ఓటీటీ సినిమాలు అనగానే అన్ని రకాల జోనర్స్‌తో అలరిస్తుంటాయి. ఇక తెలుగులో వచ్చే డిఫరెంట్ జోనర్స్ మూవీస్ ఓటీటీ ప్రియులను ఊరిస్తుంటాయి. అయితే, ఇటీవల కాలంలో తెలుగులో అన్ని రకాల జోనర్ మూవీస్ వచ్చినప్పటికీ బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలు తక్కువగా అయ్యాయి.
బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా

కానీ, గతేడాది థియేటర్లలో ఓ తెలుగు బోల్డ్ మూవీ సందడి చేసింది. కానీ, అనుకున్నంత క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఆ సినిమానే మారియో. 90స్ కిడ్స్‌కు సూపర్ మారియో గేమ్ ఎంత ఇష్టమో తెలిసిందే. అదే టైటిల్‌తో తెలుగులో బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా మారియో తెరకెక్కింది.
రియల్ లైఫ్ హీరోయిన్ పాత్రలో
మారియో సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ మెయిన్ లీడ్‌గా చేసింది. అంతేకాకుండా రియల్ లైఫ్ హీరోయిన్‌గా హెబ్బా పటేల్ పేరుతోనే మారియో సినిమాలో యాక్ట్ చేసింది ఈ బ్యూటి. అలాగే, ఈ సినిమాలో ప్రముఖ డైలాగ్ రైటర్, లిరిసిస్ట్, నటుడు రాకేందు మౌళి బాబ్ మార్లేగా కీలక పాత్ర పోషించారు.
రాకేందు మౌళి సంగీతం
హెబ్బా పటేల్, రాకేందు మౌళితోపాటు నటి కల్పిక గణేష్, మదీ మానేపల్లి, అనిరుధ్ శ్రీవాత్సవ, యష్నీ, మౌర్య సిద్ధవరం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కల్యాంజి గోగన దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సాయి కార్తీక్‌తోపాటు నటుడు రాకేందు మౌళి సంగీతం అందించడం విశేషం.
మారియో రేటింగ్
సిల్వర్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్, కల్యాంజి కంటెంట్ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన మారియో సినిమా 2025లో డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. అయితే, పెద్దగా రెస్పాన్స్ అందుకోలేదు. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి 8.6 రేటింగ్‌ను మాత్రం దక్కించుకుంది.
బలంగా 3 కోరికలు
{{/usCountry}}సిల్వర్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్, కల్యాంజి కంటెంట్ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన మారియో సినిమా 2025లో డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. అయితే, పెద్దగా రెస్పాన్స్ అందుకోలేదు. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి 8.6 రేటింగ్‌ను మాత్రం దక్కించుకుంది.
బలంగా 3 కోరికలు
{{/usCountry}}మారియో సినిమా ఒక డ్రగ్ చుట్టూ తిరుగుతుంది. ఆ డ్రగ్ తీసుకున్నవాళ్లకు మూడు కోరికలు బలంగా కలుగుతాయి. డ్రగ్ తీసుకున్నవాళ్లకు గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, సెక్స్ వంటి మూడు కోరికలు విపరీతంగా కలుగుతాయి. అలాంటి డ్రగ్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మారియో కథ.
హాట్ అండ్ బోల్డ్ సీన్స్
మారియో హాట్ అండ్ బోల్డ్ సీన్స్ బాగానే ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. హెబ్బా పటేల్ కిస్సింగ్ సీన్స్‌తో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇలాంటి తెలుగు బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మారియో ఓటీటీలోకి ఇవాళ (జనవరి 23) వచ్చేసింది. అది కూడా రెండు ఓటీటీల్లోకి.
మారియో ఓటీటీ స్ట్రీమింగ్
ఆహాలో నేటి నుంచి మారియో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో కూడా మారియో ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఎంచక్కా మారియో సినిమాను ఆహా, అమెజాన్ ప్రైమ్ వంటి రెడు ఓటీటీల్లో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.