M4M OTT Release Today On 2 Platforms: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఎప్పుడూ ప్రత్యేకమే. క్లైమాక్స్ వరకు ఊపిరి బిగబట్టే ఉత్కంఠతో సాగే సరికొత్త కథాంశంతో రూపొందే సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓటీటీ లవర్స్.
మంచి రివ్యూలు

అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన తెలుగు మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ఎమ్4ఎమ్ మోటివ్ ఫర్ మర్డర్ (‘M4M’ Motive For Murder). ఈ సినిమా మే 8న థియేటర్లలో విడుదలై మంచి రివ్యూలు అందుకుంది.
9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్
అయితే, ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమా అంటూ ఒకటి థియేటర్లలోకి వచ్చిందన్న విషయం చాలా వరకు ఆడియెన్స్‌కు తెలియకపోయింది. అందుకే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా పెద్దగా హిట్ సాధించలకేపోయింది. కానీ, ఐఎమ్‌డీబీలో 9.1/10, బుక్‌మైషోలో 9.6/10 లాంటి అసాధారణ రేటింగ్‌లను సొంతం చేసుకుంది ఎమ్4ఎమ్ సినిమా.
ఆకట్టుకునే కథ.. ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే
ప్రముఖ దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం సస్పెన్స్, మిస్టరీ, డ్రామా, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని సమాచారం. ఒక పక్కా ప్లాన్‌తో వరుసగా జరుగుతున్న హత్యల వెనుక ఉన్న అసలు కారణం (Motive) ఏంటి? అసలు హంతకుడు ఎవరు? అనే కోణంలో కథ నడుస్తుంది.
డెడ్ బాడీలతో పెయింటింగ్ వేయడం
ప్రతి సీన్ లోనూ ఊహించని ట్విస్టులు ఇస్తూ, చివరి నిమిషం వరకు కిల్లర్ ఎవరనే సస్పెన్స్‌ను దర్శకుడు స్క్రీన్‌పై చూపించిన తీరు బాగుంటుందని టాక్. చంపేసి వారి డెడ్ బాడీలతోనే సైకో పెయింటింగ్ వేయడం కథ కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఈ స్క్రీన్‌ప్లే నచ్చేలా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా జో శర్మ నటన హైలైట్!
{{/usCountry}}ప్రతి సీన్ లోనూ ఊహించని ట్విస్టులు ఇస్తూ, చివరి నిమిషం వరకు కిల్లర్ ఎవరనే సస్పెన్స్‌ను దర్శకుడు స్క్రీన్‌పై చూపించిన తీరు బాగుంటుందని టాక్. చంపేసి వారి డెడ్ బాడీలతోనే సైకో పెయింటింగ్ వేయడం కథ కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఈ స్క్రీన్‌ప్లే నచ్చేలా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా జో శర్మ నటన హైలైట్!
{{/usCountry}}ఈ సినిమాకు ప్రధాన బలం హీరోయిన్ జో శర్మ నటన అని రివ్యూలో చెప్పారు. అమెరికన్ నటి అయిన జో శర్మ.. ఇందులో రాధ అనే పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు. హీరో సంబీత్ ఆచార్య కూడా తన పరిణతి చెందిన నటనతో మెప్పించారని టాక్ వచ్చింది.
రెంటల్ విధానంలో
ఇలాంటి రివ్యూలతో వచ్చిన ఎమ్4ఎమ్ ఇవాళ (జూన్ 19) 2 ఓటీటీల్లోకి వచ్చేసింది. అంటే, థియేటర్లలో విడుదలైన 40 రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది ఎమ్4ఎమ్ మోటివ్ ఫర్ మర్డర్ సినిమా. అమెజాన్ ప్రైమ్‌తోపాటు లయన్స్ గేట్ ప్లేలో నేటి నుంచి ఎమ్4ఎమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో
అయితే, అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం రెంటల్ విధానంలో ఎమ్4ఎమ్ ఓటీటీ రిలీజ్ అయింది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు మాత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఎమ్4ఎమ్ సినిమాను తెలుగులో ఫ్రీగా చూసేయొచ్చు.