...
...
Next Story

నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే చేసుకోండి, ఆట కట్టించే తీరుతాను: మెగాస్టార్ సీన్ అభ్యంతర వివాదంపై హీరోయిన్ పార్వతి

Parvathy Thiruvothu On Mammootty Scene Controversy: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాపై గతంలో చేసిన విమర్శల కారణంగా ఎదుర్కొన్న దారుణమైన వేధింపులను హీరోయిన్ పార్వతి తిరువోతు మరోసారి గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌ను నాశనం చేయాలని చూసినా వెనకడుగు వేయలేదని, ఇప్పటికీ పోరాడుతానని పార్వతి చెప్పుకొచ్చారు.

Published on: Nov 22, 2026, 08:30:43 IST
Advertisement

Parvathy Thiruvothu On Mammootty Scene Controversy: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో పాటు ముక్కుసూటితనానికి మారుపేరుగా నిలిచిన మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు మరోసారి వార్తల్లో నిలిచారు. 'బెంగళూరు డేస్', 'చార్లీ', 'తంగలాన్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన పార్వతి, గతంలో తాను ఎదుర్కొన్న అత్యంత గడ్డుకాలాన్ని తాజాగా బయటపెట్టారు.

2017 నాటి కసాబ

నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే చేసుకోండి, ఆట కట్టించే తీరుతాను: మెగాస్టార్ సీన్ అభ్యంతర వివాదంపై హీరోయిన్ పార్వతి
నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే చేసుకోండి, ఆట కట్టించే తీరుతాను: మెగాస్టార్ సీన్ అభ్యంతర వివాదంపై హీరోయిన్ పార్వతి

రంజిని హరిదాస్ నిర్వహిస్తున్న 'ది గ్రీన్ రూమ్' సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న పార్వతి తిరువోతు.. 2017 నాటి 'కసాబ' సినిమా వివాదం తర్వాత తనపై జరిగిన సైబర్ దాడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు ఏం జరిగిందంటే?

2016లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన 'కసాబ' చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఏడాది అంటే 2017లో కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFK) వేదికగా 'ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్' (WCC) నిర్వహించిన చర్చలో పార్వతి పాల్గొన్నారు.

ఆ సినిమాలో మహిళలను కించపరిచేలా ఉన్న సంభాషణలపై పార్వతి తిరువోతు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడు మహిళలను అవమానించే సన్నివేశాల్లో నటించడం తనను నిరాశపరిచిందని ఆమె అభిప్రాయపడ్డారు. దాంతో ఆ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.

అత్యాచార, హత్య బెదిరింపులకు

కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా పార్వతిపై అసభ్యకరమైన ట్రోలింగ్‌కు దిగారు. ఏకంగా అత్యాచార, హత్య బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

ఆ చేదు అనుభవాలను తలచుకుంటూ పార్వతి భావోద్వేగానికి లోనయ్యారు. ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉన్న చాలామంది ఆ సమయంలో కావాలనే దూరంగా జరిగారని, తనను పూర్తిగా ఒంటరిని చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"ఆ రోజు నాపై వచ్చిన ద్వేషం కేవలం నా ఒక్కరిపైనే వచ్చింది కాదు. సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పితృస్వామ్య భావజాలం, స్త్రీ ద్వేషం బయటపడటానికి నేను ఒక మాధ్యమంగా మారాను అంతే" అని పార్వతి విశ్లేషించారు. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి తన ఆరోగ్యంపై, మానసిక స్థైర్యంపై దృష్టి పెట్టానని తెలిపారు.

"నా జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేయాలని వాళ్లు అనుకుంటే చేసుకోనివ్వండి. కానీ నేను మాత్రం పోరాడకుండా వదిలిపెట్టను. వాళ్ల ఆట కట్టించే తీరుతానని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను" అని పార్వతి తనలోని పోరాట పటిమను చాటుకున్నారు.

జాతీయ అవార్డు నుంచి హృతిక్ రోషన్ సిరీస్ వరకు..

ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా పార్వతి తిరువోతు తన నటనతోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. 'టేక్ ఆఫ్' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఆమె, 'ఉయిరే', 'ఖరీబ్ ఖరీబ్ సింగిల్', 'మరియన్' వంటి చిత్రాలతో మెప్పించారు. గతేడాది మలయాళంలో వచ్చిన 'ఉల్లోళుక్కు'తో పాటు తమిళంలో 'తంగలాన్', 'హర్' సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇటీవల మలయాళంలో 'ప్రథమ దృష్ట్యా కుట్టక్కార్', 'ఐ, నోబడీ' చిత్రాల్లో కనిపించారు.

ప్రస్తుతం పార్వతి బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన సొంత నిర్మాణ సంస్థ 'హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్' (HRX Films) బ్యానర్‌పై తొలిసారిగా నిర్మిస్తున్న ఓటీటీ సిరీస్ 'ది స్టోర్మ్' (The Storm)లో పార్వతి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం అజిత్‌పాల్ సింగ్ ఈ ఓటీటీ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ థ్రిల్లర్ డ్రామాకు అజిత్‌పాల్ సింగ్, ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ కథ అందించారు. ఇందులో అలయా ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ, సబా ఆజాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేధింపులకు భయపడకుండా ధైర్యంగా నిలబడిన పార్వతి తిరువోతు.. నేడు పాన్-ఇండియా స్థాయిలో సత్తా చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks