టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత మాత్రం మారదు. ప్రస్తుతం మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ ట్రావెల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (Varanasi) షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
వారణాసికి బ్రేక్ ఇచ్చి

అయితే, నిరంతర షూటింగ్ షెడ్యూల్స్ మధ్య దొరికిన చిన్న విరామాన్ని మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. వారణాసికి బ్రేక్ ఇచ్చి తన ముగ్గురు సోదరీమణులు, భార్య నమ్రత, మేనల్లుళ్లు, మేనకోడళ్లతో కలిసి మహేశ్ బాబు సరదాగా గడిపిన అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు సోదరీమణులతో
మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని, బావ స్వరూప్ సంజయ్ ఈ ఫ్యామిలీ గెట్-టుగెదర్ ఫోటోలను షేర్ చేశారు. వైట్ షర్ట్, జీన్స్, నెత్తిన బెయిజ్ కలర్ క్యాప్‌తో మహేష్ ఎంతో స్టైలిష్‌గా, రిలాక్స్‌డ్ లుక్‌లో కనిపించారు.
ముఖ్యంగా తన ముగ్గురు సోదరీమణులు పద్మావతి, మంజుల, ప్రియదర్శినిలతో కలిసి మహేష్ దిగిన గ్రూప్ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఘట్టమనేని కుటుంబంలో ఇలాంటి రేర్ మూమెంట్స్ చూడటం ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.
మేనల్లుడు అశోక్ గల్లాతో
ఈ వేడుకలో తన మేనల్లుడు, యువ హీరో అశోక్ గల్లాతో కలిసి కూడా మహేష్ బాబు ఫోటోలకు పోజులిచ్చారు. "ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు హీరోలు" అంటూ అభిమానులు ఈ ఫోటో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నమ్రత శిరోద్కర్, మంజుల, సంజయ్‌లతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
దివంగత రమేష్ బాబు కుమార్తె భారతి ఘట్టమనేని కూడా ఈ వేడుకలో కనిపించడం విశేషం. మహేష్ బాబు 50 ఏళ్ల వయసులో కూడా ఇంత ‘యంగ్ అండ్ ఛార్మింగ్’గా ఎలా ఉన్నారో చెప్పాలంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో దిగిన మహేశ్ బాబు అరుదైన ఫొటోలు నెట్టింట్లో అట్రాక్ట్ చేస్తున్నాయి.
టైమ్ ట్రావెల్ కథతో
{{/usCountry}}దివంగత రమేష్ బాబు కుమార్తె భారతి ఘట్టమనేని కూడా ఈ వేడుకలో కనిపించడం విశేషం. మహేష్ బాబు 50 ఏళ్ల వయసులో కూడా ఇంత ‘యంగ్ అండ్ ఛార్మింగ్’గా ఎలా ఉన్నారో చెప్పాలంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో దిగిన మహేశ్ బాబు అరుదైన ఫొటోలు నెట్టింట్లో అట్రాక్ట్ చేస్తున్నాయి.
టైమ్ ట్రావెల్ కథతో
{{/usCountry}}ఇకపోతే మహేశ్ బాబు-రాజమౌళి వారణాసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ కథాంశంతో వస్తున్న ‘వారణాసి’లో మహేష్ ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం.
వారణాసి బడ్జెట్
దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం 2027 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు అశోక్ గల్లా కూడా హీరోగా రాణిస్తున్నాడు. హీరో, దేవకీ నందన వాసుదేవ సినిమాలు చేసిన అశోక్ గల్లా 'VISA - వింటారా సరదాగా' సినిమాతో రానున్నాడు.