Super Hit Love Mocktail 3 OTT Streaming Date Announced: కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫ్రాంచైజీ 'లవ్ మాక్‌టెయిల్'. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి ఆఖరి భాగమైన లవ్ మాక్‌టెయిల్ ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలోనే మీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా అరచేతిలోకి రానుంది.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం

హీరో డార్లింగ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన 'లవ్ మాక్‌టెయిల్ 3' ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదలైంది. తొలి రెండు భాగాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 25 రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
కృష్ణ, మిలనా నాగరాజ్ సంయుక్తంగా తమ సొంత బ్యానర్ 'క్రిస్మీ ఫిల్మ్స్'పై ఈ లవ్ మాక్‌టెయిల్ 3 చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
కన్నడలో రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన లవ్ మాక్‌టెయిల్ 3 ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. మే 8వ తేదీ నుంచి జీ5లో మాక్‌టెయిల్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.
"గుండె లోతుల్లోకి వెళ్లే ఒక అందమైన కథ.. ఆది జీవితంలోని కొత్త అధ్యాయాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ జీ5 ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన తెలుగు ప్రేక్షకులు కూడా సబ్‌టైటిల్స్ లేదా డబ్బింగ్ వెర్షన్ ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఆది ప్రయాణంలో మరో మలుపు
'లవ్ మాక్‌టెయిల్' సిరీస్ ప్రతి భాగంతోనూ పరిణితి చెందుతూ వచ్చింది. మొదటి భాగంలో కృష్ణను ఒక సరదా యువకుడిగా చూపిస్తే, రెండో భాగంలో భార్యను కోల్పోయిన బాధలో ఉండే వ్యక్తిగా ఎమోషనల్‌గా చూపించారు.
{{/usCountry}}'లవ్ మాక్‌టెయిల్' సిరీస్ ప్రతి భాగంతోనూ పరిణితి చెందుతూ వచ్చింది. మొదటి భాగంలో కృష్ణను ఒక సరదా యువకుడిగా చూపిస్తే, రెండో భాగంలో భార్యను కోల్పోయిన బాధలో ఉండే వ్యక్తిగా ఎమోషనల్‌గా చూపించారు.
{{/usCountry}}అయితే, ఈ మూడో భాగంలో కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా, మెచ్యూర్‌డ్‌గా సాగుతుంది. ఇందులో ఆది ఒక తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఒక తండ్రిగా తన బాధ్యతలు, భావోద్వేగాలను దర్శకుడు కృష్ణ చాలా సహజంగా తెరకెక్కించారని విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.2 రేటింగ్ కూడా వచ్చింది.
సాంకేతిక నిపుణులు, తారాగణం
ఈ చిత్రానికి నకుల్ అభ్యంకర్ అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. శ్రీ క్రేజీ మైండ్స్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. రేచల్ డేవిడ్, అమృత అయ్యంగార్, రజనీ భరద్వాజ్, శ్వేత ప్రసాద్, దిలీప్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
జీ5 ఓటీటీలో
ఆది పాత్రలో డార్లింగ్ కృష్ణ నటన ఈ సినిమాకు ప్రాణం పోసిందని రివ్యూలు వచ్చాయి. మరి ఇలాంటి లవ్ మాక్‌టెయిల్ 3 ఓటీటీ రిలీజ్ కానుంది. మే 8 నుంచి జీ5 ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.