...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా- అదృష్టం తీసుకొచ్చే కుక్కపిల్ల కథ- 7 భాషల్లో!

OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ నేరుగా ఫీల్ గుడ్ ఫ్యామిలీ పొలిటికల్ కామెడీ డ్రామా సినిమా లక్కీ ది సూపర్‌స్టార్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అదృష్టం తీసుకొచ్చే కుక్కపిల్ల కోసం ఓ ఫ్యామిలీ చేసే పోరాటంగా ఈ సినిమా తెరకెక్కింది. 7 భాషల్లో లక్కీ ది సూపర్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కడో చూద్దాం.

Published on: Feb 20, 2026, 13:55:18 IST
Advertisement

ఓటీటీల్లో హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ వంటి అనేక రకాల జోనర్లలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. కానీ, మంచి ఫీల్ గుడ్ మూవీలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. యూనిక్ స్టోరీతోపాటు ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు ఉండే సినిమాలు హృదయానికి హత్తుకునేలా చేస్తాయి.

హీరోగా మ్యూజిక్ డైరెక్టర్

ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ  కామెడీ డ్రామా- అదృష్టం తీసుకొచ్చే కుక్కపిల్ల కథ- 7 భాషల్లో!
ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా- అదృష్టం తీసుకొచ్చే కుక్కపిల్ల కథ- 7 భాషల్లో!

అలాంటి సినిమానే ఇవాళ (ఫిబ్రవరి 20) నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీనే లక్కీ ది సూపర్‌స్టార్. తమిళంలో ఫీల్ గుడ్ పొలిటికల్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా లక్కీ ది సూపర్‌స్టార్ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడుగా చేశాడు.

మలయాళ భామ అనస్వర రాజన్

అలాగే, ఇటీవల తెలుగులో ఛాంపియన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ అనస్వర రాజన్ కథానాయికగా హీరోకు జోడీగా చేసింది. ఈ ఇద్దరితోపాటు లక్కీ ది సూపర్‌స్టార్ సినిమాలో ఆర్ శరత్ కుమార్, సుబ్బు పంచు, దేవదర్శిని, ఎలంగో కుమరవేల్, ఆడుకాలం నరేన్, మధుసూదన్ రావు, ఉదయభాను మహేశ్వరన్, డేనియల్ అన్నీ పోప్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

కుక్కకు కోవై సరళ డబ్బింగ్

వీధి కుక్కకు ప్రముఖ లేడి కమెడియన్ కోవై సరళ తమిళంలో డబ్బింగ్ ఇచ్చారు. లక్కీ ది సూపర్‌స్టార్ సినిమా అదృష్టం తీసుకొచ్చే కుక్క పిల్ల చుట్టూ తిరుగుతుంది. ఓ వీధి కుక్కకు జన్మించిన పప్పీకి లక్కీ అని పేరు పెట్టి హీరో ఫ్యామిలీ పెంచుకుంటుంది. లక్కీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ల తలరాత మారుతుంది. అదృష్టం పడుతుంది.

అదృష్టం తీసుకొచ్చే కుక్కపిల్ల

మరోవైపు హీరో అన్న కూతురు అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉంటుంది. దానికి ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. తనకు ఎంతో ఇష్టమైన లక్కీ వస్తే ఎలాంటి ట్రీట్‌మెంట్ లేకుండా అన్న కూతురు బతుకుతుందని, ఎలాగైనా తీసుకురావాలని తన గ్యాంగ్‌తో ప్రయత్నాలు చేస్తుంటాడు హీరో.

లక్కీ ది సూపర్‌స్టార్ ఓటీటీ రిలీజ్

ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. పొలిటికల్ డ్రామా, కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో మంచి ఫీల్ గుడ్ మూవీలా లక్కీ ది సూపర్‌స్టార్ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ఉదయభాను మహేశ్వరన్. ఇలాంటి లక్కీ ది సూపర్‌స్టార్ ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 20) డైరెక్ట్ రిలీజ్ అయింది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

జియో హాట్‌స్టార్‌లో నేడు లక్కీ ది సూపర్‌స్టార్ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠి, బెంగాలి వంటి 7 భాషల్లో హాట్‌స్టార్‌లో లక్కీ ది సూపర్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. పిల్లలు, ఫ్యామిలీతో మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునేవారు లక్కీ ది సూపర్‌స్టార్‌పై లుక్కేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks