...
...
Next Story

Mahesh Babu Keerthy Suresh: మహేశ్ బాబుకే షాక్ ఇచ్చిన కీర్తి సురేష్- దెబ్బకు సారీ చెప్పేసిన సూపర్ స్టార్- అసలు ఏమైందంటే?

Mahesh Babu Shocked By Keerthy Suresh: టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా మహేశ్ బాబుకు, మహానటిగా కీర్తి సురేష్‌కు సూపర్ క్రేజ్ ఉంది. అలాంటిది ఓ సమయంలో మహేశ్ బాబుకే పెద్ద షాక్ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చింది కీర్తి సురేష్. దాంతో అవాక్కయిన మహేశ్ బాబు సారీ చెప్పాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Published on: May 31, 2026, 19:09:56 IST
Advertisement

Mahesh Babu Shocked By Keerthy Suresh: ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరో. మరొకరు మహానటి. అతి తక్కువ సమయంలోనే నటనతో నేషనల్ అవార్డ్ అందుకున్న బ్యూటిపుల్ హీరోయిన్. ఈ ఇద్దరి గురించి ఈపాటికే అర్థమై ఉంటుంది. ఒకరు మహేశ్ బాబు అయితే, మరొకరు కీర్తి సురేష్.

క్రేజీ కాంబినేషన్‌లో

మహేశ్ బాబుకే షాక్ ఇచ్చిన కీర్తి సురేష్- దెబ్బకు సారీ చెప్పేసిన సూపర్ స్టార్- అసలు ఏమైందంటే?
మహేశ్ బాబుకే షాక్ ఇచ్చిన కీర్తి సురేష్- దెబ్బకు సారీ చెప్పేసిన సూపర్ స్టార్- అసలు ఏమైందంటే?

మహేశ్ బాబు, కీర్తి సురేష్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు సినిమా సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ అంచనాలను థియేటర్లలో విడుదలైన తర్వాత సర్కారు వారి పాట అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది ఈ మూవీ.

2022, మే 12న థియేటర్లలో విడుదలైన సర్కారు వారి పాట సినిమా కోసం డైరెక్టర్‌తోపాటు మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే మీమర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్‌తో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహేశ్ బాబుకు ఊహించని షాక్ ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. దాంతో మహేశ్ బాబు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది.

దొంగతనం గురించి

అయితే, సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌లో మహేశ్ బాబు పర్స్‌ను కీర్తి సురేష్ కొట్టేస్తుందన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రశ్ననే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అడిగాడు. ఆ ఈవెంట్‌లో "కళావతి సాంగ్‌లో మహేశ్ సార్ పర్స్ కొట్టేశారు కదా. అలాగే, మీ నిజ జీవితంలో అలాంటి చిలిపి దొంగతనాలు చేశారా మీరు" అని అతను అడిగాడు.

తర్వాత తెగ నవ్వేశాడు. "నిజానికి నాకు అది అలవాటే" అని నవ్వుతూ మరో బాంబ్ పేల్చింది కీర్తి సురేష్. ఇలా దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు "బాబుకే పంచ్ ఆ.." "బాబ్ అస్సలు ఊహించి ఉండడు", "మహేశ్ బాబుకే కీర్తి సురేష్ షాక్ ఇచ్చింది" అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, సర్కారు వారి పాట సినిమాను బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, పెద్దలు చేసే అప్పులు మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే సామాజిక అంశానికి కాస్త కమర్షియల్ హంగులతో దర్శకుడు తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది.

సరికొత్త మేనరిజమ్స్

అయితే, ఈ సినిమాలో మహేశ్ బాబు మార్క్ కామెడీ టైమింగ్, సరికొత్త మేనరిజమ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కీర్తి సురేష్‌తో సాగే లవ్ ట్రాక్, వెన్నెల కిషోర్ కామెడీ పండాయి. సముద్రఖని విలనిజం కూడా పర్వాలేదనిపించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe