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ లవ్ రొమాంటిక్ కామెడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని తెరకెక్కించారు.
అసలు కథేంటంటే?
2040వ సంవత్సరం నేపథ్యంలో సాగే ఈ కథలో భవిష్యత్తు టెక్నాలజీని చూపించారు. డేటింగ్ యాప్స్ ద్వారా పార్ట్నర్లను వెతుక్కునే కాలంలో, సహజంగా ప్రేమలో పడాలని కోరుకునే ఒక యువకుడి ప్రయాణమే ఈ సినిమా.
2019లోనే శివకార్తికేయన్‌తో ఈ సినిమాను విఘ్నేష్ శివన్ ప్రారంభించాల్సి ఉన్నా, పలు కారణాలతో వాయిదా పడుతూ చివరకు ప్రదీప్ రంగనాథన్ హీరోగా గతేడాది పట్టాలెక్కింది. ఇందులో యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఐఎమ్‌డీబీలో పదికి 6.9 రేటింగ్ అందుకున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీలోకి వచ్చేయనుంది.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ రిలీజ్ డేట్
ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఎల్ఐకే సినిమా, కేవలం 26 రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ రిలీజ్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
{{/usCountry}}ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఎల్ఐకే సినిమా, కేవలం 26 రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ రిలీజ్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
{{/usCountry}}మే 6 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ వంటి 5 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. "పాత పద్ధతులు వర్సెస్ ఆధునిక రూల్స్ మధ్య జరిగే ఈ ప్రేమ యుద్ధం" అంటూ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఎల్ఐకే ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ప్రదీప్ కెరీర్‌లో చూడకుండా వదిలేయాల్సిన మొదటి సినిమా ఇదే" అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు తలనొప్పి కలిగించే సినిమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రదీప్ రంగనాథన్‌కి ఉన్న క్రేజ్ వల్ల లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, అవి అందుకోవడంలో విఘ్నేష్ శివన్ విఫలమయ్యారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ, డిఫరెంట్ అటెంప్ట్‌గా వచ్చిన ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవాళ్లు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు?
ఈ సినిమా మే 6, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
2. ఈ సినిమా ఏ భాషల్లో అందుబాటులో ఉంటుంది?
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
3. 'లవ్ ఇన్సూరెన్స్ కొంపెనీ' సినిమాలో హీరోయిన్ ఎవరు?
ఈ చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటించింది.
4. ఈ సినిమా దర్శకుడు ఎవరు?
ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.