ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు ఈ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్

ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో ఫిబ్రవరి 11న మన శంకర వరప్రసాద్ ఓటీటీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి, నయనతార, వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నెట్టింట్లో చిరంజీవి, నయనతార, వెంకటేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బంధాలు బాంధవ్యాల గురించి
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "మన శంకర వర ప్రసాద్ గారు అనేది కుటుంబంలోని బంధాలు, బాంధవ్యాలు గురించి చెప్పిన ఎంటర్‌టైనర్. ఈ సినిమాపై థియేటర్లలో ప్రేక్షకులు చూపిన ప్రేమ మాకెంతో ఆనందాన్నిచ్చింది" అని అన్నారు.
ప్రజల ఇళ్లలోకి చేరడం
"ఇప్పుడు జీ5 ఓటీటీ ద్వారా ఈ సినిమా ఇంకా ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో ఉన్న ప్రేక్షకుల దగ్గరకు చేరువ కానుండంటం మరింత సంతోషంగా ఉంది. ఒక కథ సినిమాహాళ్లను దాటి, నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరడం అనేది ఎప్పుడూ చాలా ప్రత్యేకమే" అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు.
యాక్షన్ ఎలిమెంట్స్ కూడా
నయనతార మాట్లాడుతూ.. "ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. దీనికి తోడు చక్కటి హాస్యం, మంచి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ కలయికలో రూపొందటమే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది" అని అన్నారు.
ఇంట్లో కూర్చుని ఆస్వాదిస్తారని
"చిరంజీవి గారితో పాటు మొత్తం టీమ్‌తో కలిసి పని చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ5లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను ఇంట్లో కూర్చొని చూసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను" అని లేడి సూపర్ స్టార్ నయనతార పేర్కొన్నారు.
హృదయాన్ని తాకే బంధాలతో
{{/usCountry}}"చిరంజీవి గారితో పాటు మొత్తం టీమ్‌తో కలిసి పని చేయడం నాకు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ5లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను ఇంట్లో కూర్చొని చూసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను" అని లేడి సూపర్ స్టార్ నయనతార పేర్కొన్నారు.
హృదయాన్ని తాకే బంధాలతో
{{/usCountry}}వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ "మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, చక్కటి వినోదాన్ని.. హృదయాన్ని తాకే బంధాలతో, ఎమోషన్స్‌తో చక్కగా కలగలిపి సినిమా చేశారు. చిరంజీవి గారితో తొలిసారి కలిసి పని చేయడంతో ఈ జర్నీ నాకింకా ప్రత్యేకంగా మారింది" అని తెలిపారు.
జీ5 ఓటీటీ ద్వారా
"ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు జీ5 ఓటీటీ ద్వారా అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వరకు చేరుతుండటం చాలా సంతోషంగా ఉంది. కుటుంబం అంతా కలిసి ఈ సినిమాలోని భావోద్వేగం, హాస్యం, డ్రామాను ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది" అని వెంకటేష్ ఆశించారు.